
ఛటేశ్వర్ పూజారా.. టెస్ట్ క్రికెట్ లో తనదైన శైలీలో దూసుకుసుకుపోతున్నారు. శ్రీలంకలో పర్యటిస్తున్న పూజారా మొదటి టెస్టులో అద్బుతంగా రాణించాడు. త్వరలో 50వ టెస్టు మ్యాచ్ ఆడనున్నారు. అందుకు ఒక స్పోర్ట్స్ ఛానేల్ పుజారాను ఇంటర్వూ చేసింది. అందులలో తన గురించి పలు విషయాలు వెల్లడించారు. తన కేరిర్ ఈ స్థాయిలో ఉందంటే కారణం మా నాన్న చేస్తున్న చెత్త విమర్శలే కారణం అని తెలిపారు.
నేను ఎంత భాగా ఆడినా మా నాన్నకి అస్సలు నచ్చేది కాదని నేను ఏం చేసిన ఎదో ఒక రకంగా బాగోలేదని విమర్శలు చేసేవాడని, తన మాటలను భాలేంజ్ గా తీసుకొని మరింత మంచిగా ఆడటానికి ప్రయత్నించే వాడినని పుజారా తెలిపాడు. మా ఇద్దరి మధ్య ఏ విషయం మీద కూడా కనీసం సఖ్యత కుదిరేది కాదని, చివరి తనదే నెగ్గించుకునే వాడని పుజారా తెలిపారు, కానీ మా నాన్న నా జీవితంలో నిజమైనా హీరో, ఆయన లేకుంటే నేను ఇప్పుడు ఈ స్థాయిలో ఉండేవాడిని కాదని, నా ఎదుగుదలకి పూర్తి క్రెడిట్ మా నాన్నకే వర్థిస్తుందని ఆయన తెలిపారు.
ఛటేశ్వర్ పూజారా 50వ టెస్టును కొలంబోలో శ్రీలంకతో ఆడనున్నాడు.