రోడ్డు ప్రమాదానికి గురైన మిర్యాలగూడ ఎమ్మెల్యే (వీడియో)

Published : Feb 05, 2018, 04:37 PM ISTUpdated : Mar 25, 2018, 11:52 PM IST
రోడ్డు ప్రమాదానికి గురైన మిర్యాలగూడ ఎమ్మెల్యే  (వీడియో)

సారాంశం

మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కర్ రావు కు తప్పిన ఫెను ప్రమాదం ప్రమాదానికి గురైన ఎమ్మెల్యే కారు

నల్గొండ జిల్లా వేములపల్లి మండలం బుగ్గబావి గూడెం వద్ద స్థానిక ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌రావు  ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురయ్యింది. గ్రామంలో గంగమ్మ జాతరలో పాల్గొనడానికి వెళుతుండగా ఆయన ప్రయాణిస్తున్న కారుని వెనుకనుండి వచ్చిన మరో వాహనం ఢీకొట్టింది.  ఈ సమయంలో కారులోనే వున్న ఎమ్మెల్యేకు ఎలాంటి ప్రమాదం జరగలేదు. కానీ   కారు పాక్షికంగా ధ్వంసమయ్యింది.

భక్తులతో రద్దీగా వున్న జాతరలోకి దూసుకువచ్చిర ఓ కారు మహిళను ఢీకొట్టి సడన్ గా ఆగింది.ఇదే సమయంలో అక్కడికి వచ్చిన ఎమ్మెల్యే కారు డ్రైవర్  ఈ ప్రమాదాన్ని గుర్తించి సడన్ గా బ్రేక్ వేశాడు. ఈ క్రమంలో వెనుక నుండి వచ్చిన మరో వాహనం ఎమ్మెల్యే వాహనాన్ని ఢీ కొనడంతో ప్రమాదం జరిగింది.  

ఈ ప్రమాదంలో గాయపడిన మహిళను హూటాహుటిన మిర్యాలగూడ ఏరియా హాస్పటల్ కు తరలించారు .అక్కడి నుండి మెరుగైన చికిత్స కోసం పట్టణంలోని ఓ ప్రైవేటు హాస్పటల్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు .గాయపడ్డ మహిళను హైద్రాబాద్ కు చెందిన రేణుకగా గుర్తించారు.

వీడియో

 

PREV
click me!

Recommended Stories

పెద్దపులి, ఎలుగుబంటి ప్రెండ్లీ ఫైటింగ్ (వీడియో)
సినీ నటి, ఎమ్మెల్యే రోజా బ్యాటింగ్ (వీడియో)