తాగుబోతులపై హరీష్ దిమ్మతిరిగే పంచ్ (వీడియో)

Published : Feb 27, 2018, 12:36 PM ISTUpdated : Mar 25, 2018, 11:52 PM IST
తాగుబోతులపై హరీష్ దిమ్మతిరిగే పంచ్ (వీడియో)

సారాంశం

తాగుబోతుల గురించి హరిష్ పంచ్ డైలాగ్స్  ఇరిగేషన్ ప్రాజెక్ట్ ల పరిశీలన సందర్భంగా ఆసక్తికర వ్యాఖ్యలు

కాళేశ్వరం ప్రాజెక్టు  పనులను వేగం పెంచడానికి ఇరిగేషన్ మంత్రి హరీశ్ రావు సోమవారం 'సర్జికల్'తనిఖీ చేశారు. తెలంగాణ రాష్ట్ర రైతు సమన్వయ సమితి సదస్సులో పాల్గొన్న మంత్రి కరీంనగర్ జిల్లాలోని కాళేశ్వరం పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి అధికారులను పనుల పురోగతిపై ప్రశ్నించారు. అధికారులకు పలు సూచనలు చేశారు. ఇలా సూచనలిస్తూ తాగుబోతుల ప్రస్తావన తీసుకువచ్చారు హరిష్. పనుల్లో బాగంగా రోడ్డు పక్కన తీసిన గుంతలను వెంటనే పూడ్చాలని అధికారులకు తెలిపారు హరిష్. లేదంటే ఈ గుంతల్లో ఎవరైనా తాగుబోతులు పడితే  ఆ పంచాయతీ మనచుట్టూ తిరుగుతుందని అన్నారు. తాగిన మైకంలో వారికి ఈ గుంతలు కనబడకుంటే అందులో పడి ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉందని, కాబట్టి తొందరగా వీటిని పూడ్చాలని సూచించారు.  

 

తాగుబోతుల గురించి హరీష్ ఏమన్నాడో కింది వీడియోలో చూడండి

 

PREV
click me!

Recommended Stories

పెద్దపులి, ఎలుగుబంటి ప్రెండ్లీ ఫైటింగ్ (వీడియో)
సినీ నటి, ఎమ్మెల్యే రోజా బ్యాటింగ్ (వీడియో)