మంద కృష్ణ మళ్లీ అరెస్ట్

First Published Jan 2, 2018, 5:46 PM IST
Highlights
  • మంద కృష్ణ మాదిగ మళ్లీ అరెస్ట్
  • పార్శీగుట్టలో  అదుపులోకి తీసుకున్న పోలీసులు
  • 48 గంటల దీక్షభగ్నం

 ఎమ్మార్పీఎస్ ఉద్యమ నేత మంద కృష్ణ మాదిగ ను తెలంగాణ పోలీసులు మళ్లీ అరెస్టు చేశారు. గతంలో ఆయన మెరుపు ధర్నా చేసే ప్రయత్నం చేయడంతో అరెస్టు చేసి జైలుకు పంపిన పోలీసులు మరోసారి ఆయనను అరెస్టు చేశారు. ఎస్సీ వర్గీకరణ విషయంలో గత కొంతకాలంగా దూకుడు పెంచిన మంద కృష్ణపై సర్కారు కన్నెర్ర జేసింది. శాంతి భద్రతల సమస్యను కల్పిస్తున్నారన్న ఆరోపణతో మరోసారి అరెస్టు చేసింది. 

పార్శిగుట్టలోని ఎమ్మార్పీఎస్ కార్యాలయంలో మంద కృష్ణ దీక్షకు దిగారు. వర్గీకరణ కోసం 48 గంటల దీక్ష చేస్తున్నట్లు ఆయన గతంలోనే ప్రకటించారు. దీక్షకు అనుమతించాలని కూడా పోలీసు వారికి ఆయన దరఖాస్తు పెట్టుకున్నారు. పోలీసులు ఎక్కడ అనుమతిస్తే అక్కడ దీక్ష చేస్తానని ప్రకటించారు.

అయితే పోలీసులు ఆయన దీక్షకు అనుమతి నిరాకరించారు. హైదరాబాద్ లో ఎక్కడ దీక్ష చేయడానికి కూడా అనుమతి లేదని తేల్చి చెప్పారు. దీంతో పోలీసుల అభ్యంతరాలను పట్టించుకోకుండా మంద కృష్ణ దీక్షకు దిగారు. తక్షణమే ఎస్సీ వర్గీకరణ చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో పార్శీగుట్టలోని సంఘం కార్యాలయంలో మంద కృష్ణ చేస్తున్న దీక్షా శిబిరంలోకి ప్రవేశించిన పోలీసులు దీక్ష భగ్నం చేసి అరెస్టు చేశారు. ఈ అరెస్టు పై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

click me!