కులం పేర్లతో తెలంగాణ పొలీసులకు పనేంటి ?

First Published Oct 15, 2017, 4:32 PM IST
Highlights
  • స్పూర్తి యాత్రను చూసి ప్రభుత్వం భయపడుతోంది
  • అందుకే పోలీసులను ఉపయోగించి ఈ అరెస్టులు
  • హక్కులను భంగం కల్గిస్తున్నారు
  • దీనిపై గవర్నర్, రాష్ట్రపతికి ఫిర్యాదు చేస్తాం

అమరుల స్ఫూర్తి యాత్రపై పోలీసులు నిరంకుశంగా వ్యవహరిస్తున్నారని జేఏసి చైర్మన్ కోదండరాం మండిపడ్డారు. స్పూర్తి యాత్రకు అనుమతిస్తూ ముందు రోజు పోలీసులు మౌఖిక ఆదేశాలు ఇచ్చారని,ఆ తర్వాత రాత్రి ఏం జరిగిందో ఏమో గాని మనసు మార్చుకుని ఐకాస నేతలను అరెస్టు చేయడం మొదలుపెట్టారని వివరించారు. అర్ధరాత్రి నుంచే  వరంగల్ 300, హైదరాబాద్ లో 110 మంది  అరెస్టు చేసి పోలీసు స్టేషన్ కు తరలించారని, అక్కడ పుట్టుమచ్చలను గుర్తించడం, కులాల పేరును ఆరా తీయడం జరిగిందన్నారు. పోలీసులు కులాలను అడగడం అనాగరికమైనదని, దీన్ని అడ్డుకోవాల్సిన ఖాకీలే దీనికి పాల్పడటం దారుణమన్నారు.  
ఇంకా కోదండరాం స్పీచ్  ఆయన మాటల్లోనే... 
 పోలీసులు సెక్షన్ 151 కింద అరెస్టు చేయడం అన్యాయమని, మానభంగాలు, దొమ్మీల వంటి   నేరం జరిగే అవకాశం ఉందనుకున్నప్పుడే ఈ సెక్షన్ ఉపయోగిస్తారని వేరే ఇతర మార్గాలు లేనప్పుడు మాత్రమే సెక్షన్ 151 వర్తిస్తుంది. కానీ మాకార్యక్రమం గురించి ప్రభుత్వానికి , పోలీసులకు ముందే వెల్లఢించాం.
ఈ ప్రభుత్వం బలహీనపడుతోంది‌‌. మమ్మల్నిచూసి భయపడుతోంది. అందుకే చట్ట వ్యతిరేకంగా వ్యవహరిస్తోంది.
ప్రభుత్వ చేతగానితనం వల్లే మమ్మల్ని అరెస్టు చేశారు. నిన్నటి సంఘటనలతో మా సంకల్పం మరింత బలపడింది.అన్ని పార్టీలకు నిన్నటి పరిణామాలు వివరిస్తాం, గవర్నర్, రాష్ట్రపతికి ఫిర్యాదు చేస్తాం. కోర్టుకు కూడా వెళ్తాం.
నల్గొండలో 21, 22 లో 7వ విడత అమరుల స్ఫూర్తి యాత్ర నిర్వహిస్తాం. ఇప్పటికే ధరఖాస్తు కూడా పెట్టుకున్నాం. అనుమతి మంజూరు చేయాలని కోరుతున్నాం.
నిరుద్యోగులందరికీ ఈ ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వలేదు. రాష్ట్రంలో 2లక్షలు ఖాళీలున్నాయి. వాటిని వెంటనే భర్తీ చేయాలి. ఉద్యోగాలు రావడంలేదని ఇప్పటికే ఇద్దరు యువకులు ఆత్మహత్య చేసుకున్నారు. సుప్రీంకోర్టు తీర్పు స్ఫూర్తితో సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి. నిరుద్యోగులకు ఉద్యోగమైనా ఇవ్వాలి. లేదంటే నిరుద్యోగ భృతి ఐనా ప్రకటించాలి. మేం లేవనెత్తిన 6 డిమాండ్లను ప్రభుత్వం నెరవేర్చాలి.
సమాజంలో రాజకీయాలు అనివార్యం. అవి బాగాలేనప్పుడు సరిచేసుకోవాల్సిన బాధ్యత ప్రజలపైనే ఉంది. ప్రజాస్వామ్యంలో పౌరులను చైతన్యవంతులుగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత మాపై ఉంది. మాకు వెనక్కిమళ్లే దారిలేదు. ఆరునూరైనా మా ప్రయాణం ముందుకే సాగుతుంది.
రాష్ట్ర సాధన ఉద్యమంలో ముందుండి పోరాడాం. ఈ ప్రభుత్వం మాది. ప్రజల హక్కులకోసం కొట్లాడే హక్కు మాకు ఉంది.కులం పేర్లతో తెలంగాణ పొలీసులకు పనేంటి ?
   

click me!