సంగారెడ్డి జైలుపాలైన నగల వ్యాపారి (వీడియో)

First Published Feb 6, 2018, 3:34 PM IST
Highlights
  • సంగారెడ్డి జైళ్లో కేరళ నగల వ్యాపారి బాబీ చెమ్మనూర్
  • జైళ్లో గడపాలన్నది 15 ఏళ్ల కలగా చెబుతున్న వ్యాపారి

కేరళ రాష్ట్రానికి చెందిన అంతర్జాతీయ నగల వ్యాపారి బాబీ చెమ్మనూర్ సంగారెడ్డి జిల్లా కారాగారంలో బంధీగా మారాడు. అతడు ఏ నేరం చేయకపోయినప్పటికి ఒక రోజు జైలు శిక్ష అనుభవించాడు. ఇలా నేరం చేయకుండానే అతడెందుకు జైలుకు వెళ్లాడు, ఎందుకు శిక్ష అనుభవించాడని అనుకుంటున్నారా?  అయితే ఈ కింది స్టోరీ చదవండి.

సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రాచీన జైలును జైళ్ల శాఖ మ్యూజియంగా మార్చిన విషయం తెలిసిందే.  సాధారణ ప్రజలు, వీఐపీలు ఎవరైనా సరే జైలు జీవితం ఎలా ఉంటుందో తెలుసుకోవాలంటే ఈ జైలుకు రావొచ్చని జైళ్ల శాఖ బాగా ప్రచారం చేసింది. అంటే రూ.500 లు చెల్లించి ఓ రోజు జైళ్లో ఉండి అందులో ఖైదీల మాదిరిగా  గడపాలన్నమాట. ఈ కాన్సెప్ట్ నచ్చిన కేరళ జువెల్లరీ వ్యాపారి బాబీ చెమ్మనూర్ తన చిరకాల వాంఛను తీర్చుకున్నారు. తన ముగ్గురు మిత్రులు ఇంజినీర్ ఆసీన్‌అలీ, ట్రైనర్ ప్రశాంత్, దుబాయ్ జర్నలిస్టు బినయ్‌తో కలిసి జైలుకు వచ్చారు. మనిషికి రూ.500 వందలు చొప్పున రూ.2వేలు చెల్లించి ఒక రోజు ఖైదీగా మారారు. ఉదయం నుంచి సాయంత్రం దాకా సాధారణ ఖైదీల్లాగే పనులు చేస్తూ జైల్లోనే ఉన్నారు. 

సాయంత్రం బయటికి వచ్చాక బాబీ మాట్లాడుతూ, తనకు 15ఏళ్లుగా జైలు జీవితం గడపాలని కోరికగా ఉండేదని తెలిపాడు. ఇందుకోసం అప్పుడే ఒక పోలీసు అధికారిని సంప్రదించానని  తెలిపారు. అయితే నేరం చేయకుండా జైలుకు వెళ్లడం కుదరదని ఆ అధికారి చెపడంతో ఆ కోరికను చంపుకున్నట్లు తెలిపాడు. అయితే ఇటీవల ఓ టీవి చానల్ లో సంగారెడ్డి జిల్లా జైలు గురించి తెలుసుకుని ఇక్కడికి వచ్చినట్లు వివరించారు. ఈ రోజుతో జైళ్లో ఖైదీగా గడపాలన్న తన కోరిక నెరవేరిందని ఆనందం వ్యక్తం చేశాడు వ్యాపారి బాబీ చెమ్మనూర్.

నగల వ్యాపారి బాబీ చెమ్మనూర్  జైళ్లో ఎలా గడిపారో కింది వీడియోలో చూడండి

 

click me!