టెన్త్ క్లాస్ పేపర్ లీకేజీ రాయున్ని ఈ పోలీస్ ఎలా గుంజుకుపోయాడంటే (వీడియో)

First Published Mar 22, 2018, 4:19 PM IST
Highlights
  • జగిత్యాల జిల్లాలో పదో తరగతి పేపర్ లీక్
  • రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న పట్టుకున్న పోలీసులు
  • ఆరుగురు టీచర్ల సస్పెండ్

ఇవాళ జరిగిన పదో తరగతి మ్యాథ్స్ పేపర్ జగిత్యాల జిల్లాలో లీకయ్యింది.  జిల్లాలోని కొడిమ్యాల మండల కేంద్రంలోని జెడ్‌పీహెచ్‌ఎస్‌ పాఠశాల నుండి ఈ పేపర్ లీకయ్యింది. ఈ పరీక్ష కేంద్రంలో ఇన్విజిలేటర్ గా విధులు నిర్వహిస్తున్న ఓ టీచర్ సెల్‌ఫోన్‌లో క్వశ్చన్ పేపర్ ఫోటో తీసి వాట్సాప్ ద్వారా బైటికి పంపుతున్నట్లు పోలీసులకు విశ్వసనీయ సమాచారం అందింది. దీంతో ఎస్‌ఐ సతీశ్ కుమార్ పక్కా సమాచారాన్ని సేకరించి  పరీక్ష కేంద్రం పక్కన ఉన్న కొంటూరి సతీశ్ అనే ప్రభుత్వ ఉపాధ్యాయుడి గదిపై దాడి చేశాడు. ఈ గదిలో మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ బత్తిని సత్యనారాయణ, వడ్లకొండ రమేశ్ అనే టీచర్ తో పాటు మరో ఇద్దరు టీచర్లు మ్యాథ్స్ క్వశ్చన్స్ కి జవాబులు రాస్తూ పట్టుబడ్డారు. పోలీసులను చూసి పారిపోతున్న టీచర్లు పట్టుబడ్డారు. ఇద్దరు మహిళా టీచర్లు మాత్రం పరారయ్యారు.

 అయితే ఈ  లీకేజి వ్యవహారంలో పట్టుబడ్డ మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ బత్తిని సత్యనారాయణగౌడ్, కోనాపూర్ మ్యాథ్స్ టీచర్ వడ్లకొండ రమేశ్, రాంసాగర్ మ్యాథ్స్ టీచర్ శ్రీనివాస్, కేజీబీవీ పాఠశాల ప్రత్యేకాధికారి మంద లింగవ్వ, కేజీబీవీ మ్యాథ్స్ టీచర్ పద్మ, మోడల్ స్కూల్ మ్యాథ్స్ టీచర్ రాధను సస్పెండ్ చేయడంతో పాటు వారిపై క్రిమినల్ కేసులను నమోదు చేసినట్లు డీఈవో వెంకటేశ్వర్లు వెల్లడించారు. 

వీడియో

click me!