జగపతి బాబు రాజకీయాల్లోకి వస్తున్నాడా..? (వీడియో)

Published : Nov 20, 2017, 12:57 PM ISTUpdated : Mar 24, 2018, 12:02 PM IST
జగపతి బాబు రాజకీయాల్లోకి వస్తున్నాడా..? (వీడియో)

సారాంశం

సినీ నటుడు జగపతి బాబు  రాజకీయాల్లోలకి వస్తున్నాడా. ఇపుడు దక్షిణాదిన అనేక మంది హీరోలు రాజకీయాలవైపు మరలుతున్నారు. ఈ లైన్ లోనే జగపతి బాబు కూడా ఉన్నారా?మరి జగపతి బాబు దారి ఎటు?

జగపతి బాబు రాజకీయాల్లోకి వస్తున్నాడా ..? (వీడియో)

సినీ నటుడు జగపతి బాబు  రాజకీయాల్లోలకి వస్తున్నాడా, ఇపుడు వినపడుతున్న ప్రశ్న.విశాఖపట్నంలో  బీచ్ లో పంచె కట్టుతో ఆయన నిన్న వాకింగ్ చేశారు. 
అంతే, పంచకట్టు జగ్గుబాయ్ ను చూసేందుకు ఫ్యాన్స్ ఎగబడ్డారు. సెల్ఫీలు దిగేందుకు పోటీ పడ్డారు. ఈ కొత్త గెటప్ ఏమిటని చాలా మంది కుతూహలంగా ప్రశ్నించారు. తన కొత్త గెటప్ ఎందుకు మారిందో ఒకటి రెండు రోజుల్లో సమాధానం చెబుతానని జగపతి బాబు హామీ ఇచ్చారు. ఆయన రాజకీయాల్లోకి వచ్చేలా ఉన్నాడని చాలా మంది అనుమానిస్తున్నారు.  పంచెకట్టుకి సోషల్ మీడియా జస్టిఫికేషన్ ఇదిపైగా ఒకటి రెండు రోజుల్లో జవాబు చెబుతానని చెప్పడం అందరిలో ఉత్సకత రేపుతున్నది. జగ్గుబాయ్ నిజంగా రాజకీయాల్లోకి దూకుతాడా? ఇపుడు దక్షిణాదిన అనేక మంది హీరోలు రాజకీయాలవైపు మరలుతున్నారు. తెలుగులోకూడా ఈ గాలీ వీస్తూనే ఉంది. మురళీమోహన్ ఎంపి అయ్యారు, రోజా ఎమ్మెల్యే. ఇపుడు వాణీ విశ్వనాథ్ టిడిపిలో చేరారు. ఈ లైన్ లోనే జగపతి బాబు కూడా ఉన్నారా?మరి జగపతి బాబు దారి ఎటు?  టీడీపీ వైపా లేక  వైసీపీ దిక్కా? ఆయన టిడిపి లో చేరతాడని, మురళీ మోహన్ లాగా ఎంపి గా పోటీచేస్తాడని చాలా మందిఅనుమానిస్తున్నారు.రెండు రోజులాగుదాం. జగపతి బాబు అభిమానులను ఎలా సరప్రైజ్ చేస్తాడో చూద్దాం.

PREV
click me!

Recommended Stories

పెద్దపులి, ఎలుగుబంటి ప్రెండ్లీ ఫైటింగ్ (వీడియో)
సినీ నటి, ఎమ్మెల్యే రోజా బ్యాటింగ్ (వీడియో)