చిన్నారులకు పెట్టే భోజనమా ఇది.

Published : Nov 13, 2017, 04:39 PM ISTUpdated : Mar 26, 2018, 12:02 AM IST
చిన్నారులకు పెట్టే భోజనమా ఇది.

సారాంశం

చిల్డ్రన్ ఫిల్మ్ పెస్టివల్ లో చిన్నరులకు నాణ్యత లేని బోజనం ఆందోళన వ్యక్తం చేస్తున్న చిన్నారులు

చిన్నారుల కోసం ప్రతి యేడు హైదరాబాద్ లో నిర్వహించే చిల్డ్రన్ ఫిలిం పెస్టివల్ లో ఆహార పధార్థాల నాణ్యత ను గాలికి వదిలేసారు మేనేజ్ మెంట్. అంతర్జాతీయ స్థాయిలో జరిగే ఈ ఫెస్టివల్ వివిద దేశాల నుంచి చిన్నారులు వస్తుంటారు. అలాంటి చోట దేశ ప్రతిష్ట మంటగలిసేలా నిర్వహకులు వ్యవహరిస్తున్న తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తున్నాయి.
 హైదరాబాద్ లొ 20 వ చిల్డ్రన్ ఫిల్మ్ పెస్టివల్ ఈ నెల 8 వ తేదీ నుంచి ప్రారంభమైంది. ఈ ఫిల్మ్ ఫెస్టివల్ కోసం దాదాపు 109 దేశాల నుంచి చిన్నారులు తమ సినిమాలను ప్రదర్శించడానికి వచ్చారు. వారు ఉండడానికి, బోజన వసతిని ఏర్పాట్లను చిల్డ్రన్ ఫిల్మ్ సొసైటీ ఆప్ ఇండియా చూసుకుంటోంది. 
 అయితే చిన్నారుల కోసం ఆహార పధార్థాలను పార్క్ హోటల్ నుండి తీసుకువస్తున్నారు. అయితే ఆ వంటల్లో నాణ్యత లేకపోగా  కొన్ని పదార్థాల్లో చీమలు,లక్క పురుగులు దర్శనమిస్తున్నాయి. చిన్నారులు ఆరోగ్యాన్ని కూడా పట్టించుకోకుండా నిర్వహకులు, హోటల్ సిబ్బంది చూపెడుతున్న ఈ నిర్లక్ష్యంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.  
 

PREV
click me!

Recommended Stories

పెద్దపులి, ఎలుగుబంటి ప్రెండ్లీ ఫైటింగ్ (వీడియో)
సినీ నటి, ఎమ్మెల్యే రోజా బ్యాటింగ్ (వీడియో)