శ్రీదేవి మృతిపై రాజకీయ ప్రముఖులు నివాళి

First Published Feb 25, 2018, 11:46 AM IST
Highlights
  • సినీ నటి శ్రీదేవి మృతిపై సినీ, రాజకీయ ప్రముఖుల సంతాపం
  • ప్రధాని, రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి ట్విట్టర్ ద్వారా సంతాప ప్రకటన

 ప్రముఖ సినీ నటి, పద్మశ్రీ అవార్డు గ్రహీత శ్రీదేవి అకాల మరణం తో సినీ ప్రముఖులు, ప్రేక్షకులే కాదు యావత్ భారతం దు:ఖ సాగరంలో మునిగింది. శ్రీదేవి మరణం పట్ల రాజకీయ ప్రముఖులు సైతం దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ముఖ్యంగా  రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింగ్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని మోదీ లాంటి ప్రముఖులు ట్విట్టర్ వేదికగా సంతాపం ప్రకటించారు.

ప్రధాని నరేంద్ర మోదీ

ప్రముఖ నటి శ్రీదేవి హఠాన్మరణం పట్ల ప్రధాని నరేంద్రమోదీ సంతాపం వ్యక్తం చేశారు.  సీనియర్ నటిగా చిరస్మరణీయ నటన ప్రదర్శిస్తున్న ఈ సమయంలో ఆమె మరణం చిత్ర పరిశ్రమకు తీరని లోటని తెలిపారు. ‘‘ఈ సమయలో తన ఆలోచనలన్నీ ఆమె వెంటే ఉన్నాయి. ఆమె కుటుంబ సభ్యులకు సంతాపం తెలియజేస్తున్నా. ఆమె ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నా’’ అంటూ ప్రధాని ట్వీట్ చేశారు.

 

Saddened by the untimely demise of noted actor Sridevi. She was a veteran of the film industry, whose long career included diverse roles and memorable performances. My thoughts are with her family and admirers in this hour of grief. May her soul rest in peace: PM @narendramodi

— PMO India (@PMOIndia)


రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్

సినీ నటి శ్రీదేవి ఆకస్మిక మరణ వార్త విని కలత చెందినట్లు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ తెలిపారు. ఎన్నో స్పూర్తిదాయక సినిమాలు అందించిన శ్రీదేవి మరణం సినీ పరిశ్రమకు తీరని లోటని అన్నారు. మూడ్రమ్ పిరై, లమ్హే, ఇంగ్లిష్ వింగ్లిష్ సినిమాలతో ఇతర నటులకు స్ఫూర్తిగా నిలిచారని అన్నారు. ఆమె కుటుంబ సభ్యులు, సన్నిహితులకు సంతాపం ప్రకటిస్తున్నట్లు రామ్ నాథ్ కోవింగ్ ట్వీట్ చేశారు.

 

Shocked to hear of passing of movie star Sridevi. She has left millions of fans heartbroken. Her performances in films such as Moondram Pirai, Lamhe and English Vinglish remain an inspiration for other actors. My condolences to her family and close associates

— President of India (@rashtrapatibhvn)

ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు

శ్రీదేవి సినీ రంగంలో తన నటనతోనే కాదు బహుముఖ ప్రతిభతో, వేవిధ్య పాత్రలతో సినీ ప్రేమికులను అలరించారని కొనియాడారు ఉప రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్. కేవలం తెలుగు, హిందీ, తమిళ ఇలా పలు బాషా సినిమాల్లో నటించి తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న శ్రీదేవి మరణం పట్ల విచారం వ్యక్తం చేస్తున్నట్లు ట్వీట్ చేశారు. వారి కుటుంబ సభ్యులకు సానుభూతి ప్రకటించారు.
  

Felt very sad over the sudden demise of popular actress Sreedevi. She was an extremely versatile and talented film star, who had acted in Teugu, Hindi and other South Indian Languages.  My heartfelt condolences to her bereaved family members. pic.twitter.com/4ACZRrYxPG

— VicePresidentOfIndia (@VPSecretariat)

 

 

click me!