ఐటీ రిటర్న్స్ తుది గడువు పొడిగింపు..

First Published Jul 31, 2017, 3:53 PM IST
Highlights
  • ఆగస్టు 5వ తేదీకి పొడిగించారు
  • ఇప్పటి వరకు వచ్చిన పన్ను ఆదాయం రూ.2కోట్లు

ఈ ఆర్థిక సంవత్సరానికి ఆదాయపు పన్ను(ఐటీ రిటర్న్స్) చెల్లింపులకు ఆఖరి తేదీని పొడిగించారు. అసలు  ఆఖరి తేదీ జులై31వ తేదీ కాగా.. ఆ తేదీని ఆగస్టు 5వ తేదీకి పొడిగించారు. పన్ను చెల్లించడంలో ట్యాక్స్ పేయర్స్ పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని.. వారి ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని సమయాన్ని మరి కొద్ది రోజులు పొడిగించనట్లు ఇన్ కమ్ ట్యాక్స్ ఇండియా తెలిపింది. ఈ విషయాన్ని తమ అధికారిక ట్విట్టర్ లో సైతం పోస్టు చేశారు.

జులై 31 వ తేదీ లోపు అందరూ పన్ను చెల్లించాలంటూ ప్రభుత్వం ప్రకటనలు ఇచ్చిన సంగతి తెలిసిందే. దీంతో ఇప్పటికే పలువురు పన్నులు చెల్లించారు. ఇప్పటి వరకు చెల్లించిన పన్నులు మొత్తం రూ.2కోట్లు అయ్యిందని అధికారులు తెలిపారు. మరికొందరు చెల్లించాల్సి ఉండగా.. వారు ఆగస్టు 5లోపు చెల్లించాల్సిందిగా సూచించారు. అంతేకాకుండా పన్ను చెల్లించడానికి చివరి తేదీ కావడంతో అందరూ పన్ను చెల్లించే ప్రభుత్వ అధికార వెబ్ సైట్ ఓపెన్ చేస్తారని.. అందరూ ఒకేసారి ఓపెన్ చేయడంతో సైట్ ఓవర్ లోడ్ అవుతోందని వారు తెలిపారు. గడువు తేదీని పొడిగించడానికి ఇది కూడా ఒక కారణం అని వారు పేర్కొన్నారు.

click me!