ఎట్టకేలకు విశాల్ గెలిచిండు

First Published Dec 5, 2017, 8:50 PM IST
Highlights
  • మరో మలుపు తిరిగిన హీరో విశాల్ నామినేషన్ ప్రక్రియ
  •   ట్విట్టర్ ద్వారా సంచలన విశయాన్ని వెల్లడించిన విశాల్

ఎట్టకేలకు హీరో విశాల్ నామినేషన్ ను ఎన్నికల సంఘం ఆమోదించింది. తన నామినేషన్ ను ఎన్నికల సంఘం ఆమోదించినట్లు స్వయంగా విశాల్ తన ట్విట్టర్ లో పేర్కొన్నాడు. ఈ నామినేషన్ల ప్రక్రియపై ఇవాళ పెద్ద డ్రామా జరిగిన విషయం తెలిసిందే. తన నామినేషన్ ను తిరస్కరించడంపై హీరో విశాల్ తీవ్ర అసహనానికి లోనై ధర్నాకు దిగిన విషయం తెలిసిందే. దీంతో పోలీసులు అతడ్ని అరెస్ట్ చేశారు. తాజాగా విశాలే తన నామినేషన్ ను ఆమోదించినట్లు ట్వీట్ చేయడంతో ఈ నామినేషన్ల పర్వం మరో మలుపు తిరిగింది.

జయలలిత మరణంతో ఖాళీ అయిన ఆర్కె నగర్ ఉపఎన్నికల బరిలో నిలుస్తూ తమిళ హీరో విశాల్‌ సోమవారం నామినేషన్‌ దాఖలు చేసాడు.  మొదట జయలలిత సమాధి వద్ద నివాళులర్పించిన అనంతరం నామినేషన్‌ సెంటర్‌కు వెళ్లిన విశాల్ స్వతంత్ర్య అభ్యర్థిగా పోటీ చేస్తున్నట్లు పత్రాలు సంబంధిత అధికారులకు అందించాడు. తనకు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ ఆదర్శమని ప్రకటించిన విశాల్‌.. అమ్మ ఆశయాలకు అనుగుణంగా పని చేసేందుకు ఓ అవకాశం ఇవ్వాలని ఆర్కే నగర్‌ ప్రజలను కోరాడు.

 అయితే అనూహ్యంగా ఎన్నికల కమిషన్ విశాల్ నామినేషన్ తిరస్కరించింది. ఆర్ కె నగర్ ఉపఎన్నికల బరిలో ఈసీ తన నామినేషన్ తిరస్కరించడంపై విశాల్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. కేవలం టీడీఎస్ కట్టలేదని అనర్హత నామినేషన్ తిరస్కరించడం ఏమిటని వివాలక ఎన్నికల సంఘం పై ఆగ్రహం వ్యక్తం చేశాడు. అన్నీ సరిగ్గానే వున్నాయని, కావాలనే నామినేషన్ తిరస్కరించారని ఆరోపించారు.  

ఇలా ఇంత గందరగోళం జరిగాక విశాల్ నామినేషన్ ను ఈసీ ఆమోదించింది. దీనిపై తాను సంతోషం వ్యక్తం చేస్తున్నట్లు విశాల్ తెలిపాడు.  

 

 

click me!