''జగనన్న...స్టీల్ ప్లాంట్ కోసం పోరాడే'' - జి. వి ప్రవీణ్ రెడ్డి

Published : Nov 12, 2017, 12:18 PM ISTUpdated : Mar 25, 2018, 11:38 PM IST
''జగనన్న...స్టీల్ ప్లాంట్ కోసం పోరాడే'' - జి. వి ప్రవీణ్ రెడ్డి

సారాంశం

ప్రొద్దుటూరులో జగన్ ని కలిసిన స్టీల్ ప్లాంట్ సాధన సమితి నాయకులు రాయలసీమలో స్టీల్ ప్లాంట్ కోసం పోరాడాలని వినతి సానుకూలంగా స్పందించిన ప్రతిపక్షనేత

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి చేపడుతున్న ప్రజాసంకల్ప యాత్ర రాయలసీమలో కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ పాదయాత్రలో భాగంగా  పొద్దుటూరుకు చేరుకున్న ప్రతిపక్ష నేత జగన్ కు స్టీల్ ప్లాంట్ సాధన సమితి అధ్యక్షుడు జి. వి ప్రవీణ్ రెడ్డి కలిసారు.సామాజికంగా, ఆర్థికంగా, ఉద్యోగపరంగా వెనుకబడిన రాయలసీమకు అభివృద్ది పలాలు అందాలంటే స్టీల్ ప్లాంట్ లాంటి భారీ పరిశ్రమలు రావాల్సిన అవసరం ఉందని జగన్ కు ఆయన వివరించారు. ముఖ్యంగా నిరుద్యోగ సమస్యను అరికట్టడానికి ఇది ఎంతగానో ఉపయోగ పడుతుందని ప్రవీణ్ రెడ్డి అన్నారు. 
స్టీల్ ప్లాంట్ సాధన సమితి ఎన్ని రకాలుగా ప్రభుత్వం పై ఒత్తిడి తెచ్చినా స్పందించడం లేదని, అందుకోసం తాము పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తున్నట్లు ప్రవీణ్ రెడ్డి జగన్ కు వివరించారు. ఈ ఉద్యమానికి ప్రతిపక్షం తరపున తమరు సహకారాన్ని అందించాలంటూ ఆయనకు ఒ వినతి పత్రాన్ని సమర్పించారు. జగన్మోహన్ రెడ్డి ప్రజా సమస్యలను, ముఖ్యంగా రాయలసామ సమస్యలను తెలిసిన వ్యక్తి కావడం వల్లే ఆయన్ను కలిసి స్టీల్ ప్లాంట్ సాధనకు కృషి చేయాలని కోరినట్లు ప్రవీణ్ రెడ్డి తెలిపారు.
 

PREV
click me!

Recommended Stories

పెద్దపులి, ఎలుగుబంటి ప్రెండ్లీ ఫైటింగ్ (వీడియో)
సినీ నటి, ఎమ్మెల్యే రోజా బ్యాటింగ్ (వీడియో)