30 క్వింటాళ్ల బంగారం ఆకాశం నుంచి రాలిపడింది

First Published Mar 16, 2018, 12:45 PM IST
Highlights
  • రష్యా లోని యాకుత్స్ విమానాశ్రయం విచిత్ర సంఘటన
  • విమానంలోంచి రోడ్డుపై పడ్డ టన్నులకొద్ది బంగారు కడ్డీలు

ఆకాశం నుండి వర్షం పడితేనే అందరూ ఎంతో ఆనందపడతారు. అలాంటిది బంగారు వాన పడితే... ఆ ఆనందానికి హద్దు ఉంటుందా. ఇలా ఏకంగా  3 క్వింటాళ్ల  బంగారం ఆకాశం నుండి కింద పడి రష్యా ప్రజల్ని ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ ఘటనకు సంబంధించిన  వివరాలిలా ఉన్నాయి.  

రష్యాలోని నింబూస్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఏఎన్-12 సరుకు రవాణా విమానం యాకుత్స్ విమానాశ్రయం నుంచి క్రాస్నోయార్క్స్‌కు బయలుదేరింది. ఈ విమానంలో దాదాపు 9.3 టన్నుల బంగారం తో పాటు ఇతర లోహాలు ఉన్నాయి. అయితే విమానాశ్రయంలో ప్లేన్ గాలిలోకి ఎగరగానే దాని తలుపులు తెరుచుకున్నాయి. దీంతో దాదాపు 3.4టన్నుల బంగారం రన్‌వేపై పడిపోయింది. ఇలా ఆకాశం నుండి రన్ వే పై చెల్లాచెదురుగా పడిపోయిన  172 బంగారు కడ్డీల గుర్తించిన విమానాశ్రయ సిబ్బంది వాటిని స్వాధీనం చేసుకున్నారు. వెంటనే విమానాన్ని వెనక్కి రప్పించి ఈ కడ్డీలను జాగ్రత్తగా అందులోకి చేర్చారు.  

 


 

click me!