దుబాయ్ లో తెలంగాణ యువకుడి ఆత్మహత్య

First Published Dec 21, 2017, 12:32 PM IST
Highlights
  • తెలంగాణ యువుడు దుబాయ్ లో ఆత్మహత్య
  • ఉపాధి కోసం దుబాయ్ కి వలసవెళ్లిన శ్రీనివాస్ 

మాతృదేశంలో ఉద్యోగావకాశాలు లేక పరాయిదేశానికి వలసవెళ్లాడు. తన భవిష్యత్ అక్కడ మారిపోతుందని భావించాడు. తాను తన తల్లిదండ్రులకు దూరంగా వున్న, అక్కడ సంపాదించిన డబ్బుతో వారిని సుఖపెట్టాలనుకున్నాడు. పాపం... అతడి కలలన్ని కల్లలు గానే మిగిలిపోయాయి. విదేశంలో కూడా అతడికి  ఉపాదిఅవకాశాలు దొరక్క, స్వదేశానికి తిరిగివచ్చి బతకలేక తీవ్ర మనోవేదనతో చివరకు ఆత్మహత్య చేసుకున్నాడు. ఇది ఓ తెలంగాణ యువకుడి దీన గాధ.

ఈ ఆత్మహత్యకు సంభందించిన వివరాల్లోకి వెళితే పంబల శ్రీనివాస్ అనే యువకుడు స్వదేశంతో ఉపాధి దొరక్క దుబాయ్ కి వలసవెళ్లాడు. ఇందుకోసం బాగా డబ్బులు ఖర్చు చేశాడు. అయితే దుబాయ్ లో బాగా సంపాదించి తనకోసం కుటుంబం చేసిన అప్పులను తీర్చాలనుకున్నాడు. తీరా దుభాయ్ కి వెళ్లాక తెలిసింది. అక్కడ పరిస్థితులు తను ఊహించినదానికి బిన్నంగా ఉన్నాయని. అక్కడ కూడా చేయడానికి పని దొరక్కపోవడంతో తీవ్ర మనోవేదనకు గురయ్యాడు శ్రీనివాస్. అటు విదేశంలో కూడా పనిదొరక్క, ఇటు స్వదేశానికి వచ్చి బతకలేక తీవ్ర మానసిక ఒత్తిడికి గురైన శ్రీనివాస్ చివరకు ఆత్మహత్య చేసుకున్నాడు.

 కొడుకు మరణ వార్త విని తల్లిదండ్రులు పంబల బక్కవ్వ, భూమయ్యలు గుండెలు పగిలేలా రోదిస్తున్నారు. తనకు ఎంతో దైర్యాన్ని నూరిపోసే అన్న ఇలా ఆత్మహత్య చేసుకోవడాన్ని నమ్మలేకపోతున్నానంటూ శ్రీనివాస్ తమ్ముడు వెంకటేష్ బోరున విలపిస్తున్నాడు.  ఎన్నో ఆశలతో విదేశాలకే వెళ్లిన తమ మిత్రుడు విగతజీవుడిగా తిరిగి వస్తుండటం తట్టుకోలేకపోతున్నామంటూ శ్రీనివాస్ మిత్రులు తెలిపారు.  అతడి మృతదేహాన్ని స్వదేశానికి తీసుకువచ్చేందుకు ప్రభుత్వం సహకరించాలని మృతుడి తల్లిదండ్రులు, భందువులు  కోరుకుంటున్నారు.

 
 దుబాయ్ లో శ్రీనివాస్ మిత్రుల వివరాలు
 
1. మరికంటి చంద్రయ్య (00971509273232)
2. మేదవేని శ్రీకాంత్ (00971577319960)
3. పంబల మల్లేష్ (00971528715259)
4.గుంటి రాజేందర్ (00971523765503) 

click me!