భారతీయ బడ్జెటు గురించి అయిదు అరుదైన ముచ్చట్లు

First Published Jan 30, 2018, 4:56 PM IST
Highlights
  • బడ్జెట్ సమావేశాల సందర్భంగా స్పెషల్ స్టోరీ
  • బడ్జెట్ చరిత్ర, విశేషాలపై సమాచారం

మరొక 36 గంటల్లో బడ్జెట్ ఉత్కంఠకు తెరపడుతుంది. బడ్జెట్ ప్రజెంటేషన్ కు  సర్వం సిద్ధమైంది. ఈ ఏర్పాట్లు హల్వా పార్టీతో ఆర్థిక శాఖలో మొదలయ్యాయి. నిన్న ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ప్రసంగంతో ఈ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఇపుడు అందరి చూపులు బడ్జెట్ మీదే. ఎక్కడ చూసినా బడ్జెట్ చర్చలే. సర్వత్రా బడ్జెట్ ఎలా ఉంటుందని ఒక్కటేప్రశ్న.  బడ్జెట్ లో మనకేం ఉంటుందని అన్ని వర్గాలు ఆత్రంగా ఎదురుచూస్తున్నాయి. ఇటీవల ఈ బడ్జెట్కు  ఎక్కడాలేని ప్రాధాన్యత ఉంది.  
అందుకే బడ్జెట్  పద్దులు దేశంలోని ప్రతి ఒక్కరికి సంబంధించినవి. అందుకే బడ్జెట్ వ్యవహారాలు చాలా ఆసక్తిగా ఉంటాయి.  మొదటి బడ్జెట్ సమావేశాలు జరిగినప్పటినుంచి  ఇప్పటివరకు బడ్జెట్ ల చుట్టు ఎన్నో అసక్తి కరమయిన విశేషాలున్నాయి.  వాటిని మీ  ముందుంచే ఒక  చిన్ని ప్రయత్నమే ఈ స్టోరీ. 

1. దేశంలో మొదటి ఎప్పుడు ప్రవేశపెట్టబడిందో తెలుసా ?  స్వాతంత్య్రం వచ్చిన నాలుగు నెలలకే అంటే నవంబర్ 26,1947 తొలి బడ్జెట్ ప్రవేశపెట్టింది. తొలి ప్రధాని జవహార్ లాల్ నెహ్రూ మంత్రివర్గంలో ఆర్థిక మంత్రిగా పనిచేసిన ఆర్ కె షణ్ముగ శెట్టి దీన్ని ప్రవేశపెట్టాడు.

2. ఇక ఈ బడ్జెట్ పద్దులను వరుసగా అత్యధికసార్లు  ప్రవేశపెట్టిన వారి గురించి ఓ సారి పరిశీలిద్దాం. అత్యధికసార్లు అంటే 5 సార్లు వరుసగా బడ్జెట్ ను ప్రవేశపెట్టిన వారిలో యశ్వంత్ సిన్హా ముందున్నాడు. ఆ తర్వాత కాంగ్రెస్ హయాంలో మన్మోహన్ సింగ్ ఈ రికార్డును సమం చేశాడే  కాని బద్దలుకొట్టలేక పోయాడు. ఇలా ఇద్దరు ఆర్థిక నిపుణులు వరుసగా 5 బడ్జెట్ పద్దులను పార్లమెంట్ లో ప్రవేశపెట్టి చరిత్ర సృష్టించారు.  పివి నరసింహారావు ప్రధానిగా ఉన్నపుడు మన్మోహన్ సింగ్ ఆర్థిక మంత్రిగా ఉన్నారు.

3. ఇక బడ్జెట్ మరో విశేషమైన సంఘటన. అంటే బడ్జెట్ లో విశేషం కంటే దాన్ని ప్రవేశపెట్టిన వ్యక్తి విశేషం అధికంగా ఉంది. అతడే మొరార్జి దేశాయ్. ఆయన 1959-64, 1967-70 మధ్య కాలంలో ఆర్థిక మంత్రిగా పనిచేశాడు. అయితే ఇతడు తన పుట్టిన రోజైన పిబ్రవరి 29 న బడ్జెట్ ప్రశేశపెట్టాడు. ఇందులో విశేషం ఏంటనుకుంటున్నారు. దాదాపు ఎనిమిదేళ్లు మంత్రిగా పనిచేసి రెండుసార్లు లీప్ సంవత్సరం రావడం, అదే రోజు ఆయన పుట్టినరోజు ఉండటం, అప్పుడే ఆయన బడ్జెట్ ప్రవేశపెట్టడం విశేషం. అంతే కాకుండా అత్యధిక సార్లు (10 సార్లు) ప్రవేశపెట్టిన ఘనుడు కూడా మొరార్జీనే.

4. ఇందిరా గాంధీ ప్రధానిగా ఉన్నపుడు  ఆర్థిక మంత్రిగా అనేక పర్యాయాలు బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్ వెంకట్రామన్, అదే బడ్జెట్ సమావేశాల్లో రాష్ట్రపతిగా ప్రసంగించారు. ఇలా ఆర్థికమంత్రిగా పనిచేసి రాష్ట్రపతిగా ఎదిగిన మొదటివారు ఈయన , రెండో వ్యక్తి ప్రణబ్ ముఖర్జీ.

5.ఇక ఆర్థిక మంత్రిగా పనిచేసి ప్రధానులుగా ఎదిగిన వారు చాలా మంది ఉన్నారు. వారిలో మొదటివారు మొరార్జీ దేశాయ్. ఇదే వరుసలో చౌదరి చరణ్ సింగ్, విపి సింగ్, మన్మోహన్ సింగ్ లు కూడా ఆర్థిక మంత్రులుగా పనిచేసి ప్రధానులుగా ప్రమోషన్ పొందారు. విపి సింగ్ 1985-87 మధ్య ఆర్థిక మంత్రి గా ఉన్నారు.1989-90 లో ప్రధాని బాధ్యతలు నిర్వర్తించారు.

 

ఇక ప్రధానులుగా ఉండికూడా ఆర్థిక శాఖ వ్యవహారాలను చూసుకున్నారు తండ్రి జవహార్ లాల్ నెహ్రూ, కూతురు ఇందిరా గాంధి. నెహ్రూ  1958్-59లో అర్థిక శాఖను పర్యవేక్షిస్తే, ఇందిరా గాంధీ 1970-71లో  ప్రధానిగా ఉంటూ ఆర్థిక శాఖ బాధ్యతలు కూడా నిర్వర్తించారు.

ఇలా బడ్జెట్ పద్దుల ప్రవేశపెట్టడంలో అనేక విశేషాలు దాగున్నాయి.ఇక ఈ ఆర్థిక శాఖ వ్యవహారాలు పరిశీలించిన మంత్రులు అనేక విషయాల్లో ఆదర్శవంతంగా ఉండటంతో పాటు, ఎన్నో విశేష బడ్జెట్ లను ప్రవేశపెట్టి చరిత్రలో నిలిచారు.
 

click me!