బట్టలు లేకుండా క్షుద్ర పూజలు

First Published Feb 15, 2018, 5:27 PM IST
Highlights
  • హద్రాబాద్ నరబలి కేసులో నిజాలు వెలుగులోకి
  • నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు
  • మీడియా ముందు హాజరుపర్చిన సిపి

హైదరాబాద్ లో సంచలనం సృష్టించిన నరబలి కేసు ను ఎట్టకేలకు పోలీసులు చేదించారు. చంద్రగ్రహణం సందర్భంగా క్షుద్రపూజలు చేసి చిన్నారిని బలి ఇచ్చిన సంఘటన ఉప్పల్ సమీపంలోని చిలుకానగర్ లో చోటుచేసుకున్న విషయం తెలిసిందే. గత కొన్ని రోజులుగా పోలీసులకు కూడా అంతుచిక్కకుండా ఉన్న ఈ బలి మిస్టరీని పోలీసులు చేధించారు. నిందితులను గుర్తించిన పోలీసులు, పాపను ఎక్కడినుండి తీసుకొచ్చారో కూడా కనుపెట్టారు. ఈ నరబలి కేసుపై సిపి మహేష్ భగవత్  మీడియా సమావేశం మొదటి నుండి ఏం జరిగింది, పోలీసులు ఈ కేసును ఎలా చేదించారో చెప్పారు. 

జనవరి 31 న సంభవించిన సంపూర్ణ చంద్రగ్రహణం రోజున జరిగిన ఈ నరబలి గురించిన పూర్తి వివరాలను సిపి వివరించారు. నాగరాజు అనే వ్యక్తి డయల్ 100 కి ఫోన్ చేసి మెదట ఈ మాచారాన్ని అందించాడని తెలిపారు. తమ కాలనీలోని ఓ మేడపై చిన్నారి తల పడి ఉందని సమాచారం ఇవ్వడంతో తాము అప్రమత్తమై ఉప్పల్ పెట్రోలింగ్ పోలీస్ లకు సమాచారం అందించినట్లు తెలిపారు. దీంతో వారు హుటాహుటిన ఘటనా స్ధలానికి చేరుకుని రాజశేఖర్ అనే వ్యక్తి ఇంటి టెర్రస్ పై ఓ పాప తల ఉన్నట్లు గుర్తించారని, దీనిపై కేసు నమోదు చేసుకుని విచారణ ప్రారంభించినట్లు సిపి వివరించారు.

మొదట ఈ కేసులో రాజశేఖర్ ఇంటి సమీపంలో ఉండే నరహరి కుటుంబాన్ని అనుమానించామని, డాగ్ స్క్వాడ్ కూడా రెండు సార్లు నరహరి ఇంటికి వెళ్లి వచ్చాయన్నారు. నరహరి కుమారుడి ఆరోగ్య పరిస్థితి సరిగా లేకపోవడం ఈ బలి కి పాల్పడి ఉంటాడని అనుమానంతో విచారిస్తుండగానే హటాత్తుగా రాజశేఖర్ ఇంట్లో ఓ గదిలో రక్తపు మరకలను గుర్తించామన్నారు. దీంతో విచారణ వేరే మలుపు తిరిగింది తెలిపారు. ఈ రక్తపు సాంపుల్స్ ని సేకరించి, ఫోరెన్సిక్ ల్యాబ్ కి పంపించి రాజశేఖర్ కుటుంబంపై నిఘా ఉంచామన్నారు. వీరి కాల్ లీస్ట్ పై విచారణ జరపగా అనుమానం బలపడిందని,  మాంత్రికుల తో అతడు మాట్లాడిన ఆడియో రికార్డ్ లభ్యమయ్యిందని తెలిపారు. రెండు సంవత్సరాల క్రితం సమ్మక్క సారక్క జాతరకు వెల్లిన రాజశేఖర్ దంపతులు కోయదొరలను కలిసినట్లు వారే ఈ నరబలి సలహా ఇచ్చినట్లు విచారణలో వెలుగు చూసిందన్నారు. దీంతో రాజశేఖర్ దంపతులు జనవరి 31 న తమ ఇంట్లో నగ్న పూజలు జరిపి పాపను బలి ఇచ్చినట్లు, ఆ తర్వాత తలను వేరుచేసి డాబాపై పెట్టి, మొండెంను మాయం చేసినట్లు సిపి వివరించారు.


ఇక బలి చేయబడ్డ పాప వివరాలను డిఎన్ఏ నమూనాల ద్వారా తెలుసుకున్నట్లు సిపి వివరించారు. ఈ నరబలి కి బలైన పాప ఆడ శిశువు గా గుర్తించామని, పాపాను హైద్రాబాద్ లోని భోయిగూడా నుంచి కిడ్నాప్ చేసి తీసుకువచ్చారన్నారు. నరబలి కి గురైన పాపకు సంబంధించిన వివరాలు ఇంకా లభ్యం కాలేదు, పాప ఎవరనేదానిపై విచారణ కొనసాగుతోందన్నారు. ఈ కేసులో ఇప్పటి వరకు కెరుకొండ రాజశేఖర్, అతని భార్య శ్రీలత ను అరెస్ట్ చేసి సెక్షన్ 124,302,366,201,120B కింద కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించినట్లు సిపి మహేష్ భగవత్ తెలిపారు.
 

click me!