ఈ  అధికార పార్టీ నాయకుడి దౌర్జన్యం చూడండి  ( వీడియో)

Published : Feb 20, 2018, 04:15 PM ISTUpdated : Mar 25, 2018, 11:54 PM IST
ఈ  అధికార పార్టీ నాయకుడి దౌర్జన్యం చూడండి  ( వీడియో)

సారాంశం

బెంగళూరులో కాంగ్రెస్ నాయకుడి వీరంగం ప్రభత్వ కార్యాలయాన్ని తగలబెడతానంటూ బెదిరింపు

కర్ణాటకలో లో అధికార కాంగ్రెస్ నాయకుల దౌర్జన్యాలు మితిమీరిపోతున్నాయి. తండ్రి అధికారాన్ని అండగా చూసుకుని  ఓ ఎమ్మెల్యే కొడుకు పబ్ లో ఓ యువకుడిపై దాడి చేసిన సంఘటన మరువకు ముందే మరో నేత రెచ్చిపోయాడు. ఈ సారి ఏకంగా ఓ కాంగ్రెస్ నేత ప్రభుత్వాధికారిని హడలగొట్టాడు. తన పని చేసిపెట్టక పోతే కార్యాలయాన్ని తగటపెడతానంటూ బెదిరింపులకు దిగడమే కాదు, ఓ బాటిల్ పెట్రోల్ తీసుకువచ్చి కార్యాలయంలో చల్లాడు. ఇప్పటికిప్పుడు తన పని చేయకపోతే తగలబెడతానంటూ అధికారిని బెదిరించాడు.

కేఆర్ పురం కాంగ్రెస్ అద్యక్షుడు నారాయణ స్వామి బెంగళూరు మహానగర పాలికె అధికారులపై రెచ్చిపోయాడు. ఇతడికి సంబంధించిన ఓ ఆస్తి వ్యవహారంలో అధికారులు సహకరించడం లేదంటూ ఈ నెల 16న బీబీఎంపీ కార్యాలయానికి వెళ్లి ఇలా రౌడీయిజం చెలాయించినట్లు సమాచారం. ఈ వీడియో కాస్త సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది. దీంతో ఈ అధికార రౌడీయిజంతో కాంగ్రెస్ నాయకులు అధికారులను బెదిరించడం వారి పతనానికి దారితీస్తుందని కొందరు నెటిజన్లు మండిపడుతున్నారు. 

 

కాంగ్రెస్ నాయకుడి దౌర్జన్యం చూడండి

 

PREV
click me!

Recommended Stories

పెద్దపులి, ఎలుగుబంటి ప్రెండ్లీ ఫైటింగ్ (వీడియో)
సినీ నటి, ఎమ్మెల్యే రోజా బ్యాటింగ్ (వీడియో)