కర్ణాటక గవర్నర్ కు మరో షాక్ ఇచ్చేందుకు కాంగ్రెస్ స్కెచ్

First Published May 18, 2018, 8:10 PM IST
Highlights

జెడిఎస్ కూడా రెడీ

కర్ణాటక రాజకీయాలు రంజుగా మారుతున్నాయి. ప్రతి క్షణం కొత్త ఉత్కంఠ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఎత్తుకు పై ఎత్తులు వేస్తూ బిజెపి, కాంగ్రెస్ శిబిరాలు హల్ చల్ చేస్తున్నాయి. రాజకీయ ఆటలో ఎంపైర్ గా ఉండాల్సిన గవర్నర్ బిజెపి పక్షం వహిస్తున్నట్లు కాంగ్రెస్ ఆరోపణలు గుప్పిస్తోంది. కాంగ్రెస్ ఆరోపణలకు తగ్గట్టుగానే గవర్నర్ యాక్టివిటీ ఉందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

వివాదాస్పదమైన నేతగా ముద్రపడ్డారు కెజి బోపయ్య. ఆయన కేవలం ఇప్పటివరకు మూడుసార్లు మాత్రమే అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఆయన గతంలో స్పీకర్ గా పనిచేసినప్పుడు యడ్యూరప్పకు అనుకూలంగా పనిచేసినట్లు ఆరోపణలున్నాయి. ఈకేసు సుప్రీంకోర్టు వరకు వెళ్లింది. అక్కడ నిరూపితమైంది. అంతేకాదు ప్రొటెం స్పీకర్ గా సీనియర్ సభ్యుడిని నియమించాలని కాంగ్రెస్ పట్టుపడుతోంది.

ఎనిమిది సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన దేశ్‌పాండేను కాదని మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన కేజీ బోపయ్యను గవర్నర్ ప్రొటెమ్ స్పీకర్ గా నియమించాడు. మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన కేజీ బోపయ్యను నియమించడం పట్ల కాంగ్రెస్ ఆగ్రహంగా ఉంది. 2011లో యడ్యూరప్పకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసిన ఎమ్మెల్యేందరిపై అనర్హత వేటు వేశారు ఇప్పటి ప్రొటెం స్పీకర్ గా ఉన్న బోపయ్య.  ఆయన నిర్ణయాన్ని కర్ణాటక హైకోర్టు సమర్ధించగా, అనంతరం సుప్రీంకోర్టు ఆ నిర్ణయాన్ని కొట్టివేసింది.

8 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై ట్రాక్ రికార్డు సృష్టించిన సీనియర్ నేత ఆర్వీ దేశ్‌పాండేను కాదని, యడ్యూరప్పకు గతంలో అనుకూలం నిర్ణయం తీసుకోవడం ద్వారా వివాదాస్పదుడైన బీజేపీ ఎమ్మెల్యే బోపయ్యను ప్రోటం స్పీకర్‌గా ఎలా నిర్ణయిస్తారని కాంగ్రెస్ నిలదీస్తోంది. గవర్నర్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ మరోసారి సుప్రీం గడప తొక్కనుంది. మరోవైపు జెడిఎస్ కూడా సుప్రీంకోర్టు మెట్లెక్కాలని సంకల్పించినట్లు వార్తలొస్తున్నాయి. ఒకవేళ సుప్రీంకోర్టు స్పందిస్తే ఇది మరో వివాదం కానుంది. ఇప్పటికే గవర్నర్ బలపరీక్షకు ఇచ్చిన గడువును సుప్రీంకోర్టు తప్పుపట్టడమే కాదు కేవలం 24 గంటల సమయం మాత్రమే ఇచ్చి గవర్నర్ కు షాక్ ఇచ్చింది. మరి రెండో నిర్ణయం పై కూడా కోర్టు ఎలా రెస్పాన్డ్ అవుతుందో అన్న ఉత్కంఠ నెలకొంది.

click me!