‘అర్జున్ రెడ్డి’ సినిమా చూసిన కేటీఆర్

Published : Aug 28, 2017, 08:43 AM ISTUpdated : Mar 25, 2018, 11:55 PM IST
‘అర్జున్ రెడ్డి’ సినిమా చూసిన కేటీఆర్

సారాంశం

‘అర్జున్ రెడ్డి’ సినిమా చూసిన తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ ఫార్మా సిటీ  భూ నిర్వాసితులకు 8 కోట్ల ఎక్స్ గ్రేషియాను పంపిణి చేసిన మంత్రి మహేందర్ రెడ్డి డేరా బాబాకు పదేళ్ల కఠిన కారాగార శిక్ష  విధించిన సిబిఐ కోర్టు నంద్యాలలో టీడిపి అభ్యర్ధి భూమా బ్రహ్మానందరెడ్డి ఘన విజయం

 

మానవత్వాన్ని చాటుకున్న సీఎం కేసీఆర్

కాలేయ మార్పిడి  అవసరమైన పేద బాలుడికి ఆర్థిక సాయం అందించి మానవత్వాన్ని చాటుకున్నారు   సీఎం కేసీఆర్. గజ్వేల్ పట్టణానికి చెందిన హనుమాన్ దాస్ కుమారుడైన దేవసాని శ్రీమాన్ పుట్టుకతోనే కాలేయ సంభందిత వ్యాధితో బాధపడుతున్నాడు. దీనికి కాలేయ మార్పిడి ఒక్కటే పరిష్కారమని వైద్యులు చెప్పగా, అంత ఖర్చు భరించలేని తల్లిదండ్రులు ఆందోళన చెందారు.  ఈ విషయాన్ని దిన పత్రికల ద్వారా తెలుసుకున్న ముఖ్యమంత్రి, వెంటనే  సిద్ధిపేట కలెక్టర్ వెంకట్రామ్ రెడ్డితో ఈ విషయం గురించి మాట్లాడారు. వారికి అవసరమైన  వైద్యాన్ని అందించేందుకు ఏర్పాట్లు చేయాలని సూచించారు.  దీంతో కలెక్టర్ స్వయంగా బాలుడి కుటుంబ సభ్యులను కలిసి  కాలేయ మార్పిడికి అవసరమైన రూ.25 లక్షలను ప్రభుత్వం తరపున అందించనున్నట్లు తెలిపారు. 
 

సెప్టెంబర్ లో జలహారతి కార్యక్రమం

అమరావతి : సెప్టెంబర్  6, 7, 8 తేదీల్లో జరగనున్న ‘జలహారతి’ కార్యక్రమంలో తెలుగు ప్రజలందరూ పాల్గొనాలని సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. దీనికోసం ప్రభుత్వ అధికారులు ప్రజల్లో విస్తృత ప్రచారం కల్పించాలని సూచించారు. ఈ సమావేశంలో పాల్గొన్న జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు నంద్యాల ఉపఎన్నికల్లో టీడీపీ అఖండ విజయం సాధించిన సంధర్బంగా సీఎం కు అభినందనలు తెలిపారు. 
 

అమెరికాలో వరదల్లో చిక్కుకున్నభారతీయ విద్యార్థులు

అమెరికా లోని టెక్సాస్ ప్రాంతంలో హరికేన్ల ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాలతో అక్కడ నివసిస్తున్న భారతీయులు అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నట్లు విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ తెలిపారు. అక్కడే వున్న హ్యూస్టన్ యూనివర్సిటిలో చదువుకుంటున్న దాదాపు రెండు వందల మంది విద్యార్థులు ఈ వరదల్లో చిక్కుకున్నట్లు తమకు అమెరికన్ కాన్సులేట్ నుంచి సమాచారం అందిందన్నారు. వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి ప్రయత్నాలు కొనసాగిస్తున్నట్లు సుష్మా తెలిపారు.  

‘అర్జున్ రెడ్డి’ సినిమా చూసిన కేటీఆర్

‘అర్జున్ రెడ్డి’ ఇపుడు విమర్శకుల నుండి కూడా ప్రశంసలు అందుకుంటున్న మూవీ. సినీ అభిమానులే కాదు, ప్రముఖులనుంచి కూడా అశేశ ఆధరణ చూరగొంటున్న ఈ సినిమాను ఇవాళ తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ వీక్షించారు. అనంతరం ఆయన  హీరో విజయ దేవరకొండ పై ప్రశంసల వర్షం కురిపించారు. మంత్రి తో పాటు సినిమాను చూసిన హీరో విజయ్,   డైరెక్టర్ సందీప్ రెడ్డి, ప్రొడ్యూసర్ ప్రణయ్ రెడ్డి.. ఆ విషయాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నారు.  ఈ సందర్బంగా విజయ్ దేవరకొండ మాట్లడుతూ..  ఓ గొప్ప నాయకుడితో కలిసి సినిమా చూడడం చాలా సంతోషంగా ఉందన్నాడు.  

ఫార్మా సిటి భూ నిర్వాసితులకు ఎక్స్ గ్రేషియా పంపిణి

రంగారెడ్డి జిల్లా : ఇబ్రహీంపట్నం నియోజకవర్గం యాచారం మండలంలో ఏర్పాటుచేస్తున్న ఫార్మా సిటీ  కోసం భూములు కోల్పోతున్న  నిర్వాసితులకు 8 కోట్ల ఎక్స్ గ్రేషియాను రవాణా శాఖ మంత్రి మహేందర్ రెడ్డి పంపిణీ చేసారు.   ఫార్మా సిటీ భూ నిర్వాసితులైన  మేడిపల్లి, నక్కర్త, నానక్ నగర్, తాడిపర్తి, కుర్మిద్ద గ్రామాల రైతులకు న్యాయం చేయడానికే ప్రభుత్వం పనిచేస్తోందని మంత్రి అన్నారు. భూ నిర్వాసితులకు ఇంటికో ఉద్యోగం వచ్చేలా కృషి చేస్తానని మహేందర్ రెడ్డి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంఎల్ఏ మంచిరెడ్డి కిషన్ రెడ్డి  పాల్గొన్నారు..

సంగారెడ్డిలో మార్కెట్ యార్డును ప్రారంభించిన కడియం

సంగారెడ్డి జిల్లా కేంద్రంలో మార్కెట్ యార్డ్ ను ఉప ముఖ్య మంత్రి కడియం శ్రీహరి ఈ రోజు ప్రారంభించారు.  ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, సంగారెడ్డి మార్కెట్ కమిటీ చైర్మన్ కొండల్ రెడ్డి, స్థానిక టీఆరెస్ నేతలు, మరియు మార్కెటింగ్ శాఖ అధికారులు పాల్గొన్నారు.
 

గుర్మీత్ కి ఇరవై ఏళ్ల కఠిన కారాగార శిక్ష

మహిళలను భక్తి పేరుతో వశపర్చుకుని, వారిపై అఘాయిత్యాలకు పాల్పడిన సచ్చా సౌదా అధినేత రామ్ రహీం బాబాకు  ఇరవయేళ్ల కఠిన కారాగార శిక్ష విధిస్తూ సిబిఐ కోర్టు తీర్పు వెలువరించింది. బాబా చేసింది క్షమించరాని నేరమని, నమ్మి వచ్చిన అమాయకులపై అఘాయిత్యానికి పాల్పడిన అతడికి ఎంత పెద్ద శిక్ష విధించినా తప్పు లేదని సిబిఐ కోర్టు జడ్జి  వ్యాఖ్యానించారు. అయితే ఈ శిక్ష వెలువడగానే సిర్సా లోని సచ్చా సౌద ఆశ్రమంలో అల్లర్లు మొదలయ్యాయి. అక్కడ భారీగా గుమిగూడి వున్న భక్తులు తీవ్ర ఆందోళనకు దిగుతున్నారు.
 

సింగరేణి ఉద్యోగులూ... దైర్యంగా ఉండండి

ఉద్యోగాలు పర్మినెంట్ కాలేదని ఎవరూ అగాయిత్యాలకు పాల్పడవద్దని సింగరేణి ఉద్యోగులకు కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ భట్టి విక్రమార్క సూచించారు. ప్రభుత్వం మెడలు వంచైనా మీకు న్యాయం చేయడానికి ప్రయత్నిస్తామని ఆయన వారికి దైర్యాన్నిచ్చారు.  ఆయన కొత్తగూడెంలో థర్మల్ ప్రాజెక్టులో రెగ్యులరైజ్ కాలేదని ఆవేదనతో ఆత్మహత్య చేసుకున్న ఉద్యోగి కుటుంబానికి పరామర్శించారు.     

నంద్యాలలో టీడిపి విజయం కొనసాగిందిలా

రౌండ్         టీడిపికి వచ్చిన ఆధిక్యం         పోలైన ప్రాంతం 

1 రౌండ్ లో          1198                             నంద్యాల రూరల్
2 రౌండ్ లో         1634                              నంద్యాల రూరల్
3 రౌండ్ లో         3113                             నంద్యాల పట్టణం
4రౌండ్ లో          3597                            నంద్యాల పట్టణం
5 రౌండ్ లో         3492                           నంద్యాల పట్టణం
6 రౌండ్ లో         3302                          నంద్యాల పట్టణం
7 రౌండ్ లో          512                           నంద్యాల పట్టణం
8 రౌండ్ లో         348                            నంద్యాల పట్టణం
9రౌండ్ లో          879                            నంద్యాల పట్టణం
11రౌండ్ లో         604                            నంద్యాల పట్టణం
12రౌండ్ లో         1679                         నంద్యాల పట్టణం
13 రౌండ్ లో        1455                         నంద్యాల రూరల్
14 రౌండ్ లో        1904                         నంద్యాల రూరల్
15రౌండ్ లో         1442                         నంద్యాల రూరల్
16 రౌండ్ లో         654 (వైసీపి ఆధిక్యం)  నంద్యాల రూరల్
17 రౌండ్ లో         915                         గోస్పాడు మండలం
18 రౌండ్ లో         506                         గోస్పాడు మండలం
19రౌండ్ లో          367                         గోస్పాడు మండలం

 టీడిపి మొత్తం ఆధిక్యం  - 27456
 

మూడు రాష్ట్రాల్లోను అధికార పార్టీలదే విజయం
 

మూడు రాష్ట్రాల్లో నాలుగు అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో అధికార పార్టీలకే మళ్లీ విజయం వరించింది.  గోవాలో 2 అసెంబ్లీ స్థానాల్లో అధికార బీజేపి. ఢిల్లీలో ఒక స్థానంలో అధికార ఆప్ పార్టీ, ఆంద్ర ప్రదేశ్ లో టీడిపి పార్టీలు విజయం సాధించాయి.                         

నంద్యాలలో భూమా బ్రహ్మానందరెడ్డి ఘన విజయం

 

నంద్యాల ఉప ఎన్నికలో అధికార పార్టీ భారీ విజయాన్ని కైవసం చేసుకుంది. హోరా హోరీగా ఉంటుందనుకున్న పోటీ చివరకు ఏక పక్షంగా సాగింది. టీడిపి అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డి తన సమీప ప్రత్యర్ధి శిల్పా చక్రపాణి రెడ్డిపై 28 వేల  పైచిలుకు ఓట్లతో విజయదుందుభి మోగించారు.అయితే ఈ విజయంపై ఎన్నికల కమీషన్ అధికారిక ప్రకటన వెలువరించనుంది.  

పుట్టపర్తి లో టిడిపి సంబరాలు

నంద్యాల ఉప ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి భూమా బ్రహ్మానంద రెడ్డి భారీ మెజార్టీ తో గెలుపొందడంతో పుట్టపర్తి నియోజకవర్గ పరిధిలో మాజీ మంత్రి ఎమ్మెల్యే డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి నాయకత్వంలో ఓడి చెరువు, ఆమడ గురు ,నల్లమా డ, పుట్టపర్తి, బుక్కపట్నం, కొత్త చెరువు మండలాల్లో టీడీపీ ఆఫీసుల టీడీపీ కార్యకర్తలు ఎదుట సంబరాలు చేసుకున్నారు . బాణసంచా పేల్చారు. మిఠాయిలు పంచారు. 

 

17వ రౌండ్ కూడా టీడిపిదే,  26,523 ఓట్ల ఆధిక్యం

17వ రౌండ్ తర్వాత వివరాలు : టీడిపి పార్టీకి వచ్చిన మొత్తం ఓట్లు - 86555  

                                                    వైసీపి పార్టీకి వచ్చిన  మొత్తం ఓట్లు - 60,947

                                                     కాంగ్రెస్ పార్టీకి వచ్చిన  మొత్తం ఓట్లు - 1153

   

ఎట్టకేలకు 16 రౌండ్లో వైసీపికి స్వల్ప ఆధిక్యం

నంద్యాల ఫలితాలు మొదలైనప్పటి నుంచి మొదటిసారి  16వ రౌండ్ లో వైసీపీ ఆధిక్యం సాధించింది. ఈ రౌండ్లో టీడీపీ కి 4663 ఓట్లు రాగా, వైసీపీ 5317 ఓట్లు వచ్చాయి. మొత్తానికి వైసీపీకి 654. ఓట్ల ఆధిక్యత వచ్చింది.

 

ఆస్ట్రేలియా  చేరుకున్న TSMDC చైర్మన్ శేరి సుభాష్ రెడ్డి 

 

సిడ్నీ: ది మైనింగ్ 2017 మరియు ఆసియ పసిఫిక్ ఇంటర్నేషనల్ మైనింగ్ ఎక్సిహిబిషన్ కు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరపున హాజరుకానున్న శేరి  సుభాష్ రెడ్డి నేతృత్వం లోని బృందం ఈ రోజు సిడ్నీ చేరుకుందని తెరాస ఆస్ట్రేలియా అధ్యక్షుడు నాగేందర్ రెడ్డి కాసర్ల తెలిపారు . 29 న సిడ్నీ లో జరిగే ఆసియ పసిఫిక్ ఇంటర్నేషనల్ మైనింగ్ ఎక్సిహిబిషన్ లో పాల్గొని , 31 న బ్రిస్బేన్ లో జరిగే ది మైనింగ్  రిసోర్స్ కన్వెన్షన్స్ కు హాజరవుతారు . 4,5,6న మెల్బోర్న్ లో వివిధ  మైనింగ్ కంపెనీ  CEO లతో  జరిగే సమ్మిట్ లో పాల్గొని మైనింగ్ తవ్వకాలు ,సాంకేతిక నైపుణ్యత , మార్కెటింగ్, పర్యావరణ పరిరక్షణ , వివిధ నూతన శాస్త్రియ పద్దతుల పై చర్చించి , మన రాష్ట్రం లో ఇక్కడి పద్ధతులు అమలుచేయడానికి ఉన్న అంశాల పై శేరి సుభాష్ రెడ్డి బృందం చర్చించనుందని తెరాస ఆస్ట్రేలియా అధ్యక్షుడు నాగేందర్ రెడ్డి కాసర్ల తెలిపారు

 

 

 

15 వ రౌండ్ తర్వాత నంద్యాల తాజా వివరాలు 

టీడిపి అభ్యర్థి - భూమా బ్రహ్మానందరెడ్డి -  81,938 (ఆధిక్యం  26,033 )  

వైసీపి అభ్యర్ధి - శిల్పా  మోహన్ రెడ్డి - 55,675 (రెండో స్థానం )

కాంగ్రెస్ కు 898 ఓట్లు

రైల్వే కోర్టుకు హాజరైన మంత్రులు ( వీడియో ) 

తెలంగాణ ఉద్యమంలో భాగంగా 2011 లో మౌలాలీ రైల్వే జంక్షన్ వద్ద రైల్ రోఖో కు పాల్పడిన కేసులో ఇవాళ  మంత్రులు కేటీఆర్ ,నాయిని నర్సింహరావు, పద్మారావు కోర్టుకు హాజరయ్యారు. వీరితో పాటు మరో 14 మంది నిందితులు కూడా సికింద్రాబాద్ రైల్వే కోర్టులో హాజరయ్యారు.  
 

ఇప్పటి వరకు పార్టీల వారిగా వచ్చిన ఓట్ల వివరాలు

టీడిపి అభ్యర్థి - భూమా బ్రహ్మానందరెడ్డి - 70,766 (ఆధిక్యం 23,267 )  

వైసీపి అభ్యర్ధి - శిల్పా  మోహన్ రెడ్డి -47,499 (రెండో స్థానం )
 

శంషాబాద్ విమానాశ్రయంలో పట్టుబడిన అక్రమ బంగారం

శంషాబాద్ ఎయిర్‌పోర్టులో కస్టమ్స్,  ఇంటెలిజెన్స్ అధికారుల తనిఖీల్లో  అక్రమ బంగారం పట్టుబడింది. కౌలాలంపూర్ నుండి  ఎలాంటి అనుమతులు లేకుండా బంగారాన్ని తరలిస్తున్న  ముగ్గురు వ్యక్తులను ఎయిర్ పోర్టు అధికారులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 1 కిలో 505 గ్రాముల బంగారాన్నిస్వాధీనం చేసుకున్నారు. ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు కస్టమ్స్ అధికారులు తెలిపారు.

నంద్యాల ఫలితాల తాజా సమాచారం

టీడిపి అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డికి భారీ మెజారిటీతో దూసుకుపోతున్నారు. ఇప్పటి వరకు జరిగిన 11 రౌండ్లలో ఆయనకు వచ్చిన మొత్తం ఓట్లు  59,447. కాగా తీవ్ర పోటీనిస్తుందని భావించిన వైసీపి చతికిల పడింది. ఆ పార్టీ అభ్యర్ధి శిల్పా  మోహన్ రెడ్డికి వచ్చిన మొత్తం ఓట్లు 39,220. 
 మొత్తానికి టీడిపి ఆధిక్యం 20,227 గా ఉంది.

నంద్యాల  కౌంటింగ్ కేంద్రం వద్ద టీడీపీ నేతల సందడి 

 

 

అఖండ విజయం ఖాయమని తెలియడంతో  టీడీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు ఒక్కొక్కరుగా నంద్యాల  కేంద్రం వద్ద కు చేరుకుంటున్నారు. మంత్రులు నారాయణ, సోమిరెడ్డి, ఆదినారాయణ రెడ్డి, అచ్చన్నాయుడు ఎంపీ సీఎం రమేష్ పలువురు కోస్తాంధ్ర టీడీపీ ఎమ్మెల్యేలు  మీడియాతో మాట్లాడారు.నంద్యాలపై ప్రత్యేకంగా దృష్టిపెట్టి సీఎం చంద్రబాబు చేసిన అభివృద్ధి, భూమా కుటుంబానికి ఉన్న మంచి పేరే గెలుపుకు కారణమవుతున్నాయని టీడీపీ మంత్రులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే కౌంటింగ్ కేంద్రం వద్ద పెద్దగా వైసీపీ నేతలు ఎక్కడా కనిపించలేదు. మొదటి 7రౌండ్లలో టీడీపీ అభ్యర్థే ముందంజలో ఉండటంతో వైసీపీ కార్యకర్తలు తీవ్ర నిరాశ కు లోనయ్యారు.

 

 బోసిపోయిన లోటస్ పాండ్

 

నంద్యాల ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు సోమవారం ఉదయం ప్రారంభమైంది. ఉదయం 8 గంటలకు మొదలైన ఓట్ల లెక్కింపులో భాగంగా, తొలి ఐదు రౌండ్లు పూర్తయ్యేసరికి టీడీపీ 13135 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతోంది. దీంతో టీడీపీ అభ్యర్థి భూమా బ్రహ్మానంద రెడ్డి గెలుపు ఖాయమయింది.

కాగా, నంద్యాల ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపునకు ముందు పలువురు నేతలు, కార్యకర్తలతో సందడిగా ఉన్న హైదరాబాదులోని లోటస్ పాండ్ వైకాపా కార్యాలయం ఇప్పుడు వెలవెలబోతోంది. నేతలు ఒక్కొక్కరుగా బయటకు వెళ్లిపోతున్నారు.అలాగే, అధినేత వైఎస్ జగన్, ఇంతవరకూ తన ఇంటి నుంచి బయటకు రాలేదు. జగన్‌కు ఆరోగ్యం బాగాలేదని, అందువల్ల విశ్రాంతి తీసుకుంటున్నారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఈ ఎన్నికను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న జగన్.. నంద్యాలలో విస్తృతంగా ప్రచారం చేసిన విషయం తెల్సిందే

 

గోవాలో బీజేపి హవా

గోవాలో జరిగిన ఉపఎన్నికల ఫలితాల్లో అధికార బీజేపి హవా కొనసాగుతోంది.  అక్కడ వెలువడిన  ఉప ఎన్నికల ఫలితాల్లో పనాజీ స్థానం నుండి సీఎం మనోహర్ పారికర్ గెలుపొందగా, వాల్ పోయ్ లో విశ్వజిత్ రాణా గెలుపొందారు. అయితే రాజ్యసభ అభ్యర్థిగా కొనసాగుతున్న సీఎం, వచ్చే వారంలో రాజ్యసభకు రాజీనామా చేయనున్నారు. 

నంద్యాల ఎనిమిదో రౌండ్ సమాచారం

టీడిపి అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డికి వచ్చిన మొత్తం ఓట్లు   50,611

వైసీపి  అభ్యర్థి శిల్పా  మోహన్ రెడ్డికి వచ్చిన మొత్తం ఓట్లు   33,000

కాంగ్రెస్ కి వచ్చిన మొత్తం ఓట్లు 516 

ఇప్పటివరకున్న నంద్యాల సమాచారం

 

 

టీడిపి అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డికి వచ్చిన మొత్తం ఓట్లు  41,739
వైసీపి  అభ్యర్థి శిల్పా  మోహన్ రెడ్డికి  వచ్చిన మొత్తం ఓట్లు  24,824

కాంగ్రెస్ కి వచ్చిన మొత్తం ఓట్లు 461 

ఏడో రౌండ్ లో తగ్గిన టీడిపి జోరు

ఇప్పటి వరకు భారీ మెజారిటితో దూసుకుపోయిన టీడిపి పార్టీ ఏడో రౌండ్ కు వచ్చే సరికి స్వల్ప మెజారిటి తో సరిపెట్టుకుంది. వైసీపి తో పోలిస్తే టీడిపి అభ్యర్ధికి కేవలం  500 ఓట్లు మాత్రమే ఎక్కువ వచ్చాయి. 

 

నంద్యాల ఉప ఎన్నికల ఫలితాలు

ఆరో రౌండ్ ముగిసే సరికి 16,465 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్న భూమా బ్రహ్మనందరెడ్డి

  

సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ గా దీపక్ మిశ్రా

సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ గా దీపక్ మిశ్రా ప్రమాణ స్వీకారం చేశారు.ఆయనతో ఇవాళ  రాష్ట్రపతి  రామ్ నాథ్ కోవింద్ ప్రమాణ స్వీకారం చేయించారు.

నంద్యాలలో మొత్తం 19 రౌండ్లలో కౌంటింగ్

నంద్యాల: నంద్యాల ఉపఎన్నికలో కౌంటింగ్‌లో ప్రస్తుతం రెండోరౌండ్‌ ఓట్లు లెక్కిస్తున్నారు. మొత్తం 19 రౌండ్లలో కౌంటింగ్ జరుగుతుంది. 1నుంచి 5వ రౌండ్‌లో నంద్యాల రూరల్ ఓట్ల లెక్కింపు జరగనున్నది. 6నుంచి 16వ రౌండ్‌ వరకు నంద్యాల అర్బన్ ఓట్ల లెక్కింపు జరగనుంది. 17నుంచి 19వ రౌండ్‌లో గోస్పాడు మండల ఓట్ల లెక్కింపు మొత్తానికి మధ్యాహ్నం 12గంటలో తుది ఫలితం వెలువడే అవకాశం ఉంది.

 

 

ముగిసిన  నాలుగో రౌండ్ ఓట్ల లెక్కింపు
 

నాలుగో రౌండ్లో టీడిపి పార్టీ  9,653 ఓట్ల ఆధిక్యంతో కొనసాగుతుంది.

టీడిపి అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డికి వచ్చిన ఓట్లు 23,744
వైసీపి  అభ్యర్థి శిల్పా  మోహన్ రెడ్డికి వచ్చిన ఓట్లు 14,091

ముగిసిన మూడో రౌండ్ ఓట్ల లెక్కింపు
 

మూడో రౌండ్లో కూడా టీడిపి పార్టీ 5,676 ఓట్ల ఆధిక్యంతో కొనసాగుతుంది.
టీడిపి అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డికి వచ్చిన ఓట్లు 10,639
వైసీపి  అభ్యర్థి శిల్పా  మోహన్ రెడ్డికికి వచ్చిన ఓట్లు 7,679

 

రెండో రౌండ్ లో కూడా టీడిపిదే ఆధిక్యం

రెండో రౌండ్లో 2,816 ఓట్ల ఆధిక్యంతో  అధికార టీడిపి పార్టీ ముందంజలో వుంది.  

టీడిపికి వచ్చిన ఓట్లు   4,726 ,

వైసీపికి వచ్చిన ఓట్లు   3,126 

కొనసాగుతున్న నంద్యాల రూరల్ ఓట్ల లెక్కింపు లో  పుంజుకోలేక పోతున్న వైసీపి పార్టీ

అసలు పోటీలోనే లేనట్లుగా వున్న కాంగ్రెస్ పరిస్థితి

నంద్యాల తాజా సమాచారం

నంద్యాల లో ముగిసిన మొదటి రౌండ్  ఓట్ల లెక్కింపు

టీడిపికి వచ్చిన ఓట్లు : 5,477

వైసీపికి వచ్చిన ఓట్లు :4.279

కాంగ్రెస్ కు వచ్చిన ఓట్లు : 69

అధికార టీడిపి పార్టీకి 1,198 ఓట్ల ఆధిక్యం

 

నంద్యాల కౌంటింగ్‌.. పోస్టల్‌ ఓట్లేవీ చెల్లలేదు

నంద్యాల  రూరల్:  నంద్యాల ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు పటిష్ట బందోబస్తు మధ్య  ప్రారంభమైంది.   ఈ ఎన్నికల్లో మొత్తం 250 పోస్టల్‌ బ్యాలెట్లు పంపగా... 211 మంది ఏ అభ్యర్థికి ఓటు వేయలేదు. మరో 39 పోస్టల్‌ బ్యాలెట్లు సరైన చిరునామా లేకపోవడంతో వెనక్కి వచ్చాయి.

 

 

PREV
click me!

Recommended Stories

పెద్దపులి, ఎలుగుబంటి ప్రెండ్లీ ఫైటింగ్ (వీడియో)
సినీ నటి, ఎమ్మెల్యే రోజా బ్యాటింగ్ (వీడియో)