ఎక్స్ ప్రెస్ న్యూస్ :''నేను కాంగ్రెస్ పార్టీ అద్వానీని''

First Published Oct 31, 2017, 11:44 AM IST
Highlights

విశేష వార్తలు

  • మాస్ కాఫియింగ్ కు పాల్పడిన తిరునల్వేని ఎస్పీ అరెస్ట్ 
  • ప్రభుత్వంపై హైకోర్టు సీరియస్
  • రాహుల్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన రేవంత్
  • ఇటలీలోని మిలాన్ పట్టణంలో తెలుగు విద్యార్థులపై దాడి
  • ఉత్తర ప్రదేశ్ మీరట్ జిల్లాలో వృద్దురాలిపై దారుణం
  • ఎక్స్ గ్రేషియా పెంచాలంటూ ఆలేరు ప్రమాద మృతుల కుటుంబీకులు

''నేను కాంగ్రెస్ పార్టీ అద్వానీని''

తాను పదవులు ఆశించే రకం కాదని,  కాంగ్రెస్ పార్టీలో అద్వానీ లాంటివాడినని సీఎల్పీ నాయకుడు జానారెడ్డి తెలిపారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే సీఎం పదవిని అడగనని, అలాగని అధిష్టానం తనను ఆ పదవి చేపట్టమంటే చేపడతానని అన్నారు. 
అలాగే రేవంత్ కాంగ్రెస్ పార్టీ లో చేరడంపై స్పందించారు. పార్టీలో చేరగానే బాహుబలి కారని, పార్టీని గెలిపించేవారే నిజమైన  బాహుబలి అని అన్నారు. అసలైన బాహుబలి ఎవరో ప్రజలే నిర్ణయిస్తారని జానారెడ్డి అన్నారు.
 
 

హిమాచల్ ప్రదేశ్ బిజేపి సీఎం అభ్యర్థి ఎవరో తెలుసా ?

హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బిజేపి వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకుంటోంది. ఏ రాష్ట్రంలో అనుసరించని విధంగా ఉత్తరాఖండ్ లో ముందుగానూ సీఎం అభ్యర్థిని ప్రకటించింది. పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి ప్రేమ్ కుమార్ ధుమాల్ ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించింది.హిమాచల్ ఎన్నికల ప్రచారంలో బాగంగా ఓ బహిరంగ సభలో అమిత్ షా ఈ ప్రకటన చేశారు. రాజకీయ అనుభవం కల్గిన ప్రేమ్ కుమార్ ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించి, రాజకీయంగా ప్రత్యర్థులను దెబ్బతీయాలని బిజేపి బావిస్తోంది.
 

''గ్రూప్1, గ్రూప్2 పరీక్షల అక్రమాలపై సిబిఐ విచారణ జరిపించాలి''

తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన గ్రూప్1, గ్రూప్2 పరీక్షల్లో అక్రమాలు జరిగాయని, ఈ కుంభకోణం పై  సిబిఐతో దర్యాప్తు జరిపించాలని నిరుద్యోగ జెఏసి చైర్మన్ మానవతారాయ్ డిమాండ్ చేశారు. గ్రూప్1, గ్రూప్2 ల్లో జరిగిన పలు అక్రమాలు స్పష్టంగా కనిపిస్తున్నా, సిఎం కెసిఆర్ టీఎస్ పిఎస్సి ఛైర్మన్ లు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. లంచమడిగితే చెప్పుతో కొట్టమన్న సీఎం, ఈ గజదొంగలను దేనితో కొట్టాలో చెప్పాలన్నారు.
నిజంగా సిఎం కెసిఆర్ చిత్తశుద్ధి ఉంటే గ్రూప్1,గ్రూప్2పరీక్షలను రద్దు చేసి,  పోస్టుల సంఖ్య పెంచి మళ్ళీ పరీక్ష నిర్వహించాలని నిరుద్యో జెఏసి తరపున డిమాండ్ చేస్తున్నట్లు మానవతారాయ్ తెలిపారు.
 

మాస్ కాపీయింగ్ కు పాల్పడిన ఎస్పీ అరెస్ట్

సివిల్ సర్వీసెస్ పరీక్షలో మాస్ కాఫీయింగ్ పాల్గొన్న తిరుసల్వేని ఎస్పీ కరీం ను అరెస్ట్ చేసినట్లు తమిళనాడు డీసీపీ అరవిందన్ తెలివారు అతడికి హైదరాబాద్ నుంచి సహకరించిన లా ఆఫ్ ఎక్సకెన్స్ ఐఎఎస్ అకాడెమీ డైరెక్టర్ రాంబాబు , ఐపిఎస్ భార్య జాయిస్ ను కూడా అరెస్ట్ చేశారు. వారిద్దరిని నాంపల్లి కోర్టు కు తరలించారు. ట్రాన్సిట్ వారెంట్ పై వారిద్దరిని కూడా తమిళనాడుకు తరలించనున్నట్లు డిసిపి తెలిపారు. ఎఫ్ఐఆర్ లో ఇప్పటికి ఈ ముగ్గురిని నిందితులుగా చేర్చామని, ఇంకా దీంట్లో ఎవరైనా ఉన్నారా అన్న దానిపై దర్యాప్తు కొనసాగుతుందని అరవిందన్ తెలిపారు.
 

తెలంగాణ ప్రభుత్వంపై హైకోర్టు సీరియస్

కేవలం జేఏసీ తలపెట్టిన సభలకు సమావేశాలకు మాత్రమే ఎందుకు అనుమతి నిరాకరిస్తున్నారని తెలంగాణ ప్రభుత్వం పై హైకోర్టు సీరియస్ అయ్యింది. నవంబర్ 6 లోపు ఈ నిరాకరనకు సంబందించిన   సమగ్ర నివేదికను కౌంటర్ ద్వారా కోర్టుకు సమర్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. 
అంతకుముందు ఈ సభ అనుమతిపై కోర్టుకు  ప్రభుత్వం వివరణ ఇచ్చింది. రాష్ట్రంలో అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో సభలకు అనుమతులు నిరకరించామని సర్కారు కోర్ట్ కు తెల్పింది. దీనిలో బాగంగానే జేఏసీ తలపెట్టిన కొలువుల కొట్లాట సభకు కూడా అనుమతి నిరాకరించామని తెలిపింది. 
అయితే కేవలం జేఏసి సమావేశాలకు మాత్రమే అనుమతి నిరాకరిస్తున్నారని జేఏసి తరపు న్యాయవాది వాదించారు.
ఇరువురి వాదనలు విన్న న్యాయస్థానం తదుపరి విచారణను నవంబర్ 6 కు వాయిదా వేసింది. 

ఏపి సీఎంవో నిభందనలు పాటించడం లేదని హైకోర్టులో పిటిషన్

ఎపి సీఎంవో నిభందనలకు విరుద్ధంగా వ్యవహరిస్తుందని మాజీ సిఎస్ ఐవైఆర్ కృష్ణా రావు దాఖలు చేసిన పిటిషన్ పై ఇవాళ హైకోర్టు విచారణ చేపట్టింది. సీఎంవో కార్యాలయం నిభందనలనకు లోబడి రికార్డు మెయింటేన్ చేయడం లేదని, సరైన రీతిలో వ్యవహరించేలా ఆదేశాలు ఇవ్వాలని పిటిషనర్ దర్మాసనానికి విన్నవించారు.
అయితే సీఎంవో ను ఆదేశించే అధికారం కోర్టుకు ఉందో లేదో పరిశీలిస్తామని న్యాయమూర్తి తెలిపారు. అందువల్ల ఈ విచారణను మూడువారాలకు వాయిదా వేస్తున్నట్లు హైకోర్టు తెలిపింది.
 

విజయనగరం జిల్లాలో ఘోర అగ్నిప్రమాదం

విజయనగరం జిల్లా నెల్లిమర్ల లో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తు ఓ ఇంట్లో ప్రారంభమైన మంటలు వరుసగా అన్ని ఇళ్లకు పాకడంతో మొత్తం 17 ఇళ్లు దగ్దమయ్యాయి. ఈ అగ్ని ఇళ్లలోని వస్తువులన్ని కాలిపోయి చాలా కుటుంబాలు రోడ్డున పడ్డాయి. ప్రమాదంలో లక్షల రూపాయల ఆస్తి నష్టం జరగింది. దీనిపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పివేశారు.
 

కోదండరాం 24 గంటల మెరుపు దీక్ష
 

నిరుద్యోగ సమస్య పరిష్కారానికై సాగుతున్న ఆందోళనలపై ప్రభుత్వ నిర్బంధ,నిరంకుశ వైఖరులకు నిరసనగా టీజేఏసీ చైర్మన్ కోదండరాం 24గంటల నిరసన దీక్షకు దిగారు. ఈ దీక్ష కు కోదండరాం నివాసం వద్ద ప్రారంభమయింది. ఈ దీక్షలో జేఏసి నాయకులతో పాటు, పలు విద్యార్థి సంఘాల నేతలు కూడా పాల్గొన్నారు. ప్రభుత్వ నిర్భంద వైఖరిని మానకుంటే తమ నిరసనలు మరింత ఉదీతం చేస్తామని జేఏసి నాయకులు చెబుతున్నారు.
 

కాంగ్రెస్ పార్టీలో చేరిన రేవంత్ రెడ్డి 

కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి ఇవాళ ఉదయం కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. ఎఐసిసి ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ రేవంత్‌కు పార్టీ కండువా కప్పి పార్టీలోకి చేర్చుకున్నారు.డిల్లీలోని ఎఐసిసి కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో మరికొంత మంది టిడిపి నేతలు కూడా రేవంత్‌ బాటలో నడిచి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు.  వీరిలో ప్రముఖ నాయకులు సీతక్క, వేంనరేందర్ రెడ్డి(వరంగల్‌), సిహెచ్‌. విజయ రమణరావు(పెద్దపల్లి), అరికెల నర్సారెడ్డి(నిజామాబాద్), బోడ జనార్దన్, సోయం బాబురావు(బోథ్‌), పటేల్ రమేష్ రెడ్డి, దొమ్మటి సాంబయ్య, తోటకూర జానయ్య, కవ్వంపల్లి సత్యనారాయణ, మేడిపల్లి సత్యం, హరిప్రియ నాయక్, బల్య నాయక్, రాజారాం యాదవ్,బాలలక్ష్మిలు ఉన్నారు.

డిల్లీలో మూడు రోజులు...మూడు వందల విమానాలు రద్దు

డిల్లీలోని ఇందిరాగాంధి విమానాశ్రయంలో నవంబర్ ఏడు నుంచి 10 వ తేదీ వరకు 300 విమాన సర్వీసులు రద్దు కానున్నాయి. కారణం ఏంటంటే ఈ మూడు రోజులు విమానాశ్రయంలోని ఓ రన్  వే ను మూస్తుండటం. ఈ మార్పును ప్రయాణికులు గమనించాలని డిల్లీ విమానాశ్రయ అధికారులు తెలిపారు.
 

ఇటలీలో తెలుగు విద్యార్థులపై దాడి

ఇటలీలో తెలుగు విద్యార్థులపై జరిగిన దాడిపై కేంద్ర విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ స్పందించారు. మిలాన్ లో విద్యార్థులపై దాడి జరిగినట్లు గుర్తించామని, ఈ దాడిపై బారత కాన్సులేట్ నుంచి నివదిక వచ్చిందని, దాన్ని పరిశీలిస్తున్నామని సుష్మా ట్వట్టర్ లో ట్విట్ చేశారు. ఈ ఘటనపై విద్యార్థులెవరు ఆందోళన చెందవద్దని ఆమె తెలిపారు. ఈ దుర్ఘటనపై సంభందిత అధికారులతో చర్చిస్తున్నట్లు, విద్యార్థులు, వారి కుటుంబసభ్యులు కంగారు పడొద్దని సుష్మా స్వరాజ్ సూచించారు.
 

వందేళ్ళ వృద్దురాలిపై అత్యాచారం
 

దేశంలో పసిపాపలు, యువతులకే కాదు పండుముసలి వారికి కూడా భద్రత లేదన్న విషయం మరోసారి రుజువైంది. ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌ శివారు గ్రామంలో ఓ వందేళ్ల వృద్ధురాలు అత్యాచారానికి గురై ప్రాణాలు కోల్పోయిన విషాద సంఘటన చోటుచేసుకుంది.  
వివరాల్లోకి వెళితే మీరట్ శివారులోని ఓ గ్రామంలో దళిత కుటుంబానికి చెందిన వృద్ధురాలు వయో భారంతో కొన్నేళ్లుగా మంచానికే పరిమితమైపోయింది. అయితే ఆదివారం ఎవరూ లేని సమయంలో ఇంట్లోకి ప్రవేశించిన అంకిత్‌ పునియా(35) అనే వ్యక్తి ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. మంచం నుంచి లేవలేని, గట్టిగా అరవలేని స్థితిలో వున్న ఆమెపై అత్యంత పైశాచికంగా అత్యాచారం చేశాడు.  ఆమె ఏడ్చిన ఏడుపులు వినబడటంతో చుట్టుపక్కలవారు  ఏం జరిగిందోననే కంగారుతో తలుపులు తెరిచి యువకుడు చేస్తున్న అకృత్యాన్ని చూసి షాకయ్యారు. వెంటనే అతణ్ని బంధించి పోలీసులకు అప్పగించారు.అయితే ఈ ఘటనలో బాధిత వృద్దురాలు మృతి చెందింది.

ఆలేరులో రోడ్డుపై బైఠాయించిన మృతుల కుటుంబీకులు 
 

భువనగిరి జిల్లాలోని ఆలేరు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించిన కుటుంబాలకు 10 లక్షల  ఎక్స్ గ్రేషియా ప్రకటించాలని వరంగల్ హైవే మృతుల కుటుంబసభ్యులు బైఠాయించారు. ఆర్టీసి బస్సు ఆటోను డీ కొట్టడంతో ఐదుగురు మృత్యువాత పడ్డ పడిన విషయం తెలిసిందే. దీనిపై ఇప్పటికే 2 లక్షల ఎక్స్ గ్రేషియా ఇస్తామని మంత్రి మహేందర్ రెడ్డి ప్రకటించినప్పటి, ఆ ఎక్సగ్రేషియాను పది లక్షలకు పెంచాలని మృతుల కుటుంబీకులు రాస్తారెకో కు దిగారు. దీంతో వరంగల్ హైవే పై  3 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచి ట్రాఫిక్ జామ్ అయ్యింది.
 

కొలువుల కొట్లాటకు అనుమతి వచ్చేనా?

తెలంగాణ నిరుద్యోగుల యువత కోసం తలపెట్టిన కొలువుల కొట్లాట సభపై ఇవాళ హైకోర్టులో విచారణ జరగనుంది. ఈ నేపథ్యంలో సభకు కోర్టు అనుమతిస్తుందా, లేదా అని అందరిలో ఉత్కంట నెలకొంది. దీంతో తార్నాక లోని కోదండరాం ఇంటి వద్దకు నిరుద్యోగ యువత భారీగా చేరుకుంటున్నారు. అనుమతి వస్తే సరే, రాకుంటే తదుపరి ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న దానిపై జేఏసి, నిరుద్యోగ సంఘాలు చర్చించుకుంటున్నాయి.  

యాదాద్రి ప్రమాద మృతుల కుటుంబాలకు 2లక్షల ఎక్స్ గ్రేషియా 
 

యాదాధ్రి జిల్లాలో నిన్న జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు రెండు లక్షల ఎక్స్ గ్రేషియా అందించనున్నట్లు మంత్రి మహేందర్ రెడ్డి  ప్రకటించారు. అలాగే గాయపడిన వారికి ప్రభుత్వ తరపున వైద్యసాయం అందించనున్నట్లు మంత్రి తెలిపారు.
  గాంధీ ఆస్పత్రిలో చికిత్సపొందుతున్నబాదితులను పరామర్శించిన మంత్రి వారికి దైర్యం చెప్పారు.   మృతుల కుటుంబాలకు ప్రగాడ సానుభూతి, సంతాపం తెలిపారు. భాధితులకు మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లకు ఆదేశించారు. 
 ప్రమాదాలు చోటు చేసుకోకుండా తగిన చర్యలు తీసుకోవాలని  ఆయనతో పాటు అక్కడే వున్న ఆర్టీసీ ఎండి రమణారావు ఆదేశించారు.

click me!