ఇకపై పద్మ అవార్డులకు ఆన్ లైన్ దరఖాస్తులు

First Published Aug 17, 2017, 8:08 AM IST
Highlights
  • పద్మ అవార్డులకు  ఇకనుంచి ఆన్ లైన్ లో దరఖాస్తులు
  • 5 లక్షల కోసం భాలికను ఒమన్ దేశస్తుడికి  అమ్మేసిన  కన్న తండ్రి
  •   పోయెస్ గార్డెన్ ను స్మారక కేంద్రం చేయాలని నిర్ణయించిన తమిళనాడు ప్రభుత్వం  
  •  బాసర సరస్వతీ దేవి సన్నిధిలో కేంద్ర మంత్రి సుజనా చౌదరి
  • "ఎకో గణేశ బై జిహెచ్ఎంసి" కార్యక్రమానికి హాజరైన పురపాలక శాఖ మంత్రి కేటీఆర్
  •  

భూసేకరణ పై హైకోర్టు స్టే

 నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) జరుపుతున్న భూసేకరణ పై హైకోర్టు స్టే విధించింది. పోరంకి నుండి మచిలీపట్నం వరకు హైవే కోసం 2009 లో భూసేకరణ జరిపిన అధికారులు, ఇంతవరకు తమకు ఎలాంటి పరిహారం చెల్లిచలేదని  72 మంది భాదితులు హైకోర్టు ను ఆశ్రయించారు.వీరి తరపు న్యాయవాది రచనా రెడ్డి వాదిస్తూ  2013 భూసేకరణ చట్టం ప్రకారం భాదితులకు నష్టపరిహారం చెల్లించాలని  కోర్టును కోరారు.
 దీనిపై తదుపరి ఆదేశాలు వచ్చేంత వరకు ఎలాంటి డిమాలిజేషన్, డిస్పోజేషన్ యాక్టీవీటిని జరపొద్దంటూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. భూసేకరణ కు సంబంధించిన రికార్డులన్ని సెప్టెంబర్  5 లోగా సమర్పించాలని హైకోర్టు ప్రభుత్వాన్నిఆదేశించింది.

విమానాశ్రయంలో విదేశీ కరెన్సీ పట్టివేత

రంగారెడ్డి: శంషాబాద్ విమానాశ్రయం లో 57 లక్షల విదేశీ కరెన్సీ కస్టమ్స్ అధికారులు  పట్టుకున్నారు. దుబాయ్ నుండి ఎమిరేట్స్ విమానం లో హైదరాబాద్ వచ్చిన ఓ ప్రయాణీకుడి నుండి కరెన్సీ ని స్వాధీనం చేసుకున్నారు. అతడు ఈ కరెన్సీని ఇండియాకు తరలించడానికి గల కారణాలపై కస్టమ్స్ డీఆర్ఐ అధికారులు విచారిస్తున్నారు.  
 

ఇకపై పద్మ అవార్డులకు ఆన్ లైన్ దరఖాస్తులు

అత్యంత ప్రతిష్టాత్మక పద్మ అవార్డుల ఎంపికను ఇకపై అత్యంత పారదర్శకంగా నిర్వహిస్తామని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. వీటికి అర్హులైనవారి నుంచి ఆన్ లైన్ లో దరఖాస్తులను ఆహ్వానించనున్నట్లు ఆయన స్పష్టం చేశారు. ఇకపై పైరవీల ద్వారా అవార్డులను అందించే విధానానికి స్వస్తి పలకనున్నట్లు పీఎం తెలిపారు. ప్రతి పౌరుడు దేశ సేవ చేయాలని, అలాంటపుడే అత్యున్నత అవార్డులు సొంతమవుతాయని ఆయన సూచించారు. 
 

కూతురిని 5 లక్షలకు అమ్మేశాడు

పాతబస్తి తీగలకుంటకు చెందిన 16 ఏళ్ల బాలికను 5 లక్షల కోసం కన్న తండ్రి, మేనత్త కలిసి ఒమన్ దేశస్తుడికి  అమ్మేసిన ఘటన పాతభస్తిలో జరిగింది.65 ఏళ్ల షేక్ అహ్మద్ అనే ఒమన్ షేక్ గతంలో హైదరాబాద్ కి వచ్చి ఈ భాలికను పెళ్లిచేసుకున్నాడు. ఓ నాలుగురోజుల ఆమెతో గడిపి  తన దేశానికి వెళ్లిపోయాడు. ఈ విషయంలో అమ్మాయి మేనత్త గౌసియా నే అతడికి సహకరించింది.ఆమె తన అన్న అక్తర్  కూతురిని షేక్ కిచ్చి తో పెళ్లి చేశారు. అయితే  కూతురి పెళ్లి   విషయాన్ని ఆ బాలిక తల్లికి కూడా తెలియచేయలేదు.
ఇటీవలే భర్త దగ్గరకు వెళ్లిన ఈ భాలికను అతడు చిత్రహింసలకు గురి చేయడంతో ఆమె ఫోన్ ద్వారా తల్లికి తెలిపింది. ఆమె గౌసియాను నిలదీయగా తనకు సంభందం లేదని జవాబివ్వడంతో  ఆమె ఫలక్ నుమా పోలీసులను ఆశ్రయించింది. అయితే ఈ అమ్మాయిని ఇండియాకు పంపించాలంటే నిందితుడు తానిచ్చిన 5 లక్షలు తిరిగివ్వాలని డిమాండ్ చేస్తున్నాడు.  

సుత్తి సైకోకు మరణ శిక్ష 

సుత్తి సైకోకు మరణ శిక్ష విధించిన నెల్లూరు కోర్టు. ఇంట్లోకి ప్ర‌వేశించి న‌లుగురిని దారుణంగా హ‌త‌మార్చాడు. అందిన కాడికి దోచుకుపోయాడు.. మ‌రెంద‌రినో భ‌య‌బ్రాంతుల‌కు గురిచేశాడు.. మ‌రికొంద‌రిని గాయ‌ప‌రిచాడు.. ఇలా రెండేళ్ల పాటు సామాన్యుల‌కు ముచ్చెమ‌టలు ప‌ట్టించిన సైకో కిల్లర వెంక‌టేశ్వ‌ర్లు కేసులో నెల్లూరుజిల్లా కోర్టు సంచ‌ల‌న తీర్పునిచ్చింది.. మంచినీళ్లు తాగినంత ఈజీగా మ‌నుషుల ప్రాణాల‌ను బ‌లితీసుకున్న సైకో కు మ‌ర‌ణ శిక్ష విధించింది.. గ‌తేడాది సెప్టెంబ‌ర్ లో నెల్లూరు న‌గ‌రంలోని చిల్డ్ర‌న్స్ పార్కు స‌మీపంలో ఓ ఉపాద్యాయురాలిని హ‌త‌మార్చి అడ్డొచ్చిన కూతుర్ని దారుణంగా సుత్తి కొట్టాడు. దీనిని గమనించిన స్థానికులు నిందితుడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. అప్పటినుంచి కొనసాగుతున్న కేసులో ఇవాళ తుది తీర్పును వెలువరించింది నెల్లూరు కోర్టు.

జయలలిత మృతిపై జ్యుడిషియల్ విచారణ

జయలలిత మృతిపై జ్యుడిషియల్ విచారణకు ఆదేశించాలని తమిళనాడు ప్రభుత్వం నిర్ణయించింది. రిటైర్డ్ జడ్జితో విచారణ జరిపించాలని తమిళనాడు సీఎం పళని స్వామి ఆదేశించారు. అలాగే జయలలిత నివాసమైన పోయెస్ గార్డెన్ ను స్మారక కేంద్రంగా చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

ఇరోమ్ షర్మిళ పెళ్లి చేసుకున్నారు

మణిపూర్ పౌరహక్యుల ఉద్యమ నేత, ఉక్కు మహిళ ఇరోమ్ షర్మిల వివాహం చేసుకున్నారు. బ్రిటీష్ పౌరుడు డెస్మండ్ కౌటినోతోఅమె వివాహం  ఈ రోజు నిరాడంబరంగా జరిగింది. తమిళనాడులోని కొడైకెనాల్‌లోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో వీరి వివాహం జరిగింది. వీడియోగ్రాఫర్ తప్ప మరొకఅతిధి ఎవరూ లేరు.  తల్లి ఆరోగ్యం బాగలేకపోవడంతో పెళ్లికి రాలేదని, ఫోన్ ద్వారా ఆమె ఆశీర్వాదాలు తీసుకున్నట్టు షర్మిల తెలిపారు.

నల్ల బజారుకు తరలుతున్న రేషన్ బియ్యం

హైదరాబాద్ పాతబస్తీలో అక్రమంగా నిల్వచేసిన రేషన్ బియ్యం బస్తాలను సివిల్ సప్లయ్ అధికారులు పట్టుకున్నారు. రెయిన్ బజార్ పరిధిలో అక్రమంగా నిల్వ వుంచిన 60 క్వింటాళ్ల బియ్యం బస్తాలను ప్రజా పంపిణీ అధికారులు స్వాదీనం చేసుకున్నారు. ప్రజలకు పంపిణి చేయాల్సిన రేషన్ బియ్యాన్ని నల్ల బజారుకు తరలించిన జఫ్ఫార్ మరియు సలీమ్ లను అదుపులోకి తీసుకున్నారు. వారిపై కేసు నమోదు చేసి వారిని విచారించనున్నట్లు పోలీసులు తెలిపారు.  

టీం ఇండియా వైస్ కెప్టెన్ గా రోహిత్ శర్మ

శ్రీలంకతో జరగనున్న వన్డే సీరిస్ కు రోహిత్ శర్మను వైస్ కెప్టెన్ గా నియమించింది బిసిసిఐ. లంకతో  ఐదు వన్డేలు ఆడనున్న టీం ఇండియాకు తనను వైస్ కెప్టెన్ గా నియమించడం  ఆనందంగా ఉందని రోహిత్ తెలిపాడు. టీం ఇండియాకు సారధ్యం వహించాలనే తన కోరికకు అత్యంత దగ్గరకు రావడం మంచి పరిణామమన్నారు. తన ప్రతిభను, సత్తాను గుర్తించి ఉపసారథ్య భాద్యతలు అప్పగించిన  సెలెక్షన్ కమిటీకి రోహిత్ దన్యవాదాలు తెలిపాడు.  
 

యూపీ ప్రభుత్వ అసమర్థత వల్లే చిన్నారుల మృతి

ఉత్తరప్రదేశ్  గోర​ఖ్ పూర్ లో  ఆక్సిజన్ అందక చనిపోయిన  72 మంది విద్యార్థుల మరణాలకు కారణమైన వారిని వెంటనే కఠినంగా శిక్షించాలని ఎఐడిఎస్ఒ డిమాండ్ చేసింది. దీనికి వ్యతిరేకంగా బషీర్ బాగ్ చౌరస్తాలో హైదరాబాద్ శాఖ తరపున ర్యాలీ నిర్వహించి, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. ప్రభుత్వ హాస్పిటల్స్ లో మౌలిక సదుపాయాలు కల్పించలేని  యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, ఆరోగ్య శాఖ మంత్రి వెంటనే రాజీనామ చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో  ఎఐడిఎస్ఒ రాష్ట్ర ఉపాద్యక్షులు తేజ, జిల్లా అద్యక్షులు మల్లేశం తదితరులు పాల్గొన్నారు.
 

 

జనసేనకు ఇక శాఖలు వస్తాయి

 

జనసేన పార్టీని 2019 ఎన్నికలకు సమాయాత్తం చేసేందుకు పార్టీ యంత్రాంగం రూపొందించేందుకు అధ్యక్షుడుపవన్ కల్యాణ్ చర్యలు తీసుకుంటున్నారు. తొందర్లో అనుబంధ సంస్థలను ఏర్పాటుచేస్తామని ఆయన ప్రకటించారు. విద్యార్థి, మహిళా ఏర్పాటు చేస్తామని ఆయనచెప్పారు. పార్టీ నిబంధనావళి కూడా తయారువుతుందని ఆయన అన్నారు.ఈ ఏడాదిలోపే అనుబంధ సంస్థలు ఏర్పాటవుతాయని అన్నారు.

చక్రపాణి రెడ్డి రాజీనామ ఆమోదం 

టీడిపిని వీడి వైయస్సార్ కాంగ్రెస్ లో చేరిన శిల్పా చక్రపాణి రెడ్డి రాజీనామా ఆమోదం పొందింది. శిల్పా రాజీనామాను ఆమోదిస్తున్నట్లు అసెంబ్లీ ప్రత్యేక కార్యదర్శి రామాచారి ఒక బులెటిన్ జారీ చేసారు. తెలుగుదేశం తరపున ఎమ్మెల్సీ పదవిని పొందిన ఆయన నంద్యాల ఉపఎన్నికల సంధర్బంగా వైసీపి లో చేరి తన పదవికి రాజీనామా చేసిన విషయం అందరికి తెలిసిందే. కానీ ఇంత తొందరగా రాజీనామా ఆమోదం పొందడం మాత్రం ఎవరూ ఊహించని పరిణామం.
 

విజయవాడలో విజృంభించిన చైన్ స్నాచర్లు

 

విజయవాడ నగరంలో ఈ రోజు మూడు ప్రాంతాలలో చైన్ స్నాచర్స్ విజృంభించారు
ఈ ఉదయం గురునానక్ కాలనీ సమీపంలో మారుతీ కోపరేటివ్ కాలనీ కి చెందిన మహిళల మార్కెట్ కి వెళ్ళి వస్తుంటే ఇద్దరు యువకులు రెడ్ కలర్ బైక్ పై వచ్చి మెడలో గోలుసు లాక్కుని వేగంగా వెళ్ళి పోయారని మహిళ ఫిర్యాదు చేసింది మరో 10ని వ్యవధి లో శ్రీనివాస నగర్ బ్యాంకు కాలనీ సమీపంలో మరో మహిళ మెడలో గోలుసు లాక్కుని వేగంగా అయుష్ హాస్పిటల్ వైపు వెళ్లి అక్కడ మరో మహిళల గుడికి వెళ్ళి వస్తుంటే అమె మెడలో ఉన్న గోలుసు లాక్కుని పారిపోయారు ..వరుస స్నాచింగ్స్ తో కంగారు పడిన పోలిసులు చోరీ జరిగిన ప్రాంతాలలో సి సి టివి ఫుటేజ్ పరిశీలించారు మూడు ప్రాంతాలలో ఒకే బైక్ కనపడటంతో బైక్ మీడ ఇద్దరు యువకులు ఫోటో లను భాదితులకి చూపించారు గుర్తుపట్టిన భాదితులు పోలీసు లకి ఫిర్యాదు చేశారు సి సి టివి ఫుటేజ్ పోటోలను నగరం తో పాటు గుంటూరు కృష్ణా జిల్లా పోలిసులు కి పంపించారు.నగర శివారు ప్రాంతాలలో ఇప్పటికే విస్తృతం గా తనిఖీ చెప్పట్టారు
ఉదయం 10.30 ని నుండి 11గం ప్రాంతం లో మూడు దొంగతనాలు జరగటం విశేషం...ఎ సి పి సత్యానందం కైమ్ ఎ సి పి పెనమలూరు సి ఐ దామోదర్ ఈ మూడు ప్రాంతాలని పరిశీలించారు....

 

భాగ్యనగరంలో మరో చైన్ స్నాచింగ్ 

హైదరాబాద్: ఎల్ బి నగర్ లోని అలెక్య టవర్స్ సమీపంలో చైన్ స్నాచింగ్ జరిగింది. ఆటో కోసం వేచివున్న మహిళ మెడలోంచి 5 తులాల బంగారు  గొలుసును బైక్ పై వచ్చిన దుండగులు అపహరించుకుని పారిపోయారు. దీంతో బాధితురాలు ఎల్ బి నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది.  
 

డిల్లీ పోలీసులకు బెదిరింపు కాల్స్

డిల్లీ హైకోర్టును పేల్చివేస్తామంటు పోలీసులకు బెదిరింపు కాల్  రావడంతో కోర్టు వద్ద భద్రతను కట్టుదిట్టం చేసారు. ముందుగానే బాంబ్ స్క్వాడ్, అగ్నిమాపక సిబ్బంది, పోలీసు బలగాలను  కోర్టు వద్ద మొహరించారు. పోన్ కాల్ వివరాలను సేకరించడానికి పోలీసులు ముమ్మరంగా ప్రయత్నిస్తున్నారు.  
 

సంగారెడ్డిలో జగ్గారెడ్డి అరెస్టు

సంగారెడ్డి కలెక్టరేట్‌ దగ్గర అమరణ నిరాహారదీక్ష కు బయల్దేరిన కాంగ్రెస్‌ నేత జగ్గారెడ్డి  పోలీసులు అరెస్టు చేశారు. జిల్లాలో మెడికల్‌ కాలేజీ ఏర్పాటు చేయాలన్న డిమాండ్‌తో ఆయన ఈ రోజు దీక్షకు పూనుకున్నాడు. అయితే ఆయన దీక్షకు అనుమతి లేదని, అందువల్లే ముందుగానే అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.ఆయన్ని జోగిపేట  జైలుకు తరలించారు.  అరెస్టు నేపథ్యంలో సంగారెడ్డిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇప్పటికే దీక్షా ప్రాంతానికి భారీ ఎత్తున చేరుకున్న కాంగ్రెస్ కార్యకర్తలు జగ్గారెడ్డి అరెస్టుకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు.  
 

పర్యావరణ హిత గణేశుడు వచ్చేస్తున్నాడు

హైదరాబాద్ : శిల్పకళా వేదికలో  జరుగుతున్న "ఎకో గణేశ బై జిహెచ్ఎంసి" కార్యక్రమానికి పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మనందరికీ ఇష్టమైన ఆది దేవుడు వినాయకుని పండుగను పర్యావరణ హితంగా జరుపుకోవాలని మంత్రి తెలిపారు. హైద్రాబాద్ లో మొదలైన ఈ మార్పు దేశానికే ఆదర్శంగా నిలిచేలా నగర ప్రజలు ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు.  కాలుష్యానికి దూరంగా పండుగను జరుపుకోవాలన్న లక్ష్యం తో 2 లక్షల మట్టి గణేషుడి ప్రతిమలను నగర ప్రజలకు అందించబోటుతున్నట్లు ఆయన తెలిపారు. జిహెచ్ఎంసి, హెచ్ఏండీఏ,పొల్యూషన్ కంట్రోల్ బోర్డు,వివిధ స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యం లో  స్టాల్స్ ని ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు. కేటీఆర్ తో పాటు మరో మంత్రి  మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యేలు అరికపూడి గాంధీ, బాజిరెడ్డి గోవర్ధన్, మేయర్ బొంతు రాంమోహన్, డిప్యూటీ మేయర్ బాబా ఫాసిదోద్దీన్, కమిషనర్ జనార్దన్ రెడ్డి లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
 

బాసర జ్ఞాన సరస్వతి సన్నిధిలో కేంద్ర మంత్రి 

బాసరలోని సరస్వతీ దేవి అమ్మవారిని కేంద్ర మంత్రి సుజనా చౌదరి కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. మనువడు అర్జున్ ప్రసాద్ అక్షరాబ్యాసం కోసం భాసర ఆలయానికి వచ్చినట్లు  సుజన తెలిపారు. ఆలయానికి విచ్చేసిన కేంద్ర మంత్రికి ఆలయ అధికారులు సాదర స్వాగతం పలికారు.ఈ కార్యక్రమంలో తెలంగాణలోని సుజనా సన్నిహితులు కూడా కొంతమంది పాల్గొన్నారు.
 

లోథా కమ్యూనిటీలో ప్లాట్ల యజమానుల ఆందోళన
 

కూకట్ పల్లిలోని లోథా టవర్స్  గేటెడ్ కమ్యూనిటిలో వివాదం చెలరేగింది. బిల్డర్ మోసం చేశాడంటూ ప్లాట్ల యజమానులు ఆందోళనకు దిగారు. ఈ విషయంపై ఇక్కడే నివాసముంటున్న సినీనటుడు జగపతిబాబు మాట్లాడుతూ ఒక్కో ప్లాట్ కి 4 కోట్ల వరకు చెల్లించామని, అయినా బిల్డర్ అడ్డగోలగా వ్యవహరిస్తున్నాడని తెలిపారు. పక్క కమ్యూనిటీలను కూడా దీనిలో కలపడానికి ప్రయత్నిస్తున్నట్లు ఆయన తెలిపారు. వివిధ రంగాల ప్రముఖులు, పారిశ్రామికవేత్తలు ఉంటున్న కమ్యూనిటిలో సెక్యూరిటీని కూడా సరిగ్గా కల్పించడంలేదని  జగపతిబాబు ఆందోళన వ్యక్తం చేసారు.  

 రైల్వే ఉద్యోగాల పేరిట నిరుద్యోగులకు టోకరా

రైల్వే శాఖలో ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులను దగా చేస్తున్న మోసగాళ్లను టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అరెస్టు చేసారు. బంజారాహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో నిరుద్యోగులను మోసం చేస్తున్న వెంకట్‌ రెడ్డి, రాజేష్‌ అనే నిందితులను అదుపులోకి తీసుకున్న టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు వారిని బంజారాహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌ లో అప్పగించారు. నిందితులు సుమారు రూ. 20 లక్షలవరకు నిరుద్యోగుల నుండి దండుకున్నట్లు పోలీసులు తెలిపారు. మరో నిందితుడు శివ కోసం పోలీసులు గాలిస్తున్నారు.  

ఆస్తి తగాదాలతో తమ్ముడిని చంపిన అన్న
 

ఆస్తి తగాదాలతో ఇద్దరు అన్నదమ్ములు ఒకరి పై ఒకరు దాడి చేసుకొని ప్రాణాలమీదికి తెచ్చుకున్నారు.  ఉప్పల్ లోని  పద్మావతి కాలనీ లో వంద గజాల స్థలం కోసం ఈ ఇద్దరు అన్నదమ్ముల మధ్య వివాదం చెలరేగింది.తమ్ముడు బండారు యేసు తనకు ఎదురుతిరిగడంతో కోపోద్రోకానికి లోనైన అన్న నాగరత్నం కత్తి తో పొడిచాడు. ఈ దాడితో యేసు ఘటనాస్థలంలోనే మృతి చెందాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొన్న ఉప్పల్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

నిర్మల్ జిల్లాలో రోడ్డు ప్రమాదం


నిర్మల్ జిల్లా : ఖానాపూర్ మండల కేంద్రంలోని కొమురం భీమ్ కూడలి వద్ద వేగంగా వెలుతున్న ఇన్నోవా కారు అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో వాహనంలోని ముగ్గురు వ్యక్తులకు గాయాలవగా   ఖానాపూర్ లోని ఆసుపత్రికి తరలించారు.

 

హాఫీజ్ పేట లో  ప్రమాదం 
 

హైదరాబాద్ : హాఫీజ్ పేట లోని వాటర్ బోర్డ్ రిజర్వాయర్  ప్రహారి గోడ కూలి రోడ్డు పై వెలుతున్న వాహన దారుల  పై పడడంతో ముగ్గురుకి తీవ్ర గాయాలయ్యాయి. సంఘటన స్థలానికి చేరుకొన్న  తెలంగాణ యూత్  కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ రవి కుమార్ యాదవ్ గాయపడ్డ వారిని చికిత్స నిమిత్తం దగ్గర్లోని ప్రైవేట్ హాస్పత్రికి తరలించారు. గాయపడ్డ వారి చికిత్సకయ్యే ఖర్చులను భరించడంతో పాటు, వారి కుటుంబాలకు  ప్రభుత్వం అండగా ఉండాలని ఆయన డిమాండ్ చేశారు. వారికి న్యాయం జరిగే వరకు పోరాడుతామని రవి కుమార్ యాదవ్ తెలిపారు.   

పాతబస్తిలో కార్డన్ సెర్చ్

పాతబస్తీలో డీసీపీ సత్యనారాయణ నేతృత్వంలో కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఈ తనిఖీల్లో దాదాపు 300 మంది పోలీసులు పాల్గొన్నారు. ఫలక్ నుమా, ఛత్రినాక పరిసర ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించి అనుమానాస్పద వాహనాలను,వస్తువులను స్వాదీనం చేసుకున్నారు. గూగుల్ మ్యాప్ ద్వారా రహదారులు దిగ్బంధనం చేసిమరీ తనిఖీలు నిర్వహించారు.  

ఉద్యోగ నియామకాల వేగం పెంచిన టీఎస్‌పీఎస్సీ

వైద్య ఆరోగ్యశాఖ, ఇన్సూరెన్స్‌ మెడికల్‌ సర్వీసెస్, అటవీ శాఖలలో పోస్టుల భర్తీకి అక్టోబరు 8నుంచి  రాత పరీక్షలు నిర్వహించనున్నట్లు టీఎస్‌పీఎస్సీ తెలిపింది. మొత్తం 2,345 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లను జారీ చేసిన టీఎస్‌పీఎస్సీ, పరీక్షల పూర్తి వివరాలను వెబ్  సైట్ లో ఉంచింది. ఈ నెల 21, 22 తేదీల్లో ప్రారంభమయ్యే దరఖాస్తుల కోసం అభ్యర్థులు వన్‌టైమ్‌ రిజిస్ట్రేషన్‌ తప్పనిసరిగా చేసుకోవాలి. ఈ పరీక్షలను  ఆన్ లైన్ ఆదారితంగా గాని రాత పరీక్షగా గాని నిర్వహిస్తామని టీఎస్‌పీఎస్సీ తెలిపింది.

click me!