
వలసల జిల్లాగా పేరు పొందిన మహబూబ్ నగర్ జిల్లాను పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా పచ్చని పైరుల జిల్లాగా మార్చడానికి తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. ఆవాళ ఆయన పాలమూరు జిల్లాలోని గట్టు మండల కార్యాలయ ఆవరణలో చేపట్టిన సమన్వయ కమిటీ సభ్యుల శిక్షణా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ... తెలంగాణ ప్రజల సాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించడం కోసం ప్రభుత్వం ప్రాజెక్టుల నిర్మాణాన్ని మహా యజ్ఞంలా నిర్వహిస్తోందన్నారు. రైతుల సంక్షేమం కోసం నియమించబడిన సమన్వయ కమిటీ సభ్యులైన మీరు భాద్యతాయుతంగా నడుచుకోవాలని అన్నారు.
ముంబై: ఆస్ట్రేలియాతో జరగనున్న 5 వన్డే సిరీస్ లో భాగంగా తొలి మూడు వన్డేలకు టీం ఇండియా తరపున ఆడనున్న ఆటగాళ్ల పేర్లను సెలెక్షన్ కమిటీ ప్రకటించింది. విరాట్ కోహ్లి(కెప్టెన్), రోహిత్‌శర్మ, శిఖర్ ధావన్, కేఎల్ రాహుల్, మనీష్ పాండే, కేదార్ జాదవ్, అజింక్య రహానే, ఎమ్మెస్ ధోనీ, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, కుల్‌దీప్ యాదవ్, యజువేంద్ర చాహల్, జస్‌ప్రీత్ బుమ్రా, భువనేశ్వర్ కుమార్, ఉమేష్ యాదవ్, షమి ల పేర్లు ఈ జాబితాలో ఉన్నాయి.
హైదరాబాద్ : ఇండియన్ సైకియాట్రిక్ సొసైటీ ఆధ్వర్యంలో ఆత్మహత్యలకు వ్యతిరేకంగా చేపట్టిన 2కే రన్ ను పీపుల్స్ ప్లాజా వద్ద తెలంగాణ డీజిపి అనురాగ్ శర్మ ప్రారంభించారు. ఇవాళ ఆత్మహత్యల నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ రన్ కార్యక్రమాన్ని చేపట్టినట్లు నిర్వహకులు పేర్కొన్నారు. ఈ సంధర్బంగా డీజిపి మాట్లాడుతూ...ఆత్మహత్య చేసుకునే ముందు ఒక్క నిమిషం తమపై ఆధారపడ్డవారి గురించి ఆలోచించాలని అన్నారు. ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా తన జీవితాన్ని కొనసాగించే వారే నిజమైన దైర్యవంతులని, అందరూ అలా దైర్యంగా జీవనం సాగించాలని పిలుపునిచ్చారు.
వికారాబాద్ జిల్లా : చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా తాండూరు లోని విజయ్ విద్యాలయ సర్కిల్ లో ఆమె విగ్రహాన్ని రవాణ శాఖ మంత్రి మహేందర్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ... రైతుల పక్షాన నిలబడి, భూస్వాముల దౌర్జన్యాలను ఎదిరించి తెలంగాణ విమోచన కోసం పోరాడిన వీరవనిత ఐలమ్మ ఆశయ సాధనకు కృషి చేద్దామని పిలుపునిచ్చారు. కుల వృత్తులను ప్రోత్సహిస్తూ వారి అభ్యున్నతికి సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని గుర్తుచేశారు. బంగారు తెలంగాణ సాదనకు తెలంగాణ అమరవీరులు చూపిన బాటలో నడవాలని మంత్రి మహేందర్ రెడ్డి సూచించారు.
విశాఖపట్నం లో జరుగుతున్న ఇంటర్నేషనల్ ఇన్నోవేషన్ ఫెయిర్ 2017 కార్యక్రమంలో ఆంధ్ర ప్రదేశ్ ఐటీ మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు. ఇన్నోవేషన్ ఫెయిర్ లో భాగంగా ఏర్పాటుచేసిన ఏపీసీటీటీ వర్క్ షాప్ ను ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రితో పాటు ఎంపీ హరిబాబు ,ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు, ఏపీ ఐటీ సలహాదారు జేఏ చౌదరి,ఐటి శాఖ సెక్రెటరీ విజయానంద్ లు పాల్గొన్నారు.
సిద్దిపేట: బీహార్ రాష్ట్ర డిప్యూటీ సీఎం సుశీల్‌కుమార్ మోదీ ఆదివారం సిద్దిపేట జిల్లా గజ్వేల్ లో పర్యటించనున్నారు. ఈ సందర్బంగా కోమటిబండ గ్రామంలో జరుగుతున్న మిషన్ భగీరథ పథకం తీరుతెన్నులను ఆయన పరిశీలించనున్నారు. అలాగే... గజ్వేల్‌లో ఎడ్యుకేషనల్ హబ్‌ను సుశీల్ మోదీ పరిశీలించనున్నారు. అనంతరం మర్కుక్ మండలంలోని తెలంగాణ సీఎం దత్తత గ్రామమైన ఎర్రవల్లి ని ఆయన సందర్శించనున్నారు.