
గద్వాల్ జిల్లాలోని గట్టు మండల కేంద్రంలో పీడిఎస్‌యూ ఆద్వర్యంలో రాజకీయ శిక్షణ తరగతులు విజయవంతం ముగిశాయి. ఈ సందర్బంగా వీడ్కోలు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పీడిఎస్‌యూ రాష్ట్ర సహాయ కార్యదర్శి బోయినపల్లి రాము మాట్లాడుతూ, టీఆర్ఎస్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. విద్యారంగాన్నీ కేసిఆర్ ప్రభుత్వం విస్మరిస్తోందని ఆయన విమర్శించారు. ఈ కార్యక్రమంలో పీడిఎస్‌యూ మాజీ రాష్ట్ర కార్యదర్శి అరుణ్ కుమార్, సీపిఐ ఎమ్ఎల్ న్యూడేమోక్రాసి గద్వాల్ జిల్లా నాయకులు హనుమంతు పాల్గొన్నారు.
న్యూఢిల్లీ: మధ్య ప్రదేశ్ లో బొగ్గు గనుల కేటాయింపుల్లో అవకతవకలకు పాల్పడిన కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న పారిశ్రామికవేత్త, కాంగ్రెస్ మాజీ ఎంపీ నవీన్ జిందాల్‌కు బెయిల్ లభించింది. సీబీఐ ప్రత్యేక న్యాయమూర్తి భరత్ పరాషార్ ఆయనకు బెయిల్ మంజూరు చేశారు. తదుపరి విచారణను అక్టోబర్ 31కి వాయిదా వేశారు.
ఆర్థిక రాజధాని ముంబై పర్యటనలో బిజీబిజీ గా గడుపుతున్న తెలంగాణ మంత్రి కేటీఆర్ ఆర్‌బిఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్‌తో సమావేశమయ్యారు. తెలంగాణలో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు ఎదుర్కొంటున్న ఇబ్బందుల పై ఆయనతో చర్చించారు. అంతేకాకుండా నోట్ల రద్దుతో ఏర్పడిన ఇబ్బందులు నేటికి కొనసాగుతున్నాయని మంత్రి ఉర్జిత్ పటేల్ దృష్టికి తీసుకెళ్లారు.వాటిని పరిష్కరించాలని కోరారు. అనంతరం కెటిఆర్ ఉర్జిత్ పటేల్ ను చేనేత శాలువాతో సత్కరించారు.
గతకొంత కాలంగా ఫామ్ కోల్పోయి సతమతమవుతున్న స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ కీలక నిర్ణయం తీసుకుంది. మూడేళ్ల క్రితం గోపీచంద్ అకాడమీని వీడిన ఆమె మళ్లీ పాత గూటికి చేరింది. గోపీచంద్ వద్ద మళ్లీ శిక్షణ ప్రారంభించిన ఆమె ట్విట్టర్ లో ద్వారా తెలిపింది. ఇందుకు గోపీచంద్ కూడ సమ్మతించినట్లు తెలిపింది. గోపీని వీడిన ఈ మూడేళ్లలో ఆమెకు సరైన విజయాలు రాలేవు. అందుకే ఆమె మళ్లీ పాత గురువు వద్దే కొత్త విద్యలు నేర్చుకోడానికి సిద్దమైంది. మరి గురుశిష్యులు పాత పద్దతిలో విజయాలను అందిస్తారేమో చూడాలి మరి.
తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకంపై ఇరిగేషన్ అధికారులతో మంత్రి జూపల్లి కృష్ణారావు సమీక్ష జరిపారు. పనులను వేగంగా పూర్తి చేసి రైతులకు తొందరగా సాగునీరు అంధించాలని ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. అలాగే విద్యుత్, సబ్ స్టేషన్ల ఏర్పాటు తదితర అంశాలపై ట్రాన్స్‌కో అధికారులతోనూ మంత్రి మాట్లాడారు. పాల్వంచ నుంచి రావాల్సిన పైపులకు సంబంధించి ఎమ్మెల్యే జలగం వెంకట్రావుతో మాట్లాడిన జూపల్లి, జాప్యం లేకుండా త్వరగా పంపించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు.
దసరా ఉత్సవాల ఏర్పాట్లు..ఢిల్లి లోని ఎపి భవన్ లో అమ్మవారికి పూజల నిర్వహణ అంశాలపై విజయవాడ దుర్గగుడి పాలకమండలి సమావేశమయింది. ఈవో సూర్యకుమారి అద్యక్షతన మాడపాటి సమావేశమైన పాలకమండలి 44 అంశాలకు ఆమోదం తెలిపింది.
ఎపి ఆన్ లైన్, మీ సేవా కౌంటర్లలో దసరా పూజల టిక్కెట్లు విక్రయించనున్నట్లు పాలకమండలి తెలిపింది. అందుకోసం రూపొందించిన పోస్టర్ ను చైర్మన్ గౌరంగబాబు, ఈవో సూర్యకుమారి లు ఆవిష్కరించారు.
టికెట్ల దరలు భారీగా తగ్గించాలని, అందుకు అనుగునంగా 300 రూపాయల టిక్కెట్ ను 150, 100 రూపాయల టిక్కెట్ ను 50 రూపాయలకు తగ్గించాలని నిర్ణయించారు.
అలాగే ఈ ఏడాది దసరా ఉత్సవాలకు 12 నుంచి 14 కోట్ల వరకు ఖర్చవుతుందని అంచనా వేసారు. మిగిలిన శాఖాధికారులతో చర్చించి త్వరలోనే ఉత్సవాల గురించిన పూర్తి వివరాలు ప్రకటిస్తామని పాలక మండలి సభ్యులు తెలిపారు.
మంగళగిరి: నంద్యాల ఉపఎన్నికలో ఇచ్చిన హామీ మేరకు మైనారిటి నేత ఎమ్మెల్సీ ఫరూఖ్ ను శాసనమండలి చైర్మన్ గా నియమిస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. మంగళగిరిలో సెంటర్ ఫర్ లీడర్‌షిప్ ఎక్స్‌లెన్స్ పేరిట జరుగుతున్న కార్యక్రమంలో ఆయన ఈ ప్రకటన చేశారు. మైనారిటీలను ప్రభుత్వం అండగా నిలబడుతుందని, వారు ఎప్పటికి టీడిపి వెన్నంటే వుంటారని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.
హైదరాబాద్ నగరంలో రేపు జరగనున్న వినాయక నిమజ్జన మహోత్సవానికి ప్రభుత్వం తరపున అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. ఇప్పటివరకు మొత్తం 4,101 విగ్రహాల నిమజ్జనం జరిగిందని, రేపు మరో 6,100 విగ్రహాలు నిమజ్జనానికి తరలనున్నాయని అన్నారు. అందుకోసం నగరవ్యాప్తంగా 26 చెరువుల వద్ద నిమజ్జన ఏర్పాట్లు చేసినట్లు మంత్రి తెలిపారు. అలాగే భాలాపూర్ పరిసరాల్లో 800 సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి, శోభాయాత్రన పర్యవేక్షించనున్నట్లు తలసాని తెలిపారు.
ముంబై ప్రజలపై ప్రశంసల వర్షం కురిపించారు తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్. ప్రస్తుతం ముంబై పర్యటనలో ఉన్న ఆయన ఈ నగర ప్రజలు అవిశ్రాంతంగా, అలసట లేకుండా పనిచేస్తూ దేశానికే ఆదర్శంగా నిలిచారని కితాబిచ్చారు. అయితే హైదరబాధీలు మాత్రం కొంచెం నెమ్మదస్తులని, వీరు చాలా ప్రశాంతంగా, హడావుడి పడకుండా పనులు చేస్తారని ట్వీట్ చేశారు. కానీ కొన్ని విషయాల్లో హైదరాబాద్ ప్రజలు చాలా తెలివైన వారని తెలిపారు.
సికింద్రాబాద్ :ఉమ్మడి తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ కు ఇవాళ గాంధీ ఆసుపత్రిలో శస్త్ర చికిత్స జరిగింది. గవర్నర్ కుడికాలుకు చిన్న సర్జరీ చేసినట్లు డాక్టర్లు తెలిపారు. అయితే అదేమి అంత పెద్ద ఆపరేషన్ కాదని, సాయంత్రమే ఆయన్ని డిశ్చార్జి చేయనున్నట్లు గాంధీ వైద్యులు వెల్లడించారు.
ఐపీఎల్ ప్రసార హక్కుల స్టార్ ఇండియా కైవసం చేసుకుంది. ఇవాళ జరిగిన ప్రసార హక్కుల వేలంలో రూ.16,347 కోట్లకు స్టార్ ఇండియా కైవసం చేసుకుంది. ఐదేళ్లపాటు ఐపీఎల్ ప్రసారాలను ఈ సంస్థ అందించనుంది. ఐపీఎల్ కు ఉన్న క్రేజును దృష్టిలో పెట్టుకుని ఇంత మొత్తాన్ని చెల్లించినట్లు స్టార్ ప్రతినిధులు తెలిపారు.
వినాయక నిమజ్జనానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు డిజిపి అనురాగ్ శర్మ వెల్లడించారు. నగరంలో 11,572 గణేశ్ విగ్రహాలను ఏర్పాటు చేయగా ఇప్పటి వరకూ సగం విగ్రహాలు నిమజ్జనమయ్యాయని ఆయన తెలిపారు. అలాగే రేపు ఖైరతాబాద్ వినాయక నిమజ్జనోత్సవానికి 26 వేల మంది పోలీసులతో భారీ భద్రతా ఏర్పాట్లు చేశామని తెలిపారు. నిమజ్జన భద్రతలో 11 మంది ఐజీపీలు, నలుగురు డీఐజీలు, 15 మంది ఎస్పీలు, ఏడుగురు అడిషినల్ ఎస్‌ఓలు, 333 మంది సీఐలు, 18 ప్లటూన్ల పారా మిలిటరీ బలగాలను నగరానికి రప్పించినట్లు తెలిపారు. సిసి కెమెరాలతో భద్రతను పర్యవేక్షిస్తున్నామని, శాంతి భద్రతలకు ఇబ్బంది లేకుండా నిమజ్జనం జరిగేలా ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు.
వరంగల్ రూరల్ జిల్లాలోని సంగెo మండలంలోని ఎల్గురు లో చేప పిల్లల పెంపకం కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన ఎల్గురు చెరువులో 3 లక్షల చేప పిల్లలను వదిలారు. ఈ కార్యక్రమంతో వరంగల్ ఎంపి పసునూరి దయాకర్, పరకాల శాసనసభ్యులు చల్లా ధర్మారెడ్డి. స్థానిక నేతలు, అధికారులు పాల్గొన్నారు.
హిందూపురం నియోజకవర్గంలో సినీనటుడు, స్థానిక ఎమ్మెల్యే బాలకృష్ణ పర్యటించారు. ఎన్నో ఏళ్లుగా స్థానిక ప్రజలు కోరుతూ వస్తున్న కూరగాయల మార్కెట్ కు భూమిపూజ చేశారు. అనంతరం ఈయన ఆర్ఓటీ కార్యాలయ భవనాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు ఎంపీ నిమ్మల కిష్టప్ప పాల్గొన్నారు. ఈ సందర్బంగా బాలకృష్ణ మాట్లాడుతు...హిందూపురాన్ని రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాలకు ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమాలకు తమ అభిమాన హీరో రావడంతో అభిమానులు భారీగా తరలివచ్చారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా రేపు కూడా బాలకృష్ణ హిందూపురంలో పర్యటించనున్నారు.
వంగవీటి రంగా పై గౌతం రెడ్డి చేసిన విమర్శలపై మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధా స్పందించారు. తన తండ్రి వంగవీటి రంగా పై ఎవరైనా అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదని ఘాటుగా హెచ్చరించారు. మహానేత రంగాను విమర్శించినందుకు గౌతం రెడ్డిని వైసీపి పార్టీ సస్పెండ్ చేయడం మంచి పరిణామమని, అలాంటి వారు పార్టీలో ఉండడానికి అనర్హులని రాధా తెలిపారు.
యూపీలో చిన్నారుల మరణాలు ఆగడం లేదు. ఇటీవల గోరఖ్ పూర్ సంఘటనను మరువక ముందే మరో ఆస్పత్రితో చిన్నారుల మరణాలు ఆందోళన కల్గిస్తున్నాయి. ఫరూఖాబాద్ లోని రామ్ మనోహర్ లోహియా రాజ్ కియా హాస్పిటల్లో గత నెల రోజులుగా వైద్యం అందక 49 మంది చిన్నపిల్లలు మృత్యవాత పడ్డారు. అయితే ఈ మరణాలకు కూడా ఆక్సిజన్ అందకపోవడమే కారణమన్న అనుమానాలను అధికారులు వ్యక్తపరుస్తున్నారు. ఏదేమైనా ప్రభుత్వం వెంటనే ఈ చిన్నారుల మరణాలను ఆపేలా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుకుంటున్నారు.
మెదక్ జిల్లా నర్సాపూర్ లో 100 పడకల సామర్ధ్యంతో ఏర్పాటు చేసిన ఏరియా హాస్పిటల్ ని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరిశ్ రావు, డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్సీ, ఎమ్మల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సంధర్బంగా ఆస్పత్రిలోని వివిధ విభాగాలను పరిశీలించిన వారు సంతృప్తి వ్యక్తం చేశారు. పేద రోగులకు నాణ్యమైన చికిత్ప అందించాలని అక్కడి సిబ్బందికి సూచించారు.
ఏపీ రాజదాని అమరావతిలో సీఎం నీరు ప్రగతి పథకం పై వివిధ శాఖల అధికారులతో టెలీ కాన్పరెన్స్ నిర్వహిస్తున్నారు. ఈ సందర్బంగా ఆయన "జలసిరికి హారతి'' అనే కార్యక్రమాన్ని చేపట్టాలని అధికారలకు సూచించారు. ఈ కార్యక్రమంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా వున్న జలాశయాలకు ఈ నెల 6,7,8 తేదీల్లో హారతినిచ్చి పూజించాలని సూచించారు. అలాగే అక్టోబర్ రెండున పేదల గృహప్రవేశ కార్యక్రమానికి ఘనంగా ఏర్పాట్లు చేయాలని అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశించారు.
హైదరాబాద్ పర్యటనలో ఉన్న ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఇవాళ ఖైరతాబాద్ వినాయకుడిని దర్శించుకున్నారు. ఖైరతాబాద్ గణేష్ కమిటీ సభ్యులు, స్థానిక నాయకులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్బంగా వెంకయ్య వినాయకుడికి ప్రత్యేక పూజలు చేశాడు. తర్వాత ఆయన మాట్లాడుతూ... విఘ్నాలను తొలగించే ఈ మహా వినాయకుడిని దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు. ఉపరాష్ట్రపతి వెంకయ్యతో పాటు మాజీ కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ, ఉపముఖ్యమంత్రి మహమూద్ అలీ, బీజేపి ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి లు కూడా మహాగణపతిని దర్శించుకున్నవారిలో ఉన్నారు.
హైదరాబాద్ : ఐటీ మంత్రి కె.తారక రామారావుకు స్కోచ్ సంస్థ ‘ఐటీ మినిస్టర్ ఆఫ్ ది ఇయర్’ అవార్డును ప్రకటించింది. సృజనాత్మక విధానాలతో రాష్ట్రానికి అవసరమైన ఐటీ రోడ్‌మ్యాప్‌ను రూపొందిస్తున్నందుకు ఈ పురస్కారానికి ఎంపిక చేసినట్లు తెలిపింది. ఈ నెల 9న ఢిల్లీలో జరిగే 49వ స్కోచ్ సమ్మిట్‌లో అవార్డును అందజేయనున్నట్టు పేర్కొంది. కేటీఆర్ తెలంగాణనలో ఐటీ రంగాన్ని ఓ క్రమపధ్దతిలో నిర్మిస్తున్నారని స్కోచ్ గ్రూప్ చైర్మన్ సమీర్ కొచ్చర్ కొనియాడారు.