మతం మార్చుకున్నా ప్రేమ‌లో లోటుండ‌దు - క‌మ‌ల్ హాస‌న్‌

Published : Jul 28, 2017, 05:16 PM ISTUpdated : Mar 25, 2018, 11:51 PM IST
మతం మార్చుకున్నా ప్రేమ‌లో లోటుండ‌దు - క‌మ‌ల్ హాస‌న్‌

సారాంశం

మతం మార్చుకున్న కమల్ హాసన్ కుతురు ఏ మతం లో ఉన్నా ప్రేమతో ఉండమని కమల్ హాసన్ సూచన.

 


క‌మ‌ల్ హాస‌న్ కూతురు అక్ష‌ర హాస‌న్ రెండు రోజుల క్రితం బౌద్ద మ‌తాన్ని స్వీక‌రించారు. ఈ విష‌యం మీడియాలో నిజ‌మా.. అబ‌ద్ద‌మా అనే విష‌యం పై క‌థనాలు వ‌స్తున్నాయి. అయితే క‌మ‌ల్ హాస‌న్ కి కూడా అదే సందేహాం క‌ల్గి కుమార్తేను ట్విట్ట‌ర్ లో అడిగాడు.

క‌మ‌ల్ త‌న ట్విట్ట‌ర్ అకౌంట్ లో 'అమ్మా అక్షూ, మతం మార్చుకున్నావా ....నువ్వు మారిన నిన్ను ప్రేమిస్తున్నాను. ఏ మతంలో ఉన్నా లవ్ షరతులు లేనిది. జీవితం ఆనందించు.. . ప్రేమతో - మీ బాపు' అంటూ కమల్‌ హాసన్  ప్రశ్నించాడు.  


 దీనికి అక్షర కూడా సమాధానం ఇచ్చింది. 'హాయ్ నాన్న. మానవ జీవన మార్గం, గమ్యాన్ని బోధించే బౌద్ధ మతాన్ని నేను అంగీకరిస్తున్నా. అయినా ఇప్పటికీ నేను నాస్తికురాలినే' అంటూ తండ్రి ట్వీట్ కు ఆమె రీట్వీట్ చేసింది.

ఇప్పుడు తండ్రీకూతుళ్ల మ‌ధ్య జ‌రిగిన ట్విట్ సంభాష‌ణ వైర‌ల్ అయింది.  
 

PREV
click me!

Recommended Stories

పెద్దపులి, ఎలుగుబంటి ప్రెండ్లీ ఫైటింగ్ (వీడియో)
సినీ నటి, ఎమ్మెల్యే రోజా బ్యాటింగ్ (వీడియో)