తెలంగాణ బీజేపికి భారీ షాక్

First Published Feb 4, 2018, 3:56 PM IST
Highlights
  • తెలంగాణ బిజెపికి మరో షాక్ 
  • పార్టీని వీడనున్నట్లు ప్రకటించిన సంజయ్
  • కరీంనగర్ లో బిజేపిలో ఇమడలేకపోతున్నానని ప్రకటన

తెలంగాణలో భారతీయ జనతా పార్టీకి వరుస షాక్ లు తగులుతున్నాయి. ఆ పార్టీ రాష్ట్ర నాయకత్వం తీరు వల్ల పార్టీలో కొందరు నేతలు ఇమడలేకపోతున్నారు. ఇటీవల కాలంలో బిజెపిలో ఫ్యూచర్ లేదన్న ఉద్దేశంతో నేతలు బయటి పార్టీల్లో చేరేందుకు క్యూ కడుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా ఎదగడానికి ప్రత్నిస్తున్నామంటూ ఈ పార్టీ సీనియర్ నాయకులు చెబుతున్న వేళ  కీలక నేతలంతా  పార్టీని వీడుతున్నారు. ఇప్పటికే బిజెపి కీలక నేత నాగం జనార్ధన్ రెడ్డి పార్టీని వీడటానికి సిద్దంగా ఉన్నడని ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. ఇక ఇటీవల కాలంలో వరంగల్ బిజెపి మహిళా మోర్చా నాయకురాలు రవలి కూచన, కొమ్మూరి ప్రతాపరెడ్డి బిజెపికి గుడ్ బై చెప్పిన విషయం తెలిసిందే. తాజాగా కరీంనగర్ జిల్లాకు చెందిన బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి బండి సంజయ్ కూడా రాజీనామాకు సిద్దమై పార్టీకి భారీ షాక్ ఇచ్చాడు. 

బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియా తో మాట్లాడిన సంజయ్ ఇక  బీజేపీ లో తాను ఇమడలేక పోతున్నాని స్పష్టం చేశారు. తాను ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లోనూ పోటీకి దూరంగా ఉంటానని ప్రకటించారు. కానీ హిందూ ధర్మం కోసం బయట ఉండి పనిచేస్తాన్నారు.

బీజేపీ సిద్ధాంతాలు చాలా గొప్పవి, కానీ నాయకుల తీరే బాగాలేదని అన్నారు. కరీంనగర్ జిల్లా బీజేపీ రాజకీయాలు మరీ దారుణంగా తయారయ్యాయని అన్నారు. ఈ విషయం గురించే మాట్లాడటానికి కార్యకర్తలతో కలిసి హైదరాబాద్ కి వచ్చి పార్టీ అద్యక్షుడు లక్ష్మణ్ ను కలిసినట్లు తెలిపారు.   అయితే ఇక్కడ తమకు అవమానం జరిగిందని, పార్టీ లో న్యాయం జరగడం లేదనే పార్టీ నుండి బయటకు వెళుతున్నట్లు సంజయ్ తెలిపారు.


 

click me!