జర్నలిస్టు క్రాంతి పై బాబుమోహన్ ఫైర్

First Published Nov 14, 2017, 2:09 PM IST
Highlights
  • జర్నలిస్ట్ క్రాంతి కిరణ్ పై బాబు మోహన్ ఆగ్రహం
  • తనను నాన్ లోకల్ అనడంపై స్పందించిన ఎమ్మెల్యే

తెలంగాణ జర్నలిస్ట్ , జర్నలిస్ట్ యూనియన్ నేత క్రాంతి కిరణ్ పై మాజీ మంత్రి, ఆందోల్ ఎమ్మెల్యే బాబుమోహన్ ఫైర్ అయ్యిండు. అసెంబ్లీ లాబీల్లో బాబు మోహన్ మీడియాతో ముచ్చటించారు. అందోల్ నియోజకవర్గంలో స్థానికేతరులే రాజ్యమేలుతున్నారంటూ క్రాంతి కిరణ్ నిన్న చేసిన వ్యాఖ్యలపై బాబు మోహన్ సీరియస్ అయ్యిండు. ఇంకా అనేక అంశాలపై బాబుమోహన్ మీడియాతో ముచ్చడించారు. ఆయన మాటలు యదావిదిగా
 ఆందోల్ నియోజకవర్గం లో 24 ఏళ్ల నుంచి పని చేస్తున్నా, 3‌ సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యా అయినా నేను నాన్ లోకలేనా.
అందోల్ నియోజకవర్గం మొత్తం నా కంట్రోల్ లో ఉంది.కొద్ది మంది నన్ను నాన్ లోకల్ అని అనడం సరి కాదు.అమెరికాలో ‌నాలుగేళ్లు ఉంటేనే గ్రీన్ కార్డు ఇస్తారు. అలాంటింది 24 ఏళ్లయినా నాకు అందోల్ లొకాలిటి రాదా?
  ఆందోల్ లో  నన్ను నాన్ లోకల్ అని విమర్శించే వ్యక్తి పార్టీలో ఎప్పుడు ‌చేరారో తెలుసా మీకు... అతనికి సభ్యత్వం ఇవ్వాల్సింది నేనే కదా..
 నన్ను లోకల్ అనా విమర్శించే వ్యక్తి కి  అతడి ఇంట్లోవారే ‌ఓట్లు వేయరు. వాళ్ల నాన్నకు వారి స్వగ్రామంలో‌ నేనే రిస్క్ తీసుకుని పోస్టింగ్ ఇప్పించా..
గత ఎన్నికల్లో సోనియా ప్రచారం చేసిన ఊరిలోనే 80,శాతం ఓట్లు సాధించి గెలిచా. 
నా నియోజకవర్గం మొత్తం సింగూరు జలాలు అందిస్తున్నా.ఈ జలాలతో 40  వేల ఎకరాలకు నీరు ఇస్తున్నా..మరో ఎనిమిది మండలాల్లో పది వేల ఎకరాలకు నీరు ఇచ్చే పనులు జరుగుతున్నాయి.
ఈ విధంగా అందోల్ ఎమ్మెల్యే బాబుమోహన్ పరోక్షంగా క్రాంతి కిరణ్ పై  ఘాటుగా స్పందించారు.
 

click me!