సోనియమ్మ గుజరాత్ కష్టాలు

Published : Jul 29, 2017, 03:21 PM ISTUpdated : Mar 25, 2018, 11:51 PM IST
సోనియమ్మ గుజరాత్ కష్టాలు

సారాంశం

కాంగ్రెస్ పార్టీలో ప్రస్తుతం సంక్షోభం నెలకొంది. 40మంది ఎమ్మేల్యేలను బెంగళూరులోని రిసార్ట్స్ కి తరలించారు

గుజరాత్ రాష్ట్రంలో కాంగ్రెస్ కష్టాలు పడుతోంది. కాంగ్రెస్ పార్టీలో ప్రస్తుతం సంక్షోభం నెలకొంది. తన పార్టీకి చెందని దాదాపు 40మంది ఎమ్మేల్యేలను బెంగళూరులోని రిసార్ట్స్ కి తరలించారు.ఆగస్టు 8వ తేదీన గుజరాత్ లో రాజ్యసభ ఎన్నికలు జరగనున్నాయి. కాంగ్రెస్ తరపు నుంచి సోనియా గాంధీ రాజకీయ సలహాదారు అహ్మద్‌పటేల్‌ పోటీ చేస్తుండగా.. భాజపా నుంచి ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు పోటీ చేస్తున్నారు. 

ఇటీవల ఆరుగురు ఎమ్మేల్యేలు కాంగ్రెస్ పార్టీని వీడిన సంగతి  విదితమే.  వీరిలో ముగ్గురు ఎమ్మెల్యేలు ఇప్పటికే భాజపాలో చేరారు. మరో ముగ్గురు కూడా చేరే అవకాశం కనిపిస్తోంది. మరి కొందరు కనుక పార్టీని విడినా.. లేదా భాజపాలో చేరినా రాజ్య సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమి తథ్యం.  దీంతో కాంగ్రెస్ పార్టీ మిగిలిన ఎమ్మేల్యేలను అయినా కాపాడుకోవాలనే ప్రయత్నం చేస్తోంది. ఈ నేపథ్యంతో తన పార్టీకి చెందిన 40మంది ఎమ్మెల్యేలను బెంగళూరులోని రిసార్ట్స్ కి తరలించారు. ఆగస్టు 7వ తేదీ రాత్రి వరకు వారిని అక్కడే ఉంచేందుకు కాంగ్రెస్ వ్యూహం చేసింది.

ఈ ఎన్నిక సోనియా గాంధీ ప్రతిష్టకు సంబంధించిన వ్యవహారం. ఎందుకంటే, ఆమెకు అత్యంత ముఖ్యుడయిన నాయకుడు పోటీలో ఉన్నాడు. అహ్మద్ పటేల్ ఓడిపోతే, సోనియాకు వ్యతిరేకంగా, పార్టీకి వ్యతిరేకంగా రకరకాల వ్యాఖ్యానాలు వినాల్సి వస్తుంది. ఈ ఉపద్రవం నుంచి బయటపడాలంటే, ఉన్న ఎమ్మెల్యేలను కాపాడుకోవాలి. అందుకే ,  కాంగ్రెస్ పార్టీ కర్నాటక కమిటీ సహాయం కోరింది. ఈ ఎమ్మెల మీద ఈగ వాలకుండా చూసి, చెక్కుచెదరకుండా మళ్లీవారిని గుజరాత్ పంపే బాధ్యతను అధికారంలో ఉన్న కర్నాటక కాంగ్రెస్ తీసుకుంది

PREV
click me!

Recommended Stories

పెద్దపులి, ఎలుగుబంటి ప్రెండ్లీ ఫైటింగ్ (వీడియో)
సినీ నటి, ఎమ్మెల్యే రోజా బ్యాటింగ్ (వీడియో)