కొంతమంది బరువు పెరుగుతున్నామని, మరికొంతమంది ఆలస్యం కావడం వంటి వివిధ కారణాల వల్ల రాత్రిపూట తినకుండానే పడుకుంటుంటారు. కానీ ఇలా నిద్రపోవడం వల్ల ఏం జరుగుతుందో తెలుసా?
బరువు తగ్గడానికని చాలా మంది తమ లైఫ్ స్టైల్ లో ఎన్నో మార్పులు చేసుకుంటారు. అది కూడా ఎవరి సలహా తీసుకోకుండా. కానీ ఇది ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. ముఖ్యంగా బరువు తగ్గాలని కొంతమంది రాత్రిపూట భోజనం చేయడమే మానేస్తుంటారు. కానీ ఇది ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అసలు రాత్రిపూట తినకుండా అలాగే నిద్రపోతే ఏం జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
నిద్రలేమి సమస్యలు
రాత్రిపూట మీరు ఏమీ తినకుండా నిద్రపోతే మీ మెదడు మిమ్మల్ని ఫుడ్ తినమని ఒత్తిడి చేయడం ప్రారంభిస్తుంది, దీని వల్ల మీకు పదేపదే ఆకలిగా అనిపిస్తుంది. దీనివల్ల మీరు ప్రశాంతంగా నిద్రపోలేరు.
మందకొడిగా మెటబాలిజం
బరువు తగ్గడానికని లేదా ఇతర కారణాల వల్ల మీరు ప్రతిరోజూ రాత్రిపూట తినడం మానేస్తే దీనివల్ల మీ జీవక్రియ నెమ్మదిస్తుంది. ఇది మీ ఇన్సులిన్ స్థాయిలను కూడా ప్రభావితం చేస్తుంది.
హార్మోన్ల సమతుల్యత
హార్మోన్లు సక్రమంగా ఉంటేనే మనం ఆరోగ్యంగా ఉండగలుగుతాం. కానీ మీరు రాత్రిపూట భోజనం చేయకుండా నిద్రపోతే మీ హార్మోన్లు ప్రభావితం అవుతాయి. ఇది మీకు ఎన్నో అనారోగ్య సమస్యలను కలిగిస్తుంది.
కండరాల బలహీనత
ప్రతిరోజు రాత్రిపూట మీరు తినకుండా నిద్రపోతే మీకు కండరాల బలహీనత సమస్యలు వచ్చే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఏమీ తినకుండా నిద్రపోవడం వల్ల ప్రోటీన్లు, అమైనో ఆమ్లాల సామర్థ్యం కూడా ప్రభావితం అవుతుంది.
తక్కువ ఎనర్జీ
ఏమీ తినకుండా నిద్రపోవడం వల్ల మీ శరీరంలో పోషకాల లోపం ఏర్పడుతుంది. దీని వల్ల ఎనర్జీ లెవెల్స్ తగ్గి, నీరసం అనే ఫీలింగ్ వస్తుంది. దీనివల్ల మీకు ఏ పనిచేయడానికి కూడా ఇంట్రెస్ట్ ఉండదు. అలాగే రాత్రిపూట ఖాళీ కడుపుతో నిద్రపోవడం వల్ల మూడ్ స్వింగ్స్ కూడా వస్తాయి. ఇది మీకు చిరాకు కలిగిస్తుంది.
బరువు పెరగడం
రాత్రిపూట తినకుండా పడుకుంటే బరువు తగ్గుతామని చాలా మంది భ్రమ పడుతుంటారు. కానీ ఇలా నిద్రపోవడం వల్ల మీరు మరింత బరువు పెరుగుతారు. ఈ అలవాటు మీ జీవక్రియ రేటును నెమ్మదిస్తుంది. అలాగే మీరు బరువు పెరగడానికి దారితీస్తుంది. బరువు తగ్గాలంటే మీరు రాత్రిపూట తేలికపాటి ఆహారాన్ని తినాలి.