సోంపు వాటర్ తాగితే ఏమౌతుందో తెలుసా?

By Shivaleela Rajamoni  |  First Published Jun 29, 2024, 10:42 AM IST

సోంపును తిన్నది అరగడానికే ఉపయోగపడుతుందని చాలా మంది అనుకుంటారు. కానీ సోంపు కేవలం జీర్ణానికే కాదు మరెన్నింటికో ఉపయోగపడుతుంది. ముఖ్యంగా సోంపు వాటర్ ను తాగితే మీరు ఎన్నో అనారోగ్య సమస్యలకు దూరంగా ఉంటారు.


సోంపు ఎంతో ఆరోగ్యకరమైంది. దీనిలో సోడియం, కాల్షియం, ఇనుము, పొటాషియం వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. సోంపును తినడంతో పాటుగా నీళ్లలో నానబెట్టి తాగితే కూడా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. సోంపు వాటర్ లో యాంటీ ఇన్ఫ్లమేటరీ,యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు ఉంటాయి. అసలు సోంపు వాటర్ ను తాగితే మన ఆరోగ్యానికి ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 

బరువు తగ్గుతారు 

Latest Videos

undefined

అవును సోంపు వాటర్ ను తాగితే మీరు ఆరోగ్యంగా బరువు కూడా తగ్గుతారు. సోంపులో ఉండే మూలకాలు మన జీవక్రియను పెంచుతాయి. దీంతో మీరు ఆరోగ్యంగా బరువు తగ్గుతారు. సోంపు వాటర్ ను రెగ్యులర్ గా తాగితే పొట్ట కూడా తగ్గుతుంది. 

మెరుగైన జీర్ణక్రియ

జీర్ణక్రియను మెరుగుపర్చడానికి సోంపు వాటర్ బాగా సహాయపడుతుంది. ఈ వాటర్ ను రోజూ తాగితే ఎసిడిటీ, గ్యాస్, మలబద్దకం వంటి జీర్ణ సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది. ఎసిడిటీతో బాధపడేవారు దీన్ని తాగితే మంచి ఉపశమనం కలుగుతుంది. 

ఆరోగ్యకరమైన కళ్లు

సోంపు వాటర్ మన కళ్లను ఆరోగ్యంగా ఉంచడానికి కూడా సహాయపడుతుంది. దీనిలో విటమిన్ ఎ పుష్కలంగా ఉంటుంది. ఇది కంటికి మంచి ప్రయోజనకరంగా ఉంటుంది. మీరో రోజూ సోంపు వాటర్ ను తాగితే కళ్లు ఆరోగ్యంగా ఉంటాయి. అలాగే కంటిచూపు కూడా మెరుగుపడుతుంది. 

రక్తపోటు నియంత్రిన 

హైబీపీ గుండెపోటు, స్ట్రోక్ వంటి ప్రాణాంతక రోగాలకు దారితీస్తుంది. అయితే సోంపు వాటర్ ఈ అధిక రక్తపోటును నియంత్రించడానికి బాగా సహాయపడుతుంది. సోంపులో పొటాషియం మెండుగా ఉంటుంది. ఇది రక్తపోటును నియంత్రించడానికి బాగా సహాయపడుతుంది. 

నోటి దుర్వాసన

చాలా మందికి నోట్లో నుంచి దుర్వాసన వస్తుంటుంది. కానీ ఇది నలుగురిలో ఇబ్బంది పడేలా చేస్తుంది. ఈ నోటి దుర్వాసనను పోగొట్టడానికి ఏం చేయాలో చాలా మందికి తెలియదు. అయితే మీరు రోజూ ఉదయాన్నే సోంపు వాటర్ ను తాగితే ఈ సమస్య నుంచి బయటపడతారు. సోంపు నోట్లో నుంచి చెడు వాసన రాకుండా చేస్తుంది. 

రోగనిరోధక శక్తి

మన ఇమ్యూనిటీ పవర్ ఎంత ఎక్కువగా ఉంటే.. మనం అంత ఆరోగ్యంగా ఉంటాం. సోంపు వాటర్ లో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది మన రోగనిరోధక శక్తిని పెంచడానికి బాగా సహాయపడుతుంది. ఇది మనల్ని ఎన్నో సీజనల్ ఇన్ఫెక్షన్ల నుంచి రక్షిస్తుంది. 

క్యాన్సర్ రిస్క్

టెస్టింగ్ అండ్ యానిమల్ స్టడీస్ 2011 నివేదిక ప్రకారం.. సోంపు లో క్యాన్సర్ నిరోధక లక్షణాలు ఉంటాయి. రోజూ సోంపు వాటర్ ను తాగితే మన శరీరంలో క్యాన్సర్ తో పోరాడే లక్షణాలు పెరుగుతాయి. అంటే ఈ వాటర్ మనల్ని క్యాన్సర్ రిస్క్ నుంచి కాపాడుతుందన్న మాట.
 

click me!