బరువు తగ్గడం కోసం డైటింగ్.. పాలు తాగొచ్చా..?

By telugu news teamFirst Published Dec 26, 2020, 11:39 AM IST
Highlights

డైటింగ్ చేసే సమయంలో పాలు విషయానికి వస్తే, మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి.  డైటింగ్ సమయంలో టీ, కాఫీ తాగడం లాంటివి చేయవచ్చు. ఎందుకంటే.. దాంట్లో ఎక్కువ పాలు వాడం.

ఈ మధ్యకాలంలో చాలా మంది డైటింగ్ ఫాలో అవుతున్నారు. కొందరు బరువు తగ్గడానికి డైటింగ్ ఫాలో అవుతుంటే.. కొందరు మాత్రం ప్రోటీన్ డైట్ ఫాలో అవుతున్నారు. కాగా.. కొందరు పూర్తిగా ఉపవాసం ఉంటారు.. మరికొందరు మధ్య మధ్యలో కొద్దిగా ప్రోటీన్స్ ఉండేలా ఆహారం తీసుకుంటారు. అయితే.. చాలా మందికి  ఈ డైటింగ్, ఉపవాసం సమయంలో పాలు తాగవచ్చా కదా అనే డౌట్స్ ఉంటాయి. మరి దీనిపై నిపుణులు ఏమంటున్నారో ఇప్పుడు చూద్దాం..


 డైటింగ్ చేసే సమయంలో పాలు విషయానికి వస్తే, మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి.  డైటింగ్ సమయంలో టీ, కాఫీ తాగడం లాంటివి చేయవచ్చు. ఎందుకంటే.. దాంట్లో ఎక్కువ పాలు వాడం. చాలా తక్కువగా ఉంటాయి కాబట్టి పెద్దగా ప్రాబ్లం ఉండదు. ఎక్కువగా పాలు తాగకపోవడమే మంచిదని నిపుణులు చెబుతున్నారు. 

అలా కాకుండా మీరు పాలు లేదా పాల ఉత్పత్తులు ఎక్కువగా తీసుకోకూడదు. అలా తీసుకోవడం వల్ల మీ డైటింగ్ మొత్తం పూర్తిగా దెబ్బతినే అవకాశం ఉంటుంది. పాలల్లో కేలరీలు, సహజ చక్కెర మరియు పిండి పదార్థాలు ఉంటాయి. ఒక కప్పు పాలలో 12 గ్రాముల పిండి పదార్థాలు ఉంటాయి. ఇది ఇన్సులిన్ విడుదలను సులభంగా ప్రేరేపిస్తుంది. తద్వారా మీ డైటింగ్ ప్రాసెస్ మొత్తం దెబ్బ తింటుంది. 

ఉపవాసం చేసే సమయంలో, డైటింగ్ లో ఉన్నప్పుడు కార్బో హైడ్రేట్స్ తక్కువగా ఉండే ఆహారం తీసుకోవాలి. వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉన్న ఫుడ్స్ తీసుకోవాలి. ఎందుకంటే.. నీటిలో కేలరీలు సున్నా. కాబట్టి.. శరీరంలోకి కొవ్వు పెరుగుతుందనే భయం ఉండదు.

click me!