
బ్రిటన్ సమస్థ ఆధ్వర్యంలో జరిగిన పరిశోధనలలో భాగంగా ఎవరిలో అయితే యుక్తవయసులో కండలేకుండా బొజ్జ మాత్రమే పెరిగి ఉంటుందో అలాంటివారు వయసు పైపడే కొద్ది వారిలో ఆలోచన సామర్థ్యం సరైన సమయంలో తీసుకోవాల్సిన నిర్ణయాల పట్ల పూర్తిగా అవగాహన ఉండదని తెలియజేశారు. ఈ విధంగా ఆలోచన సామర్థ్యం తగ్గటానికి కొవ్వు కండరాల మోతాదు కీలక పాత్ర పోషిస్తుందని నిపుణులు వెల్లడించారు.
ఎక్కువ శరీర బరువు ఎత్తు నిష్పత్తి ఎక్కువగా ఉన్నవారి శరీరంలో తెల్ల రక్త కణాలు చాలా చురుగ్గా ఉండటం వల్ల వీటి ప్రభావం రోగనిరోధక శక్తి పై కూడా పడుతుంది. ఇవి మెదడులోని రోగనిరోధక శక్తినీ ప్రేరేపించి విషయ గ్రహణ శక్తి సామర్థ్యంతో ముడిపడిన సమస్యలకు దారితీస్తుంటాయి. కనుక ముందు నుంచి మనం సమతుల ఆహారాన్ని తీసుకోవడం వల్ల భవిష్యత్తులో ఇలాంటి సమస్యలను ఎదుర్కోవడానికి ఆస్కారం ఉండదు.
యుక్తవయసులో ఉన్న సమయంలో సమతుల ఆహారాన్ని తీసుకుంటూ తరచూ శారీరక వ్యాయామాలు చేస్తూ ఉండాలి వేగంగా నడవడం ఈత కొట్టడం సైకిల్ తొక్కడం వంటి శారీరక వ్యాయామాల ద్వారా ఎంతో ఆరోగ్యంగా ఉండటమే కాకుండా బొజ్జ పెరిగే అవకాశాలు ఉండవు.ఇలా ఎప్పుడైతే బొజ్జ పెరగకుండా ఉంటుందో ఆ సమయంలో శారీరక పట్టుత్వానికి మాత్రమే కాకుండా మానసికంగా దృఢంగా ఉండడానికి కూడా దోహదపడుతుంది.