
ఈ రోజుల్లో అనారోగ్య సమస్యలతో బాధపడేవారు చాలా మందే ఉన్నారు. ఇక ప్రతి చిన్న సమస్యకూ డాక్టర్‌ని ఆశ్రయించడం కూడా చాలా కామన్ అయపోయింది. అయితే మీ ఇంట్లో ఉండే కొన్ని పదార్థాలు మీ సమస్యలను దూరం చేస్తాయి తెలుసా..
బీపీ, మధుమేహం, కొలెస్ట్రాల్, గుండె రక్తనాళాల సమస్యలు చిన్నవయసులోనే కనిపిస్తాయి. అంటే ఒక్కసారి మాత్రలు తినడం మొదలుపెడితే జీవితాంతం మాత్ర వేసుకోవాల్సి వస్తుంది. కానీ మీకు తెలియని విషయమేమిటంటే, మీ ఇంట్లో సులభంగా లభించే మసాలా దినుసులు ,మూలికలతో కొలెస్ట్రాల్‌ను అదుపులో ఉంచుకోవచ్చు.
చెడు కొలెస్ట్రాల్ రక్తంతో కలిస్తే, అది గుండె జబ్బుల సమస్యలు రావడానికి కారణమౌతుంది. ఆయుర్వేదంలో కొలెస్ట్రాల్, BP,కొవ్వు వంటి సమస్యలను తగ్గించే హెర్బల్స్ ఉన్నాయట. అవి మన ఇంట్లోనే లభిస్తున్నాయి.
జామకాయ లేదా ఉసిరికాయ వినియోగం
ప్రతి రోజు జామకాయ శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ను నివారిస్తుంది. ఇది ఆరోగ్యాన్ని కూడా పెంచుతుంది. లేదంటూ ఉసిరిని కూడా ఆహారంలో భాగం చేసుకోవచ్చు.
వెల్లుల్లి
ఇంట్లో ప్రతి రోజు వంట కోసం దీనిని ఉపయోగిస్తారు. ఇందులో కొలెస్ట్రాల్ రెగ్యులేటింగ్ ఫ్యాక్టర్ ఉందని చాలా మంది కి తెలియదు.ప్రతిరోజూ ఉదయం ఖాళీ కడుపుతో వెల్లుల్లి ముక్క తినడం వల్ల అధిక కొలెస్ట్రాల్ , అధిక రక్తపోటు అదుపులో ఉంటుంది.
నిమ్మకాయ..
నిమ్మరసం కూడా శరీరంలో కొవ్వును కరిగిస్తుంది. ఉదయాన్నే ఖాళీ కడుపుతో లేదంటే భోజనానికి ఒక గంట ముందు గోరువెచ్చని నీటిలో నిమ్మరసం, కొద్దిగా వెనిగర్ వేసుకొని తాగాలి. ఇలా చేయడం వల్ల శరీరంలో కొలిస్ట్రాల్ నియంత్రణలో ఉంటుంది. పొట్ట కూడా శుభ్రంగా ఉంటుంది.
అల్లం
ప్రతిరోజూ అల్లం రసం ఏదో ఒక రూపంలో తీసుకోవాలి. ఇలా తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్‌ను అదుపులో ఉంచడంలో సహాయపడుతుంది. అల్లం రసంలో తేనె, కొద్దిగా గోరు వెచ్చని నీరు కలిపి తీసుకోవచ్చు. అల్లం తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
త్రిఫల
త్రిఫల చూర్ణం గురించి అవగాహన ఉండే ఉంటుంది. దీనిని మాత్ర రూపంలో లేదంటే.. దీనిని పొడి చేసి దాంట్లో తేనే కలిపి కూడా తీసుకోవచ్చు.
యస్తిమాడు
యస్తిమడు మూలేటి అని కూడా అంటారు . దీనిని టీగా కూడా తిని దాని జీవితానికి జోడించవచ్చు. కొలెస్ట్రాల్ కూడా అదుపులో ఉంటుంది.
ఈ పదార్థాలు చాలా వరకు ఇంట్లో లేదా చుట్టుపక్కల ప్రాంతాల్లో సులభంగా అందుబాటులో ఉంటాయి. ఇందులోని ప్రత్యేక గుణాలను గ్రహించి సరిగ్గా తినడం వల్ల ఇంట్లోనే ఆరోగ్యం మెరుగుపడుతుంది.