డైటింగ్ అవసరం లేదు.. ఈ సినిమాలు చూసినా బరువు తగ్గొచ్చు..!

Published : Feb 19, 2022, 02:02 PM IST
డైటింగ్ అవసరం లేదు.. ఈ సినిమాలు చూసినా బరువు తగ్గొచ్చు..!

సారాంశం

ఒక అధ్యయన నివేదిక ప్రకారం, దెయ్యాల చిత్రాలను , మనస్సును కదిలించే చిత్రాలను  అంటే ఎమోషనల్ సినిమాలు చూడటం  ద్వారా ప్రజలు బరువు తగ్గవచ్చు.

బరువు తగ్గడానికి మనలో చాలా మంది చాలా ప్రయత్నాలు చేసి ఉంటారు. బరువు తగ్గడానికి మన దగ్గర ఆప్షన్స్ కూడా   చాలా ఎక్కువగానే ఉన్నాయని చెప్పొచ్చు. కొందరు యోగా చేస్తారు. కొందరు వ్యాయామాలు చేస్తారు.. మరికొందరు జిమ్ కి వెళతారు.. ఇలా రకరకాలుగా ప్రయత్నిస్తారు. లేదంటే.. డైటింగ్ చేస్తారు. అయితే.. ఇవేమి చేయకుండా కేవలం సినిమా చూడటం వల్ల బరువు తగ్గవచ్చని మీకు తెలుసా..? నమ్మసక్యంగా లేకపోయినా ఇది నిజం.  దెయ్యాలు లేదంటే.. ఏదైనా హర్రర్ మూవీస్ చూడటం వల్ల మనం సులువుగా బరువు తగ్గొచ్చట. మరి అదెలాగో ఓసారి చూసేద్దామా..?

హర్రర్ సినిమాలు బరువు తగ్గడానికి సహాయపడుతున్నాయా? 
నిజానికి, యునైటెడ్ కింగ్‌డమ్‌లోని వెస్ట్‌మినిస్టర్ విశ్వవిద్యాలయం దీనిని అధ్యయనం చేసింది. ఒక అధ్యయన నివేదిక ప్రకారం, దెయ్యాల చిత్రాలను , మనస్సును కదిలించే చిత్రాలను  అంటే ఎమోషనల్ సినిమాలు చూడటం  ద్వారా ప్రజలు బరువు తగ్గవచ్చు.

భయానక చిత్రాలు చూస్తే బరువు తగ్గడం ఎలా : మనం భయానక చిత్రాలను చూసినప్పుడు సాధారణంగా మన మనస్సు , శరీరంలో అనేక మార్పులను గమనించవచ్చు. శ్వాస మార్పులు. జీవక్రియ రేటులో అసమతుల్యత ఫలితంగా... దీంతో కేలరీలు కరిగిపోతాయని పరిశోధకులు చెబుతున్నారు.


అధ్యయనం యొక్క ఫలితాలు: యునైటెడ్ కింగ్‌డమ్‌లోని వెస్ట్‌మినిస్టర్ అధ్యయనంలో సుమారు 10 మంది వ్యక్తులు పాల్గొన్నారు. భయానక చిత్రాలను చూసే వ్యక్తులలో ఆక్సిజన్ స్థాయిలు మరియు వారు సినిమా చూసినప్పుడు వారు విడుదల చేసే కార్బన్ డయాక్సైడ్ పరిమాణాన్ని పరిశోధకులు గుర్తించారు. ఇందులో తీవ్రమైన ఆందోళన మరియు నిరాశ లక్షణాలు ఉన్నాయి. భయానక చిత్రాలపై బరువు తగ్గడం వల్ల కలిగే ప్రభావాలపై మరింత పరిశోధన అవసరమని పరిశోధకులు అంటున్నారు.

భయానక సినిమాలు చూడటం వల్ల ఎన్ని  కేలరీలు బర్న్ చేస్తారు: మీరు సగటున 90 నిమిషాల పాటు భయానక సినిమాలను చూసినప్పుడు, మీ శరీరం నుండి 113 కేలరీలు బర్న్ అవుతాయని అధ్యయనాలు చెబుతున్నాయి. ఇది 30 నిమిషాల నడక కోసం ఖర్చయ్యే కేలరీలతో సమానమని పరిశోధకులు చెబుతున్నారు. హార్రర్ సినిమాలు  కేలరీలను బర్న్ చేయగలవని పరిశోధకులు అంటున్నారు.
కొన్ని చలనచిత్రాలు కేలరీలను బర్న్ చేయడంలో మరింత ప్రభావవంతంగా ఉన్నాయి. అధ్యయనం ప్రకారం, 10 ఫిల్మ్‌లు అధిక కేలరీల బర్నర్‌లుగా చెప్పబడ్డాయి.
 

PREV
click me!

Recommended Stories

ఎముకలు బలంగా ఉండాలంటే వీటి జోలికి వెళ్లకపోవడమే మంచిది!
రాత్రి భోజనం చేశాక ఈ 5 పనులు అస్సలు చేయొద్దు!