విటమిన్ డి లోపం ఉంటే... జరిగేది ఇదే..!

By telugu news teamFirst Published Mar 27, 2023, 2:46 PM IST
Highlights

ఈ సమస్యతో బాధపడే వారు చాలా ఎక్కువైపోయారు. అసలు డి విటమిన్ లోపం ఉంటే... ఏం జరుగుతుందో తెలుసా..? ఇప్పుడు చూద్దాం..
 

విటమిన్ డి లోపం ఉంటే... జరిగేది ఇదే..!

ఈమధ్యకాలంలో చాలా మంది విటమిన్ డి లోపంతో బాధపడుతున్నారు. ముఖ్యంగా స్త్రీలు... దీనిలో ముందు వరసలో ఉన్నారు. ఇంట్లోనే పని.. బయటకు వెళ్లాల్సిన అవసరం లేకపోవడం, కనీసం కొంచెం ఎండ కూడా తగలకపోవడం, సరైన పోషకాహారం తీసుకోకపోవడం ఇలా కారణం ఏదైనా... ఈ సమస్యతో బాధపడే వారు చాలా ఎక్కువైపోయారు. అసలు డి విటమిన్ లోపం ఉంటే... ఏం జరుగుతుందో తెలుసా..? ఇప్పుడు చూద్దాం..

1.విటమిన్ డి లోపంతో బాధపడేవారు నిత్యం అలసటతో బాధపడుతూ ఉంటారు. ఆహారం తీసుకున్నా కూడా ఎందుకో వారికి నీరసంగా అనిపిస్తూ ఉంటుంది. శరీరం ఎప్పుడూ నిద్రను కోరుకుంటూ ఉంటుంది. బాగా ఆయాసంగా, శరీరంలో సత్తువ లేనివారిలా కనపడుతూ ఉంటారు.

2.విటమిన్ డి లోపం ఉన్నవారు.. మంచి నిద్రపోలేరు. చాలా మందికి నిద్ర సమయం ఆసన్నమైనప్పటికీ... బెడ్ మీద పడుకున్న తర్వాత నిద్ర రాదు. విపరీతంగా ఆవలింతలైతే వస్తూ ఉంటాయి కానీ.. నిద్రమాత్రం పట్టదు. విటమిన్ డి లోపం కారణంగానే ఇలా జరుగుతుంది.

3.శరీరంలో విటమిన్ డి లోపం ఉంటే... ఎముకలు బలహీనంగా మారతాయి. శీరరంలో కాల్షియం తగ్గిపోతుంది. కీళ్ల నొప్పులు ఎక్కువ అవుతాయి.

4. విటమిన్ డి లోపం ఉన్నవారు ఎక్కువగా డిప్రెషన్ కి గురౌతారట. మానసికంగా చాలా బలహీనంగా ఉంటారు. మెంట్ గా బ్రేక్ డౌన అవుతూ ఉంటారు

5.విటమిన్ డి లోపం ఉన్నవారిలో జుట్టు లోపం చాలా ఎక్కువగా ఉంటుంది. జుట్టు విపరీతంగా ఊడిపోతుంది. 

6.విటమిన్ డి లోపం ఉన్నవారిలో మజిల్స్ చాలా వీక్ గా మారిపోతాయి. దీంతో బలహీనంగా మారిపోతారు. మీ మోకాళ్ల నొప్పులు ఎక్కువగా వస్తున్నాయి అంటే.... విటమిన్ డి లోపం ఉందేమో చెక్ చేసుకోవడం ఉత్తమం.

7. విటమిన్ డి లోపం ఉన్నవారిని వారి ముఖం చూసి కూడా గుర్తుపట్టవచ్చట. వారి కళ్ల కింద బ్లాక్ సర్కిల్స్ క్లియర్ గా కనిపిస్తాాయి. ముఖంలో తేజస్సు తగ్గిపోతుంది. పేలవంగా కనపడుతుంది. అలాంటివారికి ఉదయం సూర్యరశ్మి చాలా అవసరం.

8.విటమిన్ డి లోపం ఉన్నవారు తరచూ జబ్బున పడుతూ ఉంటారు. కొద్దిగా వాతావరణం మారినా తట్టుకోలేరు. తరచూ జలుబు, దగ్గు లాంటివి ఇబ్బందిపెడుతూ ఉంటాయి.

click me!