దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు.. మీరు ప్రోటీన్ ఫుడ్ ను తినడం లేదని..!

Published : Feb 24, 2023, 09:47 AM IST
దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు.. మీరు ప్రోటీన్ ఫుడ్ ను తినడం లేదని..!

సారాంశం

మన శరీరానికి ప్రోటీన్ ఫుడ్ చాలా చాలా అవసరం. ఇది మన శరీరానికి శక్తినిస్తుంది. జీవక్రియకు సహాయపడుతుంది. శరీరం సక్రమంగా పనిచేయడానికి సహాయపడుతుంది. ఇది లోపిస్తే ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి. 

ప్రోటీన్ అమైనో ఆమ్లాలతో తయారైన మాక్రోన్యూట్రియెంట్. ఇది మన శరీరానికి చాలా అవసరం. దీనిని కండరాల బిల్డింగ్ బ్లాక్స్ అని అంటారు. కండరాల మరమ్మత్తుకు, వాటి నిర్వహణకు ప్రోటీన్లు చాలా ముఖ్యం. అంతేకాదు ఇవి శరీరానికి శక్తిని అందిస్తాయి. హార్మోన్లను ఇవి నియంత్రిస్తాయి. అంతేకాదు ఇవి రసాయన ప్రతిచర్యలను వేగవంతం చేసే ఎంజైమ్లుగా కూడా పనిచేస్తాయి. ఎన్నో రోగాల నుంచి మనల్ని రక్షిస్తాయి. కానీ ఫాస్ట్ ఫుడ్ కు అలవాటై చాలా మంది ప్రోటీన్ ఫుడ్ ను తినడం మానేసారు. ఇలాంటి వారిలోనే ప్రోటీన్ల లోపం ఏర్పడుతుంది. కానీ ఈ ప్రోటీన్ల లోపం వల్ల లేనిపోని అనారోగ్య సమస్యలు వస్తాయి. అవేంటంటే 

బలహీనత, అలసట

మీరు తినే ఆహారంలో ప్రోటీన్లు లేకపోవడం వల్ల మీ శరీరంపై ఎంతో ప్రభావం పడుతుంది. దీనివల్ల బలహీనత, అలసట, కండరాల నష్టం వంటి ఎన్నో సమస్యలు వస్తాయి. ఎందుకంటే ప్రోటీన్ మన శరీరానికి కావాల్సిన ప్రోటీన్ ను అందిస్తుంది. ప్రోటీన్ లోపం వల్ల ఫ్యూచర్ లో కండరాల నష్టానికి ఇది దారితీస్తుంది. ఇది శరీర బలాన్ని తగ్గిస్తుంది. మీ జీవక్రియను నెమ్మదింపజేస్తుంది. అందుకే మీరు బలహీనంగా, అలసటగా ఉంటారు. 

గాయాలు నెమ్మదిగా తగ్గడం

కొన్ని గాయాలు వాటంతటే అవే తగ్గిపోతాయి. అది కూడా తొందరగా. కొన్ని గాయలకు చికిత్స అవసరం కావొచ్చు. అయితే మీ శరీరంలో ప్రోటీన్ లోపం ఉంటే చిన్న చిన్న గాయాలు మానడానికి కూడా ఎంతో సమయం పడుతుంది. శరీరంలో తక్కువ ప్రోటీన్ స్థాయిలు ఉంటే వైద్యం ప్రక్రియను నెమ్మదిస్తుంది. కొత్త కణాలు పునర్నిర్మించడానికి సంవత్సరాల సమయం పట్టొచ్చు. దీంతో గాయాలు నయం కావడం చాలా కష్టమవుతుంది. 

ఆకలి పెరుగుతుంది

మీకు ఎప్పుడూ ఆకలిగా అనిపించినా.. ఎప్పుడూ ఫుడ్ ను తినాలనిపించినా..మీ శరీరంలో ప్రోటీన్ తక్కువగా ఉందని అర్థం చేసుకోవాలి. ప్రోటీన్ సంతృప్తికరమైన మాక్రోన్యూట్రియెంట్. ఇది మీ కడుపును ఎక్కువ సేపు నిండుగా ఉంచుతుంది. అందుకే ఇది మీ శరీరంలో తక్కువగా ఉంటే ఆకలి ఎక్కువగా అవుతుంది. 

రోగనిరోధక పనితీరు తగ్గడం

ప్రోటీన్ లేకపోవడం వల్ల కూడా మీరు తరచుగా రోగాల బారిన పడతారు. ఎందుకంటే రోగనిరోధక వ్యవస్థకు ప్రోటీన్ చాలా అవసరం. వైరస్లు, బ్యాక్టీరియాను మనకు దూరంగా ఉంచడానికి అవసరమైన బూస్ట్ ప్రోటీన్ ఇస్తుంది. మీకు తెలుసా రోగనిరోధక కణాలు అమైనో ఆమ్లాలతో తయారవుతాయి. రోగనిరోధక వ్యవస్థ బలంగా ఉంటేనే వైరల్, బాక్టీరియల్ ఇన్ఫెక్షన్ల నుంచి మనం దూరంగా ఉంటాం.

జుట్టు, గోరు, చర్మానికి సంబంధించిన సమస్యలు

శరీరంలో ప్రోటీన్లు తక్కువగా గోర్లు, జుట్టు, చర్మానికి సంబంధించిన సమస్యలు వస్తాయి. పెళుసైన గోర్లు, పొడి చర్మం, జుట్టు సన్నబడటం వంటి సమస్యలు వస్తాయి. ఎందుకంటే మన చర్మం, జుట్టు, గోర్లు ఎలాస్టిన్, కొల్లాజెన్, కెరాటిన్ వంటి కొన్ని రకాల ప్రోటీన్లతో తయారవుతాయి. అందుకే ప్రోటీన్ లోపం వల్ల ఈ సమస్యలు వస్తాయి. 
 

PREV
click me!

Recommended Stories

Sneeze Reflex: అస‌లు మ‌న‌కు తుమ్ము ఎందుకొస్తుందో తెలుసా.?
ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.. చాలా ప్రమాదం