చిలకగడదుంప ఆరోగ్యానికి చాలా మంచిది. చాలా మంది దీన్ని ఇష్టంగా తింటారు. చిలగడదుంప చాలా పోషకాలతో నిండి ఉంటుంది. చిలగడదుంపను ఎలా తినాలి? తినడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
చిలగడదుంపను తినడం వల్ల కలిగే ప్రయోజనాలు:
ఎక్కువ ఫైబర్, మెరుగైన జీర్ణక్రియ
చిలగడదుంపలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది.
జీర్ణవ్యవస్థను బలపరుస్తుంది.
మలబద్ధక సమస్యను తగ్గించడంలో సహాయపడుతుంది.
కడుపు నిండిపోయినట్లు అనిపిస్తుంది, దీనివల్ల తరచుగా ఆకలి వేయదు.
యాంటీఆక్సిడెంట్లు, రోగనిరోధక శక్తి
చిలగడదుంపలో ఆంథోసైనిన్, బీటా-కెరోటిన్, విటమిన్ సి వంటి శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచుతాయి.