మండుతున్న ఎండల్లో మిమ్మల్ని చల్లగా ఉంచే సూపర్ ఫుడ్స్..!

Published : Apr 04, 2023, 11:37 AM IST
మండుతున్న ఎండల్లో మిమ్మల్ని చల్లగా ఉంచే సూపర్ ఫుడ్స్..!

సారాంశం

సూపర్ ఫుడ్స్ మనల్ని రీఫ్రెష్ గా ఉంచడమే కాదు హైడ్రేట్ గా, ఆరోగ్యంగా కూడా ఉంచుతాయి. వీటిలో మన  శరీరానికి అవసరమైన పోషకాలు, ఖనిజాలు, ఎలక్ట్రోలైట్లు పుష్కలంగా ఉంటాయి.   

ప్రస్తుతం ఎండలు మండిపోతున్నాయి.  ఉదయం 9 గంటలకే బయటకు వెళ్లలేని విధంగా ఎండలు మండుతున్నాయి. దీనివల్ల  ఒంట్లో ఉష్ణోగ్రత పెరుగుతుంది. అయితే కొన్ని సూపర్ ఫుడ్స్ ను మన డైట్ లో చేర్చుకోవడం వల్ల వేడిని సులువుగా తగ్గించుకోవచ్చు. ఈ సూపర్ ఫుడ్స్ రిఫ్రెష్ గా ఉండటమే కాకుండా మనల్ని హైడ్రేట్ గా, ఆరోగ్యంగా ఉంచడానికి అవసరమైన పోషకాలు, ఎలక్ట్రోలైట్లను కూడా అందిస్తాయి. వేసవిలో బాడీ హీట్ ను తగ్గించి చల్లగా ఉంచే ఆహారాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.. 

పుచ్చకాయ

ఈ పండులో వాటర్ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది. ఈ పండులో మన శరీరాన్ని హైడ్రేట్ గా, చల్లగా ఉంచడానికి సహాయపడే అవసరమైన ఎలక్ట్రోలైట్లు ఉంటాయి. దీనిలో లైకోపీన్ కూడా ఉంటుంది. ఇది యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలను కలిగి ఉంటుంది. సూర్యరశ్మి దెబ్బతినకుండా చర్మాన్ని రక్షించడానికి కూడా ఇది సహాయపడుతుంది.

కీరదోసకాయ

దోసకాయలు నీరు, ఎలక్ట్రోలైట్లకు అద్భుతమైన వనరు. వీటిలో విటమిన్ సి కూడా ఉంటుంది. ఇది శరీరంపై శీతలీకరణ ప్రభావాన్ని చూపుతుంది. అలాగే శరీర ఉష్ణోగ్రతను నియంత్రించడానికి సహాయపడుతుంది.

కొబ్బరి నీళ్లు

 కొబ్బరి నీటిలో సహజ ఎలక్ట్రోలైట్లు ఉంటాయి. ఇది చెమట ద్వారా కోల్పోయిన ద్రవాలను, పోషకాలను తిరిగి నింపడానికి సహాయపడుతుంది. దీనిలో పొటాషియం కూడా సమృద్ధిగా ఉంటుంది. ఇది హృదయ స్పందన రేటు, రక్తపోటును నియంత్రించడానికి సహాయపడుతుంది.

పుదీనా

పుదీనాలో హైడ్రేట్, రిఫ్రెష్ లక్షణాలు ఉంటాయి. రిఫ్రెష్ రుచి, శీతలీకరణ ప్రభావం కోసం పుదీనాను వాటర్, స్మూతీలు లేదా సలాడ్లలో వేయొచ్చు. 

పెరుగు

పెరుగులో ప్రోబయోటిక్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి గట్ ను ఆరోగ్యంగా ఉంచుతాయి. అలాగే జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. దీనిలో కాల్షియం, ఇతర ముఖ్యమైన పోషకాలు ఉంటాయి. పెరుగు శరీరాన్ని చల్లబరుచుతుంది. 

అనాస పండు

పైనాపిల్ లో బ్రోమెలైన్ అనే ఎంజైమ్ ఉంటుంది. ఇది యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటుంది. ఇది శరీరంలో మంటను తగ్గించడానికి సహాయపడుతుంది. ఈ పండులో విటమిన్ సి, ఇతర యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఈ పండు సూర్యరశ్మికి మీ చర్మం దెబ్బతినకుండా రక్షించడానికి సహాయపడుతుంది.

టొమాటోలు

టమోటాలలో యాంటీఆక్సిడెంట్లు, లైకోపీన్ పుష్కలంగా ఉంటాయి. ఇవి సూర్యరశ్మికి మీ చర్మం  దెబ్బతినకుండా  ఉంచడానికి సహాయపడతాయి. టమాటాలు విటమిన్ సి కి గొప్ప మూలం. ఇది శరీరంపై శీతలీకరణ ప్రభావాన్ని కలిగి ఉంటుంది.

ఆకుకూరలు

బచ్చలికూర, కాలే, పాలకూర వంటి ఆకుకూరలలో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. దీనిలో అవసరమైన విటమిన్లు, ఖనిజాలు ఉంటాయి. ఇవి శరీరంపై శీతలీకరణ ప్రభావాన్ని చూపిస్తాయి. శరీర ఉష్ణోగ్రతను నియంత్రించడానికి కూడా టమాటాలు సహాయపడతాయి.

నిమ్మ

నిమ్మకాయలో సిట్రిక్ యాసిడ్ ఉంటుంది. ఇది శరీరం పీహెచ్ సమతుల్యతను నియంత్రించడానికి సహాయపడుతుంది. అలాగే శరీర వేడిని తగ్గిస్తుంది. శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచడానికి నిమ్మరసాన్ని తాగొచ్చు. లేదా సలాడ్లు, ఇతర వంటకాల్లో మసాలాగా ఉపయోగించొచ్చు.


 

PREV
click me!

Recommended Stories

Sneeze Reflex: అస‌లు మ‌న‌కు తుమ్ము ఎందుకొస్తుందో తెలుసా.?
ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.. చాలా ప్రమాదం