రోజూ నిమ్మరసం తాగితే ఏమౌతుందో తెలుసా?

Published : Apr 15, 2023, 11:39 AM IST
రోజూ నిమ్మరసం తాగితే ఏమౌతుందో తెలుసా?

సారాంశం

రోగనిరోధక శక్తిని పెంచడం నుంచి చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడం వరకు  నిమ్మరసం మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అయితే రోజూ నిమ్మరసం తాగితే ఏమవుతుందో తెలుసా?   

నిమ్మకాయలు సిట్రస్ పండ్లు. ఇవి పుల్లగా ఉంటాయి. ఈ పండులో విటమిన్ సి, కాల్షియం, ఫోలేట్, పొటాషియం వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచుతాయి. గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి. మూత్రపిండాల్లో రాళ్లను నిరోధిస్తాయి. ఇనుము శోషణను మెరుగుపరుస్తాయి. చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. రోజూ నిమ్మరసం తాగడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం..

గొంతు నొప్పి నుంచి ఉపశమనం 

చిటికెడు తేనె, నిమ్మరసం కలిపిన గోరువెచ్చని నీటిని తాగడం వల్ల గొంతునొప్పి ఇట్టే తగ్గిపోతుంది. నిమ్మకాయలోని విటమిన్ సి గొంతును శుభ్రపరుస్తుంది. అలాగే నమ రోగనిరోధక శక్తిని పెంచుతుంది. 

మూత్రపిండాల్లో రాళ్లను ఏర్పడనీయదు

నిమ్మరసం మూత్రం సిట్రేట్ స్థాయిలను పెంచుతుంది. దీంతో మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడే ప్రమాదం తగ్గుతుంది. సిట్రేట్ కాల్షియంకు అతుక్కుపోతుంది. ఇది మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడకుండా ఉండటానికి కూడా సహాయపడుతుంది.

జీర్ణక్రియకు సహాయపడుతుంది

నిమ్మకాయల తొక్క, గుజ్జులో పెక్టిన్ అనే కరిగే ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది కాలేయంలో జీర్ణ ఎంజైమ్ల ఉత్పత్తిని ప్రోత్సహిస్తుంది. అలాగే మన శరీరం నుంచి వ్యర్థాలను తొలగించడానికి సహాయపడుతుంది.

రక్తంలో చక్కెరను అదుపులో ఉంచుతుంది

ఫైబర్ ఎక్కువగా ఉండే పండ్లను తినడం వల్ల రక్తంలో గ్లూకోజ్ అదుపులో ఉంటుంది. దీంతో షుగర్ లెవల్స్ పెరగకుండా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఇది డయాబెటిస్ వచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తుంది, లేదా డయాబెటిస్ ఉన్నవారిలో రక్తంలో చక్కెర స్థాయిలు పెరగకుండా కాపాడుతుంది. 

బరువు తగ్గడానికి సహాయపడుతుంది

నిమ్మకాయల్లో పెక్టిన్ ఉంటుంది. నిమ్మరసం మన కడుపును ఎక్కువ సేపు నిండుగా ఉంచుతాయి. ఇది మీరు ఆరోగ్యంగా బరువు తగ్గేందుకు సహాయపడుతుంది. దీనిలో ఉండే ఫైబర్ కంటెంట్ ఆకలిని తగ్గిస్తుంది. ఇది శరీర బరువును, కొవ్వును తగ్గించడానికి సహాయపడుతుంది. 

యాంటీఆక్సిడెంట్లకు గొప్ప మూలం

యాంటీ ఆక్సిడెంట్లు మన కణాలను ఫ్రీ రాడికల్స్ నుంచి రక్షిస్తాయి. ఈ ఫ్రీ రాడికల్స్ మన శరీరంలో పెరిగిన ఆక్సీకరణ ఒత్తిడి ఫలితంగా ఉంటాయి.ఈ ఫ్రీ రాడికల్స్ ఎక్కువగా ఉంటే మన కణాలను దెబ్బతీస్తాయి. అలాగే గుండె జబ్బులు, డయాబెటిస్, ఎన్నో రకాల క్యాన్సర్ వంటి దీర్ఘకాలిక సమస్యలకు కారణమవుతాయి.

రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడుతుంది

నిమ్మకాయలలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది మన రోగనిరోధక శక్తిని పెంచే పోషకం. విటమిన్ సి మన శరీరంలో తెల్ల రక్త కణాల ఉత్పత్తిని పెంచడానికి సహాయపడుతుంది. ఇది శరీరాన్ని అంటువ్యాధులు, ఇతర వ్యాధుల నుంచి రక్షించడానికి సహాయపడుతుంది. విటమిన్ సి జలుబు తొందరగా తగ్గేందుకు కూడా సహాయపడుతుంది. విటమిన్ సి మంటను తగ్గిస్తుంది. అలాగే కొల్లాజెన్ ఉత్పత్తిని ప్రోత్సహిస్తుంది. దీంతో గాయాలు తొందరగా మానుతాయి. కొల్లాజెన్ ఒక ముఖ్యమైన ప్రోటీన్. ఇది గాయాలను తొందరగా మాన్పడానికి సహాయపడుతుంది. 

PREV
click me!

Recommended Stories

Headache: ఉదయం లేవగానే తలనొప్పి బాధిస్తోందా..? కారణాలు ఇవే..!
Health Tips: టమాటాలు ఎక్కువగా తింటున్నారా? ఈ సమస్యలు తప్పవు జాగ్రత్త..!