కిడ్నీల్లో రాళ్ల సమస్యా.. ఇంట్లోనే పరిష్కారం

By telugu teamFirst Published Jan 24, 2020, 2:14 PM IST
Highlights

లవణాలు, ఖనిజాలు, కాల్షియం, యూరిక్ ఆమ్లాల కలయికతో ఈ రాళ్ళు మూత్రపిండాలలో ఏర్పడుతాయి. అంతేకాకుండా, ఇవి కొంచం కఠినంగా ఉంటాయి. మూత్రపిండాలలో రాళ్ళు చాలా చిన్నవిగా ఉంటాయి, కానీ యూరిక్ ఆమ్లం, ఇతర ఖనిజాలను ఎక్కువగా శోషించుకోవడం వల్ల అవి పరిమాణంలో పెరుగుతాయి.

కిడ్నీల్లో రాళ్ల సమస్యతో బాధపడేవారు చాలా మందే ఉంటారు. రాళ్ల సైజు చిన్నగా ఉన్నప్పడే గుర్తించకుండా శస్త్ర చికిత్స చేయించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుంది. అంతేకాదు.. కిడ్నీల్లో రాళ్లు ఉన్నవారు కనీసం మూత్ర విసర్జన కూడా సరిగా చేసుకోలేరు. చాలా ఇబ్బంది పడాల్సి ఉంటుంది. 

శరీరం నుండి అదనపు వ్యర్థాలు, ఉప్పు, కాల్షియం, కొన్ని విష పదార్ధాలను ఫిల్టర్ చేసే అవయవంగా కిడ్నీ ఉంటుంది. లవణాలు, ఖనిజాలు, కాల్షియం, యూరిక్ ఆమ్లాల కలయికతో ఈ రాళ్ళు మూత్రపిండాలలో ఏర్పడుతాయి. అంతేకాకుండా, ఇవి కొంచం కఠినంగా ఉంటాయి. మూత్రపిండాలలో రాళ్ళు చాలా చిన్నవిగా ఉంటాయి, కానీ యూరిక్ ఆమ్లం, ఇతర ఖనిజాలను ఎక్కువగా శోషించుకోవడం వల్ల అవి పరిమాణంలో పెరుగుతాయి.

మరి దీనికి పరిష్కారమే లేదా అంటే.. కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఈ సమస్య నుంచి బయటపడే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు చూద్దాం..

మెంతులు: ఒక స్పూన్ మెంతులు రాత్రి పూట నీటిలో నానపెట్టి ఆ నీటిని పొద్దునే తాగితే చక్కటి ఫలితం కనపడుతుంది. అంతేకాకుండా మంచినీరు కూడా ఎక్కువగా తాగాలి. అప్పుడు చిన్న పరిణామంలోని రాళ్లు మూత్రం ద్వారా బయటకు వచ్చేస్తాయి.

కిడ్నీ బీన్స్‌ : వీటిని క్రమం తప్పకుండా తీసుకుంటే కిడ్నీలో రాళ్లు పొడి కావాల్సిందే. కిడ్నీ బీన్స్‌ను నానబెట్టి తరువాత ఉడికించుకుని ఇంగువ కలిపి తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. వీటిలో ఉండే ఫైబర్‌ కిడ్నీ స్టోన్స్‌ను మూత్రం ద్వారా బయటకు విసర్జించేలా చేస్తుంది.
 
ఆపిల్‌ సిడార్‌ వెనిగర్‌ : ఇది కాల్షియం ఆక్సలేట్‌, ఇతర మినరల్స్‌ వల్ల ఏర్పడిన రాళ్లను ముక్కలు చేస్తుంది. భోజనానికి ముందు ఒక టేబుల్‌స్పూన్‌ ఆపిల్‌ సిడార్‌ వెనిగర్‌ తీసుకుంటే కిడ్నీలో ఏర్పడిన రాళ్లు ముక్కలుగా మారి మూత్రం ద్వారా బయటకు పోతాయి.
 
తులసి ఆకులు : ఎండిన తులసి ఆకులను నీళ్లలో వేసి మరిగించి, ఆ నీటిని తాగినా ఫలితం ఉంటుంది. రోజూ మూడుసార్లు ఈ నీరు తాగితే రాళ్లు ఇట్టే కరిగిపోతాయి.
దానిమ్మరసం : రోజూ దానిమ్మ, నిమ్మరసం తాగినా ఫలితం ఉంటుంది.


 

click me!