ఆడవాళ్లు ఈ ఆహారాలను తింటే గుండె జబ్బుల ప్రమాదం తగ్గుతుంది

By Mahesh Rajamoni  |  First Published Mar 4, 2023, 9:41 AM IST

International Women's Day 2023: పురుషులతో పోలిస్తే ఆడవాళ్లే ఎక్కువగా అనారోగ్యం బారిన పడుతుంటారు. అయితే వీళ్లు కొన్ని ఆరోగ్యకరమైన ఆహారాలను తింటే గుండెజబ్బుల ప్రమాదం తగ్గుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.


International Women's Day 2023: గుండెపోటు లక్షణాలు అందరికీ ఒకేలా ఉండవు. ముఖ్యంగా ఆడవారిలో, మగవారిలో ఈ లక్షణాలు డిఫరెంట్ గా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. చాలా మటుకు ఆడవారికి గుండెపోటుకు ముందు లక్షణాలు కనిపించకపోవచ్చు. పలు పరిశోధనల ప్రకారం.. మహిళలకు గుండెపోటు లక్షణాలు వారాల ముందు కనిపిస్తాయి. ఒక్కసారి గుండెపోటు వచ్చిందంటే ఆ తర్వాత చాలా జాగ్రత్తగా ఉండాలి. మీకు తెలుసా మనం తినే ఆహారం కూడా గుండెను ప్రభావితం చేస్తుంది. మన ఆహారపు అలవాట్లను మార్చుకుంటే గుండెపోటు ప్రమాదాన్ని చాలా వరకు తగ్గించుకోవచ్చు.. అయితే కొన్ని రకాల ఆహారాలు గుండెను బలంగా చేస్తాయి. గుండెపోటు ప్రమాదాన్ని కూడా తగ్గిస్తాయి. అవేంటంటే..

చిక్కుళ్లు

Latest Videos

undefined

చిక్కుళ్లు మన గుండెకు ఎంతో మేలు చేస్తాయి. వీటిలో ప్రోటీన్లు, ఫైబర్ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది. ఇవి రక్తపోటును తగ్గిస్తాయి. వీటిలో కేలరీలు తక్కువగా, పోషకాలు ఎక్కువగా ఉంటాయి. ఇలాంటి వాటిని తింటే మీరు సులువుగా బరువు తగ్గుతారు. గుండె జబ్బులు, గుండెపోటు ప్రమాదాన్ని తగ్గించుకోవడానికి బీన్స్, బఠానీలు, కాయధాన్యాలు, చిక్పీస్ వంటి చిక్కుళ్లను రోజూ తినండి. 

ఆలివ్ ఆయిల్

ఆలివ్ ఆయిల్ లో అసంతృప్త కొవ్వులు ఎక్కువగా ఉంటాయి. ఇవి రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిలను మెరుగుపరుస్తాయి. అలాగే గుండె జబ్బులు రాకుండా మనల్ని కాపాడుతాయి. ఆలివ్ ఆయిల్ ను ఉపయోగించడం వల్ల హృదయనాళ సమస్యలు వచ్చే అవకాశాలు తగ్గుతాయని పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. 

తృణధాన్యాలు

తృణధాన్యాలలో ఫైబర్, విటమిన్లు, ఖనిజాలు ఎక్కువగా ఉంటాయి. దీనిలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి కొలెస్ట్రాల్ స్థాయిల ప్రమాదాన్ని తగ్గించడానికి సహాయపడతాయి. గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి.

గింజలు, విత్తనాలు

గింజలు, విత్తనాలలో ఒమేగా 3, ఒమేగా 6 కొవ్వు ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి గుండెతో సహా మన మొత్తం శరీరానికి చాలా అవసరం. గింజలు, విత్తనాలు విటమిన్ ఇ కి మంచి వనరులు. ఇవి గుండెను ఆరోగ్యంగా ఉంచి పనితీరును మెరుగుపరుస్తాయి. 

పొటాషియం

పొటాషియం ప్రతి హృదయ స్పందనలో కీలక పాత్ర పోషిస్తుంది. ఇది రక్తపోటును, గుండె కండరాల సంకోచాలను నిర్వహిస్తుంది. అలాగే గుండె లయను స్థిరంగా ఉంచుతుంది. అందుకే పొటాషియం పుష్కలంగా ఉంటే ఆహారాలను తినండి. అరటి, అవోకాడోలు, గుమ్మడికాయలో పొటాషియం పుష్కలంగా ఉంటుంది.

వెల్లుల్లి

వెల్లుల్లి మన ఆరోగ్యానికి ప్రయోజనకరంగా ఉంటుంది. వెల్లుల్లి రక్తపోటును నియంత్రిస్తుంది. అలాగే కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గిస్తుంది. ఇది నేచురల్ బ్లడ్ థిన్నర్ గా కూడా పనిచేస్తుంది.

సేంద్రీయ టీ 

దీనిలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది శక్తివంతమైన కొలెస్ట్రాల్ ను తగ్గించే లక్షణాలను కలిగి ఉందని, ధమనులలో ఫలకం ఏర్పడకుండా నిరోధించగలదని ఎన్నో అధ్యయనాల్లో నిరూపించబడింది. 

click me!