కరోనా ఎఫెక్ట్.. శ్వాస తీసుకోలేక ఇబ్బందులు.. ఇలా బయటపడొచ్చు

By telugu news teamFirst Published Jul 8, 2020, 12:59 PM IST
Highlights

కొన్ని రకాల ప్రయత్నాలతో.. ఊపిరి తీసుకోవడంలో ఏర్పడుతున్న సమస్యల నుంచి బయటపడొచ్చని నిపుణులు చెబుతున్నారు.

కరోనా వైరస్ రోజురోజుకీ తీవ్ర రూపం దాలుస్తోంది. రోజు రోజుకీ కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. ఆగకుండా దగ్గురావడం, గంటల తరబడి దగ్గు కొనసాగడం, 24 గంటల్లో అలాంటి పరిస్థితులు రెండు మూడుసార్లు ఏర్పడటం,జ్వరం విపరీతంగా ఉండటం, 100 డిగ్రీల ఫారన్‌ హీట్‌లను దాటడం,వాసన గుర్తించలేకపోవడం లాంటి లక్షణాలు ఇప్పటివరకు మనకు తెలిసిందే.

కాగా... ఈ కరోనా తీవ్ర రూపం దాల్చిన తర్వాత.. ఊపిరితీసుకోవడంలో కూడా ఇబ్బందులు వస్తాయి. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది రావడంతో.. చాలా మంది ప్రాణాలు కూడా కోల్పోతున్నారు. అంతేకాకుండా మనిషి మెదడు కూడా పనిచేయకుండా పోతుందని ఇటీవల జరిపిన ఓ సర్వేలో తేలింది.

అయితే... కొన్ని రకాల ప్రయత్నాలతో.. ఊపిరి తీసుకోవడంలో ఏర్పడుతున్న సమస్యల నుంచి బయటపడొచ్చని నిపుణులు చెబుతున్నారు. కరోనా సోకినప్పటికీ.. ధైర్యం పొగొట్టుకోకూడదని చెబుతున్నారు. ప్రతి రోజూ కొద్దిసేపు యోగాసనాలు, వ్యాయామం చేయాలని సూచిస్తున్నారు.

వూహాన్‌లోని జిన్‌యింటాన్‌ ఆస్పత్రికి చెందిన వైద్యుల బృందం 12 మంది కొవిడ్‌-19 పాజిటివ్‌ రోగులపై అధ్యయనం అనంతరం ఈ సమస్యకు ఓ పరిష్కారాన్ని కనుగొన్నారు. 

బాధితులు తలకిందికి వంచి, మంచంపై బోర్లా పడుకుంటే శ్వాస తీసుకోవడంలో ఎలాంటి అవరోధాలు ఎదురుకావడం లేదని గుర్తించారు. ఈ భంగిమలో రోగి నిద్రించినప్పుడు శ్వాసనాళాల ద్వా రా రెండు ఊపిరితిత్తుల్లోకి గాలి ఎలాంటి ఆటంకం లేకుండా ప్రవేశిస్తోందని తెలిపారు.

కరోనా వైరస్ ముక్కు, నోరు ద్వారా గొంతులో చేరి నేరుగా ఊపిరితీత్తుల్లో తిష్ట వేస్తుంది. అక్కడకు వెళ్లిన వైరస్ అక్కడి కణాలను నాశనం చేయడం మొదలుపెడుతుంది. అది చేసే దాడిని తట్టుకొనే రోగ నిరోధక శక్తి శరీరానికి ఉంటే.. తప్పకుండా ప్రాణాలతో బయటపడవచ్చు.

అంతేకాకుండా.. మరీ ముఖ్యంగా.. రోగ నిరోధక శక్తి పెంచుకునే ప్రయత్నం చేయాలి.

click me!