అమ్మాయిలే ఎందుకు ఏడుస్తారు, అబ్బాయిలు ఎందుకు ఏడవరు..?

By telugu news teamFirst Published Jul 6, 2020, 2:51 PM IST
Highlights

అబ్బాయిల బ్రెయిన్ స్ట్రక్చర్ అమ్మాయిల బ్రెయిన్ తో పోలిస్తే డిఫరెంట్ గా ఉంటుందట. ఈ విషయంపై స్విట్జర్లాండ్ లోని యూనివర్శిటీ ఆఫ్ బసేల్, యూనివర్శిటీ ఆఫ్ బసేల్ సైకియాట్రిక్ హాస్పిటల్ కి చెందిన పరిశోధకులు పరిశోధనలు జరిపారు.

అమ్మాయిలకు, అబ్బాయిలకు చాలా విషయాల్లో చాలా వ్యత్యాసం ఉంటుంది. ముఖ్యంగా ఎమోషన్స్ విషయంలో. అమ్మాయిలు చిన్న చిన్న వాటికే సంతోషపడిపోతారు. చిన్న బాధ వచ్చినా తట్టుకోలేరు వెంటనే బోరుమని ఏడ్చేస్తారు. కానీ  అబ్బాయిలు అలా కాదు. 

ఎవరో కొందరు మాత్రమే ఎమోషనల్ గా ఫీలౌతారు. కానీ.. దాదాపు అమ్మాయిలతో పోలిస్తే అబ్బాయిలకు ఎమోషన్స్ చాలా తక్కువనే చెప్పాలి. వాళ్లు బాధ వచ్చినా.. సంతోషం వచ్చినా తొందరగా బయటపడరు. దీనికి సైంటిఫికల్ గా కారణం ఉందటున్నారు నిపుణులు.

అబ్బాయిల బ్రెయిన్ స్ట్రక్చర్ అమ్మాయిల బ్రెయిన్ తో పోలిస్తే డిఫరెంట్ గా ఉంటుందట. ఈ విషయంపై స్విట్జర్లాండ్ లోని యూనివర్శిటీ ఆఫ్ బసేల్, యూనివర్శిటీ ఆఫ్ బసేల్ సైకియాట్రిక్ హాస్పిటల్ కి చెందిన పరిశోధకులు పరిశోధనలు జరిపారు. వారి పరిశోధనలో ఈ విషయం వెల్లడయ్యింది. 

పలువురు అమ్మాయిలు, అబ్బాయిల పై పరిశోధనలు జరిపినట్లు తెలిపారు. కొందరు మినహాయించి చాలా మంది అబ్బాయిల బ్రెయిన్ స్ట్రక్చర్, ఫంక్షనింగ్ డిఫరెంట్ గా ఉందట. అందుకే వారి ఎమోనల్ గా పెద్దగా కనెక్ట్ అవ్వరని నిపుణులు చెబుతున్నారు.

 ఫీలింగ్స్ ని కంట్రోల్ చేసుకునే శక్తి వారి బ్రెయిన్ కి ఉంటుందట. అందుకే వారి బిహేవియర్  డిఫరెంట్ గా ఉంటుందట. అబ్బాయిలు ఎంత భాధ వచ్చినా తొందరగా ఎడవకపోవడానికి అసలు కారణమిదే.

click me!