కివిని తింటే తొందరగా బరువు తగ్గుతారా?

Published : Feb 20, 2023, 04:25 PM IST
కివిని తింటే తొందరగా బరువు తగ్గుతారా?

సారాంశం

కదలకుండా ఒకే దగ్గర కూర్చోవడం వల్ల పొట్టచుట్టూ కొవ్వుపేరుకుపోతుంది. బరువు కూడా బాగా పెరిగిపోతారు. అయితే ఈ రెండూ తగ్గాలంటే మాత్రం రెగ్యులర్ గా వ్యాయామం చేయడంతో పాటుగా సరైన ఆహారం కూడా తీసుకోవాలి. 

కివి పండ్లను ఎక్కువగా న్యూజిలాండ్ లో పండిస్తారు. ఈ పండ్లలో ఎన్నో పోషకాలుంటాయి. ఈ పండును ఫిట్నెస్ ను ఇష్టపడేవారు ఖచ్చితంగా తింటారు. కివిలో యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్ తో పాటుగా ఇతర పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఈ పండు జీర్ణవ్యవస్థను  ఆరోగ్యంగా ఉంచుతుంది. అంతేకాదు ఇది బరువును తగ్గించడంలో ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. అసలు కివి బరువు తగ్గడానికి ఎలా సహాయపడుతుందంటే?

జీర్ణక్రియను సమతుల్యంగా ఉంచుతుంది

కివి విటమిన్లకు, ఖనిజాలకు మంచి వనరు. ఈ పండులో వాటర్ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది. అంతేకాదు దీనిలో ఫైబర్ కంటెంట్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఇది జీర్ణవ్యవస్థను సమతుల్యంగా ఉంచుతుంది. దీన్ని రెగ్యులర్ గా తింటే తిన్న ఆహారం సులువుగా జీర్ణం అవుతుంది. అలాగే మీ శరీరంలో కొవ్వు పేరుకుపోయే అవకాశం తగ్గుతుంది. కివిలో ఉండే ఫైబర్ కంటెంట్ మీ పొట్టను ఎక్కువ సేపు నిండుగా ఉంచుతుంది. దీంతో మీరు ఆరోగ్యాన్ని పాడు చేసే ఆహారాలను తినలేరు. ఫలితంగా మీరు సులువుగా బరువు తగ్గుతారు. 

గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది

కివి జీవక్రియను పెంచుతుంది. బరువు తగ్గడానికి ఇది చాలా చాలా అవసరం. అయితే 100 గ్రాముల కివిలో 61 గ్రాముల కేలరీలు ఉంటాయి. ఈ పండులో గ్లైసెమిక్ ఇండెక్స్ చాలా తక్కువగా ఉంటుంది. ఈ పండులో ఉండే షుగర్ మన శరీరంలో నెమ్మదిగా రిలీజ్ అవుతుంది.  అందుకే కివిలను తింటే శరీరంలో కొవ్వు పేరుకుపోకుండా బరువు తగ్గుతారని డాక్టర్లు చెప్తారు. 

ప్రోటీన్లను విచ్చిన్నం చేస్తుంది

కివిలు యాంటీ ఆక్సిడెంట్లకు మంచి వనరు. ఈ యాంటీ ఆక్సిడెంట్లు మన శరీరంలోని ప్రోటీన్లను విచ్చిన్నం చేస్తాయి. దీంతో ప్రోటీన్లు పూర్తిగా జీర్ణమవుతాయి. ప్రకోప ప్రేగు సిండ్రోమ్ తో బాధపడుతున్న వారికి ఈ పండు ప్రయోజనకరంగా ఉంటుంది. కివి మలబద్దకం, జీర్ణసమస్యలను తగ్గిస్తుంది. జీర్ణవ్యవస్థ ఎంత ఆరోగ్యంగా ఉంటే మీరు అంత ఫాస్ట్ గా బరువు తగ్గుతారు. 

గట్ ఆరోగ్యాన్ని పెంచుతుంది

కివిలో కూడా విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఈ విటమిన్ సి రోగనిరోధక శక్తిని పెంచడమే కాదు పేగు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. రక్తపోటు, కొలెస్ట్రాల్ స్థాయిలను సమతుల్యంగా ఉంచుతుంది. అంతేకాదు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రణలో ఉంచుతుంది. ఈ కారకాలన్నీ మీరు బరువు తగ్గడానికి సహాయపడతాయి. 

జీర్ణ ఆరోగ్యాన్ని కాపాడుతుంది

నేషనల్ సెంటర్ ఫర్ బయోటెక్నాలజీ ఇన్ఫర్మేషన్ ప్రచురించిన ఒక అధ్యయనం ప్రకారం.. కివి పండులో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇది జీర్ణక్రియకు ప్రయోజనకరంగా ఉంటుంది. ఇది అజీర్థి, ఎసిడిటీ, మలబద్దకం, గ్యాస్ వంటి సమస్యలను తగ్గిస్తుంది. 

PREV
click me!

Recommended Stories

Sneeze Reflex: అస‌లు మ‌న‌కు తుమ్ము ఎందుకొస్తుందో తెలుసా.?
ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.. చాలా ప్రమాదం