రొమ్ము క్యాన్సర్ కణాలను చంపే తేనెటీగ విషం?

By telugu news teamFirst Published Sep 15, 2020, 8:05 AM IST
Highlights

ప్రపంచవ్యాప్తంగా అనేకమంది మహిళలు బెస్ట్ క్యాన్సర్ బారిన పడుతున్న విషయం తెలిసిందే. తేనెటీగ విషాల్లో క్యాన్సర్‌ను నిరోధించగల లక్షణాలు ఉన్నాయని ఇంతకుముందు చేసిన అధ్యయనాల్లోనూ వెల్లడైంది. 
 

ఈ మధ్యకాలంలో రొమ్ము క్యాన్సర్ తో బాధపడే మహిళలు రోజు రోజుకీ పెరిగిపోతున్నాయి. కాగా.. ఈ రొమ్ము క్యాన్సర్ కి సరైన మందు కోసం  శాస్త్రవేత్తలు ఎంతో కాలం నుంచి పరిశోధనలు చేస్తూనే ఉన్నారు. కాగా.. ఆస్ట్రేలియాకు చెందిన శాస్త్రవేత్తలు చేసిన ఓ పరిశోధనలో ఓ పురోగతి కనిపించింది.  తేనెటీగల నుంచి సేకరించిన విషాలు.. రొమ్ము క్యాన్సర్ కి కారణమయ్యే కణాలను నాశనం చేయగలవని వారు పేర్కొన్నారు. ఈ విషాల్లో ఉండే మెలిటిన్ అనే సమ్మేళనాన్ని చికిత్సకు లొంగని కఠినమైన క్యాన్సర్ రకాలు ‘ట్రిపుల్ నెగటివ్’, హెచ్ఈఆర్2-ఎన్రిచ్డ్ లపై ప్రయోగించారు.

అయితే ఈ దిశగా మరింత రిశోధన చెయ్యవలసి ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా అనేకమంది మహిళలు బెస్ట్ క్యాన్సర్ బారిన పడుతున్న విషయం తెలిసిందే. తేనెటీగ విషాల్లో క్యాన్సర్‌ను నిరోధించగల లక్షణాలు ఉన్నాయని ఇంతకుముందు చేసిన అధ్యయనాల్లోనూ వెల్లడైంది. 

ప్రస్తుత అధ్యయనం దక్షిణ ఆస్ట్రేలియాలోని హ్యారీ పెర్కిన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ రిసెర్చ్‌లో జరిగింది. ఇది నేచర్ ప్రిసిషన్ అంకాలజీ జర్నల్‌లో ప్రచురితమయ్యింది. 

"ప్రయోగశాలల్లోనూ లేదా ఎలుకలపై ప్రయోగించినప్పుడు అనేక సమ్మేళనాలు సత్ఫలితాలను ఇవ్వొచ్చు. కానీ అవి మనుషులకు ఇచ్చే మందుగా పరిణామం చెందాలంటే వాటిపై ఇంకా విస్తృతంగా పరిశోధనలు చెయ్యాల్సి ఉంటుంది" అని డాక్టర్ స్వార్బ్రిక్ బీబీసీకి తెలిపారు.

click me!