గొంతు నొప్పి ఇబ్బంది పెడుతోందా? తగ్గాలంటే ఇలా చేయండి..

Published : Feb 19, 2023, 11:40 AM IST
గొంతు నొప్పి ఇబ్బంది పెడుతోందా? తగ్గాలంటే ఇలా చేయండి..

సారాంశం

గొంతు నొప్పి వల్ల దురద, చికాకు, మంట వంటి సమస్యలు వస్తాయి. అయితే కొన్ని సులభమైన ఇంటి చిట్కాలతో ఈ నొప్పిని చాలా సులువుగా తగ్గించుకోవచ్చు. ఎలాగంటే..?   

గొంతు నొప్పి తో గొంతులో దురద, చికాకు, మంట కలుగుతుంది. ఏదైనా ఆహారం మింగుతుంటే విపరీతమైన నొప్పి కలగడం గొంతు నొప్పి లక్షణం. ఈ గొంతునొప్పి వల్ల ఆహారాన్నే కాదు.. నీళ్లను మింగడానికి కూడా కష్టంగానే ఉంటుంది. గొంతు నొప్పి చిన్న సమస్య కాబట్టి చాలా మంది హాస్పటల్ కు వెళ్లరు. కానీ ఈ గొంతు నొప్పి రాత్రిళ్లు నిద్రలేకుండా చేస్తుంది. దీనికి వైరల్ లేదా బాక్టీరియల్ ఇన్ఫెక్షన్లే కారణమంటున్నారు నిపుణులు. రోగనిరోధక వ్యవస్థకు ఏదైనా ఆటంకం కలిగిస్తే శ్లేష్మ పొరల వాపు సమస్య వస్తుంది. అయితే ఈ గొంతు నొప్పిని కొన్ని సింపుల్ చిట్కాలతో తగ్గించుకోవచ్చు. ఎలాగంటే..?

ఆపిల్ సైడర్ వెనిగర్

ఆపిల్ సైడర్ వెనిగర్ లో ఎన్నో ఔషదగుణాలుంటాయి. ఇది బరువును తగ్గించడం నుంచి ముఖ అందాన్ని పెంచడం వరకు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కలిగిస్తుంది. అందుకే దీన్ని శతాబ్దాలుగా వైద్యంలో ఉపయోగిస్తున్నారు. దీనిలో ఎసిటిక్ ఆమ్లం ఉంటుంది. ఇది ఇది బ్యాక్టీరియాతో పోరాడటానికి సహాయపడుతుంది. ఫ్లూ లక్షణాలు, దగ్గు, గొంతు నొప్పిని తగ్గించడానికి ఆపిల్ సైడర్ వెనిగర్ బాగా సహాయపడుతుంది. 

తేనె

తేనె సహజ స్వీటెనర్. ఇది గొంతు నొప్పిని తగ్గించడానికి బాగా సహాయపడుతుంది. తేనెలో ఉండే ఔషదగుణాలు సంక్రమణతో పోరాడుతాయి. అలాగే నొప్పిని తగ్గిస్తాయి. అందుకే గొంతు నొప్పి ఉన్నవాళ్లు తేనెను తినాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

గోరువెచ్చని నీటితో గార్గిల్ చేయండి

ఒక కప్పు గోరువెచ్చని నీటిలో 1/4 టీస్పూన్ ఉప్పును వేసి పుక్కిలించండి. గొంతు నొప్పి లేదా దురదగా అనిపించినప్పుడు ఈ నీటిని నోట్లో పోసి పుక్కిలిస్తే సమస్య తగ్గిపోతుంది. ఉప్పును ఉపయోగించడం వల్ల మీ గొంతు కణజాలాలు ద్రవాన్ని విడుదల చేస్తాయి. ఇది వైరస్ ను తొలగించడానికి సహాయపడుతుంది. ఆమ్ల ఉత్పత్తిని తగ్గిస్తుంది. జీర్ణశయాంతర అసౌకర్యాన్ని కూడా తగ్గిస్తుంది.

దాల్చినచెక్క

దాల్చినచెక్క తీయగా ఉంటుంది. ఈ మసాలా దినుసులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. దీనిలో యాంటీ బాక్టీరియల్ లక్షణాలు కూడా ఉంటాయి. జలుబు, ఫ్లూ ను, గొంతునొప్పిని తగ్గించే మందులలో దీనిని ఉపయోగిస్తారు. దాల్చిన చెక్క టీ తాగినా ఈ సమస్యలు తగ్గిపోతాయి. దాల్చినచెక్క బాదం పాలను కూడా తయారుచేసి తాగొచ్చు. ఇది గొంతు నొప్పి నుంచి ఉపశమనం కలిగిస్తుంది.

మెంతులు

మెంతులను ఎన్నో అనారోగ్య సమస్యలను తగ్గించడానికి ఉపయోగిస్తారు. మెంతి గింజలను లేదా నూనెను ఉపయోగించడం లేదా టీలో తీసుకోవడం వల్ల గొంతు నొప్పి ఇట్టే తగ్గిపోతుంది. మెంతుల్లో యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. ఇవి ఎన్నో అనారోగ్య సమస్యలను తగ్గిస్తాయి. 

PREV
click me!

Recommended Stories

Sneeze Reflex: అస‌లు మ‌న‌కు తుమ్ము ఎందుకొస్తుందో తెలుసా.?
ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.. చాలా ప్రమాదం