కొలెస్ట్రాల్ ను తగ్గించుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ సీజనల్ కూరగాయలను మిస్ కాకుండా తినండి.

Published : Mar 10, 2023, 01:54 PM IST
కొలెస్ట్రాల్ ను తగ్గించుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ సీజనల్ కూరగాయలను మిస్ కాకుండా తినండి.

సారాంశం

కూరగాయలు ఎక్కువగా ఉండే ఆహారాన్ని తింటే శరీరంలో పెరిగిపోయిన కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గిపోతాయి. అలాగే మీ మొత్తం ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది.  

మన ఆహారపు అలవాట్లు, నిశ్చల జీవనశైలి వల్ల మన శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు పెరిగిపోతాయి. పెరిగిన కొలెస్ట్రాల్ స్థాయిలు గుండె జబ్బులకు దారితీస్తుంది. అంతేకాదు ఊబకాయం, ఆల్కహాల్ ను ఎక్కువగా తాగడం, సిగరెట్ ను  కాల్చడం, శారీరక శ్రమ లేకపోవడం, పోషకాహార లోపం, అధిక రక్తపోటు వంటి అంశాలు కూడా గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతాయి. 

అయితే కూరగాయలు ఎక్కువగా ఉండే ఆహారం కొలెస్ట్రాల్ ను తగ్గించడానికి, మన మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపర్చడానికి సహాయపడుతుంది. ఆకుపచ్చ కూరగాయలలో యాంటీఆక్సిడెంట్లు, ఫైబర్, ఇతర ముఖ్యమైన పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి హృదయనాళ వ్యవస్థ సరిగ్గా పనిచేయడానికి సహాయపడతాయి. ఆరోగ్యకరమైన కొలెస్ట్రాల్ స్థాయిని పెంచడానికి సహాయపడతాయి. ఇందుకోసం ఎలాంటి సీజనల్ కూరగాయలను తినాలంటే..

బ్రోకలీ

బ్రోకలీలో విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. ఈ కూరగాయలో కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడానికి సహాయపడే సల్ఫోరాఫేన్ అనే రసాయనం కూడా ఉంటుంది. బ్రోకలీని పచ్చిగా, ఆవిరిగా లేదా వేయించి లేదా ఉడకబెట్టి తినొచ్చు. దీన్ని సలాడ్లు, సూప్లలల్లో కూడా వాడుతారు. 

క్యారెట్లు

క్యారెట్లలో ఫైబర్, విటమిన్స్, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. వాటిలో బీటా కెరోటిన్ కూడా ఉంటుంది. ఇది మంటను తగ్గించడానికి, శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడానికి బాగా సహాయపడుతుంది. వీటిని ఆవిరి లేదా కాల్చినవి, సలాడ్లు, సూప్లలో తీసుకోవచ్చు. 

బ్రస్సెల్స్ మొలకలు

బ్రస్సెల్స్ మొలకల్లో పోషకాలు, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. వీటిలో ఫైబర్ కంటెంట్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఇది కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడానికి సహాయపడుతుంది. బ్రస్సెల్స్ మొలకలు రుచికరంగా ఉంటాయి. వీటిని కాల్చి, ఉడికించినవి లేదా సైడ్ డిష్ లో తినొచ్చు. 

బచ్చలికూర

బచ్చలికూర పోషకాల బాండాగారం. దీనిలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. దీనిలో ఫైబర్ కంటెంట్ కూడా అధికంగా ఉంటుంది. ఇది కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడానికి సహాయపడుతుంది. బచ్చలికూరను తాజాగా తినొచ్చు లేదా సలాడ్లు, ఆమ్లెట్లు, సూప్లలో కూడా వేసుకుని తినొచ్చు. 

చిలగడదుంపలు

చిలగడదుంపలు టేస్టీగా ఉంటాయి. వీటిని కాల్చి లేదా ఉడకబెట్టి కూడా తినొచ్చు. చిలగడదుంపల్లో విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్ అధికంగా ఉంటాయి. వీటిలో బీటా కెరోటిన్ కూడా ఉంటుంది. ఇది మంటను తగ్గించడానికి, కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడానికి సహాయపడుతుంది.

PREV
click me!

Recommended Stories

ఉదయమా లేక రాత్రా..? చల్లని బీర్ తాగడానికి మంచి సమయం ఏది?
ఉసిరిని రెగ్యులర్ గా తీసుకుంటే కలిగే లాభాలు ఇవే!