చాయ్ పరాఠా అలవాటు ఉందా? ఈ విషయం తెలిస్తే మళ్లీ చాయ్ ని అలా తాగరు..

Published : Feb 24, 2023, 06:34 AM IST
చాయ్ పరాఠా అలవాటు ఉందా? ఈ విషయం తెలిస్తే మళ్లీ చాయ్ ని అలా తాగరు..

సారాంశం

మార్నింగ్ ఎప్పుడు లేస్తే అప్పుడు టీని తాగేవారున్నారు. మోతాదులో  టీని తాగడం మంచిదే. దీనివల్ల తక్షణ శక్తి వస్తుంది. అయితే టీ కంటే ముందు నీళ్లను తాగాలని ఆరోగ్య నిపుణులు చెప్తారు. ఎందుకంటే పరిగడుపున టీని తాగితే గ్యాస్ట్రిక్ తో పాటుగా ఎన్నో సమస్యలొస్తాయి.   

లెమన్ టీ, బ్లాక్ టీ, బాదం టీ, అల్లం టీ, మసాలా టీ అంటూ ఎన్నో రకాల టీలు ఉన్నాయి. ఏదేమైనా భారతీయులు కూడా టీని తెగ తాగేస్తున్నారు. ఆఫీసుల్లో పనిచేసేవారైతే ఏకంగా రోజుకు ఐదారు సార్లు కూడా తాగుతుంటారు. కానీ టీని మోతాదులో తాగితేనే ఆరోగ్యానికి మంచి జరుగుతుంది. అయితే కొందరు వట్టి టీని మాత్రమే తాగితే కొంతమంది మాత్రం చాయ్ తో బిస్కట్లు , బ్రెడ్ ను తింటుంటారు. ఇంకొందరు మాత్రం పరాఠాను తింటారు. వేడిగా, మెత్తగా ఉండే పరాఠాలను టీ లో  ముంచుకుని తినడం చాలా మందికి ఇష్టం. కానీ టీతో పాటుగా పరాఠా తినడం ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.  భోజనంతో టీ తాగడం  వల్ల  ఎన్ని సమస్యలొస్తాయో తెలిస్తే దాని జోలికే వెల్లరు. 

ఎసిడిటీ రిస్క్

లోడెడ్ పరాఠాలు వంటి భారీ భోజనంతో టీ తాగితే తీవ్రమైన కడుపు ఉబ్బరం, యూరిక్ యాసిడ్ రిప్లెక్స్ సమస్యలు వస్తాయి. ఎందుకంటే టీ లేదా కాఫీని తాగేటప్పుడు పరాఠాలను తినడం వల్ల మీ కడుపులో యాసిడ్ బేస్ సమతుల్యత దెబ్బతింటుంది.

రక్తహీనత

పలు అధ్యయనం ప్రకారం.. టీలోని ఫినోలిక్ రసాయనానలు కడుపు పొరలో ఇనుము కాంప్లెక్స్  ఏర్పాటును ప్రేరేపిస్తాయి. ఇనుము శోషణను నిరోధిస్తాయి. దీనివల్ల రక్తహీనత సమస్య వస్తుంది. ముఖ్యంగా రక్తహీనత సమస్య ఇప్పటికే ఉన్నవారు టీని భోజనంతో అస్సలు తీసుకోకూడదు.

పోషణ శోషణను నివారిస్తుంది

మన శరీరంలో ప్రోటీన్ శోషణను ఆపేస్తే.. టీలో ఉండే టానిన్లు ప్రోటీన్లతో సంకర్షణ చెంది యాంటీ న్యూట్రియెంట్లుగా పనిచేస్తాయి. ఒక అధ్యయనం ప్రకారం.. టానిన్లు ప్రోటీన్ జీవక్రియను సుమారుగా 38 శాతం నెమ్మదింపజేస్తాయి. ఇది టీ లోని పోషకాలను శరీరం ఉపయోగించకుండా చేస్తుంది. అందుకే టీని పరాఠాతో అస్సలు తినకండి.

టీని ఎలా తాగాలి? 

టీని తాగేముందు గ్లాస్ నీళ్లను తాగండి. ఆ తర్వాత కప్పు టీ లేదా కాఫీని తాగొచ్చు. అయితే మీరు భోజనం చేస్తే మాత్రం వెంటనే తాగడకూడదు. భోజనం చేసిన 45 నిమిషాల తర్వాత మాత్రమే టీని తాగాలి. బ్రేక్ ఫాస్ట్ లేదా మధ్యాహ్న భోజనం తర్వాత అంటే ఒక గంట తర్వాత  లేదా సాయంత్రం స్నాక్స్ తినే సమయంలో టీని తాగొచ్చు.

ఫైనల్ గా..

మీకు ఎనర్జిని ఇవ్వడానికి, రోజును సరిగ్గా ప్రారంభించడానికి చక్కెర లేని టీ, మూలికా టీ, తేనె టీ లేదా నిమ్మకాయ టీని లేదా సాదా గోరువెచ్చని నీటిని తాగాలని పోషకాహార నిపుణులు సలహానిస్తున్నారు. ఆ తర్వాత మీరు రోజు తాగే టీని తాగొచ్చు. 

PREV
click me!

Recommended Stories

Sneeze Reflex: అస‌లు మ‌న‌కు తుమ్ము ఎందుకొస్తుందో తెలుసా.?
ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.. చాలా ప్రమాదం