జుట్టు విపరీతంగా రాలుతోందా..? గంధపు నూనెతో పరిష్కారం..!

By telugu news teamFirst Published Dec 24, 2022, 1:43 PM IST
Highlights

ఈ గంధం నూనెతో ఉపయోగించి మన జుట్టురాలే సమస్యను కూడా పరిష్కరించవచ్చట. అంతేకాకుండా...  చాలా ప్రయోజనాలుు ఉన్నాయట అవేంటో చూద్దాం...
 

దాదాపు మన అందరి ఇళ్లల్లో గంధం ఉంటుంది. గంధాన్ని కేవలం మనం మతపరంగా మాత్రమే వినియోగిస్తారు.  అంతేకాకుండా.... అనేక ఆరోగ్య సమస్యలను నయం చేసేందుకు కూడా గంధం ఉపయోగిస్తూ ఉంటారు.అయితే... ఈ గంధం నూనెతో ఉపయోగించి మన జుట్టురాలే సమస్యను కూడా పరిష్కరించవచ్చట. అంతేకాకుండా...  చాలా ప్రయోజనాలుు ఉన్నాయట అవేంటో చూద్దాం...

గంధపు నూనె  ప్రయోజనాలు...

ఒత్తిడి లేదా డిప్రెషన్‌తో బాధపడేవారు చందన నూనెను ఉపయోగించవచ్చు. గంధపు నూనెలో రసాయన సమ్మేళనం α- శాంటలోల్ ఉంటుంది. దాని నూనెలోని కొన్ని చుక్కలను పీల్చడం వల్ల ఒత్తిడిని తగ్గించుకోవచ్చు.

జుట్టు రాలడం ఆగిపోతుంది...

జుట్టు మూలాల్లో డెడ్ స్కిన్ పేరుకుపోవడం వల్ల, జుట్టు తరచుగా పెళుసుగా మారుతుంది. జుట్టు రాలడం ప్రారంభమవుతుంది. అంతేకాదు దీని వల్ల జుట్టు పెరగడం కూడా ఆగిపోతుంది. అందువల్ల, గంధపు నూనె మృత చర్మాన్ని తొలగించడంలో సహాయపడటం ద్వారా జుట్టు రాలడాన్ని నివారించడంలో సహాయపడుతుంది.

రక్తపోటును నియంత్రిస్తుంది...

అధిక రక్తపోటు సమస్యలు ఉన్నవారికి, చందనం నూనె చాలా ఉపయోగకరంగా ఉంటుంది. గంధపు నూనె  సువాసన హార్మోన్లను సక్రియం చేస్తుంది, ఇది రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది.

రక్తప్రసరణ బాగా జరగడం వల్ల హృదయ స్పందన మెరుగ్గా ఉంటుంది. దీంతో గుండె సంబంధిత సమస్యలు కూడా దూరమవుతాయి. గంధపు నూనె కూడా రక్తపోటును సమతుల్యం చేయడంలో చాలా ప్రయోజనకరంగా ఉంటుందని చెప్పవచ్చు.
 


వాపు సమస్య మెరుగుపడుతుంది...

శాండల్‌వుడ్ ఆయిల్‌లో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి, ఇది మంటను తగ్గించడమే కాకుండా చర్మంపై మంట వల్ల కలిగే ఎరుపును కూడా తగ్గిస్తుంది.


నిద్ర సమస్యకు పరిష్కారం...

నిద్రలేమితో బాధపడే వారికి చందనం నూనె చాలా ఉపయోగపడుతుంది. అలాంటి రోగులకు చందనం నూనెతో మర్దన చేస్తే నిద్రలేమి సమస్య నయమవుతుంది. గంధపు నూనె కేంద్ర నాడీ వ్యవస్థలో ఒత్తిడిని తగ్గిస్తుంది.


మెరుగైన మానసిక స్థితి కోసం

మూడ్ బాగుంటే గంధపు నూనెను ఇతర మసాజ్ నూనెలతో కలిపి శరీరమంతా మసాజ్ చేసుకోవచ్చు. గంధపు సువాసన మనసును ప్రశాంతపరుస్తుంది. ఇది మానసిక స్థితిని బాగా ఉంచడానికి సహాయపడుతుంది.

click me!