
కొంతమంది వేసవిలో కూల్ డ్రింక్స్ ను తయారుచేయడానికి పండ్లు, కూరగాయలతో ప్రయోగాలు చేస్తుంటారు. సమ్మర్ ఫ్రూట్స్ గురించి చెప్పాలంటే లిస్ట్ చాలా పెద్దదే. ఏదేమైనా ఈ సీజన్ లో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉండే పండ్లను ఖచ్చితంగా తినాలి. ఇలాంటి వాటిలో మస్క్ మిలన్ ఒకటి. ఎందుకంటే ఈ పండు తీయగా ఉండటమే కాకుండా దీనిలో వాటర్ కంటెంట్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఈ పండును తింటే శరీరం హైడ్రేట్ గా ఉండటమే కాకుండా మొత్తం ఆరోగ్యం బాగుంటుంది. అందుకే చాలా మంది వేసవిలో మస్క్ మెలన్ షేక్ లను తయారుచేసి తాగుతుంటారు. ఏదేమైనా మస్క్ మిలన్ షేక్ లో పాలను అస్సలు కలపకూడదని ఆరోగ్య నిపుణులు చెబున్నారు. ఎందుకో తెలుసుకునే ముందు ఈ పండు ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ
మస్క్ మిలన్ లో ఫైబర్, వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇది అజీర్థి, మలబద్దకం వంటి సమస్యలను తగ్గిస్తుంది. ఈ పండులోని ఫైబర్ కంటెంట్ సరైన ప్రేగు కదలికలను నియంత్రించడానికి సహాయపడుతుంది. ఫైబర్ మలం సాఫీగా కదలడానికి సహాయపడుతుంది. అలాగే ఆహార కోరికలను నియంత్రించడానికి కూడా సహాయపడుతుంది.
రోగనిరోధక శక్తిని పెంచుతుంది
మస్క్ మిలన్ లో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది యాంటీ ఆక్సిడెంట్. ఇది రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడుతుంది. ఇందులో ఉండే ఫైటోకెమికల్స్, బీటా కెరోటిన్, విటమిన్ ఎ గట్ పనితీరును సజావుగా ఉంచడానికి సహాయపడతాయి.
బరువు తగ్గడానికి సహాయపడుతుంది
మస్క్ మిలన్ లో కేలరీలు తక్కువగా ఉంటాయి. ఇది బరువు తగ్గేవారికి బాగా సహాయపడుతుంది. పోషకాలు పుష్కలంగా ఉండే ఈ పండులో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇది మీ శరీరానికి నీటి అవసరాన్ని తీరుస్తుంది. అలాగే బరువు తగ్గడానికి కూడా మీకు సహాయపడుతుంది.
బహిష్టు తిమ్మిరి నుంచి ఉపశమనం
నెలసరి సమయంలో తిమ్మిరి, నొప్పి సర్వసాధారణం. వీటిని తగ్గించుకోవడానికి మందులను వాడుతుంటారు. ఈ మందులను వాడకూడదంటే.. మస్క్ మిలన్ ను తినండి. ఈ పండు గడ్డలను కరిగించడానికి, కండరాల తిమ్మిరిని తగ్గించడానికి, రుతుక్రమ ప్రవాహాన్ని నియంత్రించడానికి సహాయపడుతుంది.
మస్క్ మెలన్, పాలు
విభిన్న రుచులు కలిగిన రెండు ఆహారాలను కలిపినప్పుడు అది కడుపులోని జీర్ణ అసమతుల్యతకు దారితీస్తుందని నిపుణులు అంటున్నారు. పేలవమైన ఆహార కలయికలు కూడా అజీర్ణం, గ్యాస్ ఏర్పడటానికి కారణమవుతాయి. పాలు, మస్క్ మిలన్ ను కూడా కలపకూడదు. పుచ్చకాయలో మూత్రవిసర్జన లక్షణం ఉంటుంది. ఇది శరీరం నుంచి విషాన్ని బయటకు పంపడానికి సహాయపడుతుంది. పాలు జీర్ణం కావడానికి ఎక్కువ సమయం అవసరం. కాబట్టి వాటిని కలపడం జీర్ణ సమస్యలు వస్తాయి. ఈ కాంబినేషన్ ను తింటే మీకు రోజంతా అసౌకర్యంగా, అలసటగా అనిపిస్తుంది. మస్క్ మిలన్ ను వీటితో కూడా తినకూడదు..
నీరు
మస్క్ మిలన్ ను నీటితో తీసుకోవడం వల్ల జీర్ణశయాంతర ప్రేగుల సహజ పనితీరుకు ఆటంకం కలుగుతుంది. శరీర జీవక్రియను దెబ్బతీస్తుంది. కాబట్టి పుచ్చకాయను నీటితో కలిపి తినకపోవడమే మంచిది. పండులో ఉండే పోషకాలు జీవక్రియను నెమ్మదిస్తాయి. ఎసిడిటీకి కారణమవుతాయి.
దోసకాయ
దోసకాయ, మస్క్ మిలన్ ను కలిపి తినడం అంత మంచిది కాదు. ఎందుకంటే దీన్ని తినడం వల్ల కొంతమందికి ఉబ్బరం వంటి జీర్ణ సమస్యలు వస్తాయి.